ప్రముఖ ఆహార, పానీయాల తయారీ సంస్థ పెప్సికో ఇండియా సీఈఓగా 'జాగృత్ కొటేచా' (Jagrut Kotecha) బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత చీఫ్ ఎగ్జిక్యూటివ్ 'అహ్మద్ ఎల్ షేక్'కు కంపెనీ మిడిల్ ఈస్ట్ బ్రాంచ్ బాధ్యతలు అప్పగించిన తర్వాత కొటేచాను సీఈఓగా ఎంపిక చేశారు.
కొటేచా ముంబై యూనివర్సిటీ నుంచి బీఈ, నర్సీ మోంజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ నుంచి మాస్టర్ అఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (MBA) పూర్తి చేశారు. చదువు పూర్తయిన తరువాత క్యాడ్‌బరీ ఇండియా సేల్స్‌లో చేరి 1994 వరకు కొనసాగారు. ఆ తరువాత పెప్సికో ఇండియాలో సేల్స్ అండ్ మార్కెటింగ్‌లో అడుగుపెట్టి 1997లో ప్రాంతీయ సేల్స్ మేనేజర్‌గా, 1999లో మార్కెటింగ్ మేనేజర్‌గా పనిచేశారు. ఆ తరువాత థాయ్‌లాండ్, ఫిలిప్పీన్స్, మలేసియా, సింగపూర్, బృనియా, మంగోలియా దేశాల్లో కూడా పనిచేశారు.
జాగృత్ కొటేచా పెప్సికో ఇండియా సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన సందర్బంగా పెప్సికో ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ & సౌత్ ఏషియా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ యూజీన్ విల్లెమ్‌సెన్ మాట్లాడుతూ.. భారతదేశం కంపెనీకు కీలకమైన మార్కెట్ అని, ఇది కొటేచా నేతృత్వంలో మరింత ముందుకు సాగుతుందని తెలిపారు.
ఇదీ చదవండి: యూపీఐ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నారా.. జర భద్రం!
గత కొంత కాలంగా పెప్సికో కుటుంబంలోనే ఉన్న కొటేచా భారతదేశంలో కంపెనీ వ్యాపారాన్ని మరింత బలపరుస్తారని పలువురు ఆశాభావం వ్యక్తం చేశారు. పెప్సికో ఇండియా గత సెప్టెంబర్‌లో రూ. 778 కోట్ల పెట్టుబడితో అస్సాంలోని నల్‌బారిలో తన మొదటి ఆహార తయారీ ప్లాంట్‌ను ప్రకటించింది. ఇది 2025 నాటికి పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment