బీసీసీఐకి కొత్త సీఈవో
ముంబై: బీసీసీఐ నూతన సీఈవోగా రాహుల్ జోహ్రీని నియమిస్తున్నట్టు భారత క్రికెట్ బోర్డు ప్రకటించింది. జూన్ 1 నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ బుధవారం ప్రకటించారు. ప్రస్తుతం రాహుల్ డిస్కవరీ నెట్ వర్క్స్ ఏసియా, ఫసిఫక్ కి ఉపాధ్యక్షునిగా, జనరల్ మేనేజర్ ఆఫ్ సౌత్ ఏషియాగా సేవలందిస్తున్నారు.
బోర్డు అధ్యక్షుడు శశాంక్ మనోహర్ మాట్లాడుతూ.. రాహుల్ కి ఉన్న అపారమైన అనుభవం బీసీసీఐకి ఎంతగానో ఉపమోగపడుతుందని అన్నారు. రాహుల్ జోహ్రీ నియామకం పట్ల ఎంతో గర్వంగా ఉన్నమని ఆయన పేర్కొన్నారు. రాహుల్ ను సాదరంగా బోర్డులోకి ఆహ్వానిస్తున్నామని తెలిపారు. బీసీసీఐ సీఈవోగా నియామకంపై రాహుల్ స్పందిస్తూ.. ఇది తనకు లభించిన గొప్ప అవకాశంగా పేర్కొన్నారు. కోట్లాది మంది క్రికెట్ అభిమానులకు సేవ చేసే అవకాశం లభించడం సంతోషకరమన్నారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన బోర్డు అధ్యక్షుడికి కృతజ్ఞతలు తెలిపారు.