PepsiCo CEO
-
పెప్సికో ఇండియా సీఈఓగా జాగృత్ కొటేచా
ప్రముఖ ఆహార, పానీయాల తయారీ సంస్థ పెప్సికో ఇండియా సీఈఓగా 'జాగృత్ కొటేచా' (Jagrut Kotecha) బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత చీఫ్ ఎగ్జిక్యూటివ్ 'అహ్మద్ ఎల్ షేక్'కు కంపెనీ మిడిల్ ఈస్ట్ బ్రాంచ్ బాధ్యతలు అప్పగించిన తర్వాత కొటేచాను సీఈఓగా ఎంపిక చేశారు. కొటేచా ముంబై యూనివర్సిటీ నుంచి బీఈ, నర్సీ మోంజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ నుంచి మాస్టర్ అఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (MBA) పూర్తి చేశారు. చదువు పూర్తయిన తరువాత క్యాడ్బరీ ఇండియా సేల్స్‌లో చేరి 1994 వరకు కొనసాగారు. ఆ తరువాత పెప్సికో ఇండియాలో సేల్స్ అండ్ మార్కెటింగ్‌లో అడుగుపెట్టి 1997లో ప్రాంతీయ సేల్స్ మేనేజర్‌గా, 1999లో మార్కెటింగ్ మేనేజర్‌గా పనిచేశారు. ఆ తరువాత థాయ్‌లాండ్, ఫిలిప్పీన్స్, మలేసియా, సింగపూర్, బృనియా, మంగోలియా దేశాల్లో కూడా పనిచేశారు. జాగృత్ కొటేచా పెప్సికో ఇండియా సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన సందర్బంగా పెప్సికో ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ & సౌత్ ఏషియా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ యూజీన్ విల్లెమ్సెన్ మాట్లాడుతూ.. భారతదేశం కంపెనీకు కీలకమైన మార్కెట్ అని, ఇది కొటేచా నేతృత్వంలో మరింత ముందుకు సాగుతుందని తెలిపారు. ఇదీ చదవండి: యూపీఐ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నారా.. జర భద్రం! గత కొంత కాలంగా పెప్సికో కుటుంబంలోనే ఉన్న కొటేచా భారతదేశంలో కంపెనీ వ్యాపారాన్ని మరింత బలపరుస్తారని పలువురు ఆశాభావం వ్యక్తం చేశారు. పెప్సికో ఇండియా గత సెప్టెంబర్‌లో రూ. 778 కోట్ల పెట్టుబడితో అస్సాంలోని నల్బారిలో తన మొదటి ఆహార తయారీ ప్లాంట్‌ను ప్రకటించింది. ఇది 2025 నాటికి పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
‘రాజకీయాల్లోకి వస్తే ప్రపంచ యుద్ధమే’
న్యూయార్క్ : తాను రాజకీయాల్లోకి వస్తే మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది.. రాజకీయాలు తనకు సరిపడవంటున్నారు పెప్సీకో మాజీ సీఈవో ఇంద్ర నూయి. ప్రతిష్టాత్మక ఏషియా సోసైటి ఫౌండేషన్ అందించే ‘గేమ్ చేంజర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును అందుకున్న సందర్భంగా ఇంద్ర నూయి పలు విషయాల గురించి మాట్లాడారు. ‘ట్రంప్ క్యాబినేట్లో మీరు జాయిన్ అవ్వొచ్చు కదా’ అనే ప్రశ్నకు సమాధానంగా ఆమె ‘నాకు రాజకీయాలు సరిపోవు. నాకు సరిగా మాట్లడటమే రాదు. ఇంక లౌక్యంగా ఎలా మాట్లాడగలను.. ఒకవేళ నేను గనక రాజకీయాల్లోకి వస్తే మూడో ప్రపంచ యుద్ధమే వస్తుంది’ అంటూ ఇంద్ర నూయి చమత్కరించారు. పెప్పీకో సీఈవో బాధ్యతల నుంచి తప్పుకుంటానని ఈ నెల 3న ఇంద్ర నూయి ప్రకటించారు. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ ‘దాదాపు 40 ఏళ్లుగా నా రోజు ఉదయం 4 గంటలకు ప్రారంభమయ్యేది. రోజుకు దాదాపు 18 - 20 గంటలు పనిచేసే దాన్ని. కానీ ఇప్పుడు నాకు విశ్రాంతి దొరికింది. ఇప్పుడు నేను రోజుకు కనీసం 6 గంటలు ఏకధాటిగా నిద్రపోవడం ఎలా అనే విషయాన్ని నేర్చుకోవాలి. వీలైనన్ని దేశాలు చుట్టి రావాలి’ అంటూ చెప్పుకొచ్చారు. -
తప్పుకుంటున్న పెప్సీకో బాస్ ఇంద్రా నూయి
సాక్షి, న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ బిజినెస్ దిగ్గజం పెప్సీ కంపెనీ సీఈవో భారత్‌కు చెందిన ఇంద్రా కృష్ణమూర్తి నూయి (62) పదవీ విరమణ చేయనున్నారు. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మహిళా వ్యాపారవేత్తల్లో ఒకరైన ఇంద్రానూయి త్వరలోనే తన బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. ఈ మేరకు కంపెనీ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. పెప్సీకో సంస్థతో 24 సంవత్సరాల అనుబంధం, సీఈవోగా 12 ఏళ్ల సుదీర్ఘ సేవల అనంతరం ఆమె ఈ ఏడాది అక్టోబర్ 3వ తేదీన తన పదవికి రాజీనామా చేయనున్నారు. ఇంద్రా నూయి స్థానంలో.. ఆ కంపెనీ ప్రెసిడెంట్ రామన్ లగౌర్తా కొత్త సీఈవోగా బాధ్యతలు స్వీకరిస్తారు. అయితే 2019 ఆరంభం వరకు ఆమెనే చైర్మన్‌గా కొనసాగుతారు. ఇండియాలో పుట్టిపెరిగి, పెప్సీకో లాంటి అసాధారణ సంస్థను నడిపించే అవకాశం వస్తుందని తాను ఊహించలేదని నూయి వ్యాఖ్యానించారు. సీఈవోగా తమ ఉత్పత్తులతో ఊహించిన దాని కంటే ప్రజల జీవితాల్లో మరింత అర్ధవంతమైన ప్రభావం చూపానన్నారు. నేడు చాలా దృఢంగా ఉన్న పెప్సీకో కంపెనీ భవిష్యత్తులో కూడా మరిన్ని విజయాలు సాధించాలని ఆమె ఆకాంక్షించారు. కంపెనీకి ఇన్నాళ్లు సేవలందించినందుకు తనకు చాలా గర్వంగా ఉందంటూ ట్వీట్ చేశారు. Today is a day of mixed emotions for me. @PepsiCo has been my life for 24 years & part of my heart will always remain here. I'm proud of what we've done & excited for the future. I believe PepsiCo’s best days are yet to come. https://t.co/sSNfPgVK6W pic.twitter.com/170vIBHY5R — Indra Nooyi (@IndraNooyi) August 6, 2018 -
మూడో అత్యంత శక్తివంత మహిళ ఇంద్రా నూయీ
న్యూయార్క్: పెప్సికో సీఈవో, భారత సంతతికి చెందిన ఇంద్రా నూయీ 2014 ఏడాదికి ప్రపంచంలోనే మూడో అత్యంత శక్తివంతమైన మహిళా వ్యాపారవేత్త(బిజినెస్ ఉమన్)గా ఎంపికైంది. ‘బిజినెస్ 2014 అత్యంత శక్తివంత మహిళలు’ పేరుతో ఫార్చూన్ పత్రిక తాజాగా జాబితాను విడుదల చేసింది. జాబితాలో తొలి రెండు ర్యాంకులను దక్కించుకున్న ఐబీఎం చైర్మన్ గిన్నీ రోమెట్టీ, జనరల్ మోటార్స్ సీఈవో మేరీ బర్రాల సరసన మూడో స్థానంలో నూయీ నిలిచింది. ఈ బాటలో టాప్ పొజిషన్‌ను సాధించిన మహిళల్లో భారత సంతతికి చెందిన ఏకైక బిజినెస్ ఉమన్ గా నిలిచినట్లు కూడా ఫార్చూన్ పేర్కొంది. ఈ జాబితాలో చోటు చేసుకున్న సగం మంది మహిళలు భారీ సంస్థలను నిర్వహిస్తున్నారని, ఇది ఒక రికార్డని ఫార్చూన్ పేర్కొంది. కాగా, గతేడాది విడుదలైన ఫార్చూన్ జాబితాలో నూయీ రెండవ స్థానంలో నిలవడం గమనార్హం. అమెరికాలో అత్యధికంగా విక్రయమవుతున్న 50 ఆహార, పానీయాల ఉత్పత్తుల్లో 9 పెప్సీకోవే ఉంటున్నాయని ఫార్చూన్ వెల్లడించింది.