న్యూఢిల్లీ: విద్యా రంగ సేవల్లో ఉన్న బైజూస్, తన ఇంటర్నేషనల్ వ్యాపారానికి సీఈవోగా అప్‌గ్రాడ్ మాజీ చీఫ్ అర్జున్ మోహన్‌ను నియమించుకుంది. కంపెనీ వ్యవస్థాపకుడు రవీంద్రన్ ఇక ముందు కూడా గ్రూప్ సీఈవోగా కొనసాగనున్నారు. మృణాల్ మోహిత్ భారత వ్యాపారానికి చీఫ్‌గా కొనసాగుతారని సంస్థ ప్రకటించింది. తాజా నియామకంతో అర్జున్ మోహన్ తన సొంతగూటికి తిరిగి వచి్చనట్టయింది.
అప్‌గ్రాడ్ సీఈవోగా చేరడానికి ముందు 11 ఏళ్ల పాటు అర్జున్ మోహన్ బైజూస్‌లోనే చీఫ్ బిజినెస్ ఆఫీసర్‌గా సేవలు అందించడం గమనార్హం. గతేడాది డిసెంబర్‌లోనే అప్‌గ్రాడ్‌కు మోహన్ రాజీనామా చేశారు. అమెరికా, కెనడా, మెక్సికో, ఆ్రస్టేలియా, యూకే, బ్రెజిల్, మధ్య ప్రాచ్యం తదిత 100 దేశాల్లో బైజూస్‌కు యూజర్లు ఉన్నారు. అంతేకాదు విదేశాల్లో పెద్ద ఎత్తున కంపెనీలను సైతం కొనుగోలు చేస్తూ వచి్చంది. అమెరికాకు చెందిన రీడింగ్ ప్లాట్‌ఫామ్ ఎపిక్ (500 మిలియన్ డాలర్లు), కోడింగ్ సైట్ టింకర్(200 మిలియన్ డాలర్లు)ను బైజూస్ గతంలో కొనుగోలు చేసింది.
అలాగే, సింగపూర్‌కు చెందిన గ్రేట్ లెర్నింగ్(600 మిలియన్ డాలర్లు), ఆస్ట్రియాకు చెందిన జియోగెర్బా(100 మిలియన్ డాలర్లు)ను లోగడ కొనుగోలు చేయడం గమనార్హం. ఈ వ్యాపారాలన్నింటికీ మోహన్ నేతృత్వం వహించనున్నారు. ఇటీవలి కాలంలో బైజూస్ పలు ప్రతికూల పరిణామాలు ఎదురు చూసింది. జీవీ రవిశంకర్, రస్సెల్ డ్రీసెన్‌స్టాక్, చాన్ జుకర్‌బెర్గ్ తదితరులు బైజూస్ బోర్డుకు రాజీనామా చేశారు. అయితే, ఈ రాజీనామాలను తాము ఇంకా ఆమోదించదేని రవీంద్రన్ వాటాదారులకు స్పష్టం చేశారు. పునర్‌వ్యవస్థీకరణ పేరుతో 1,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు జూన్‌లో బైజూస్ ప్రకటించింది. కంపెనీ ఆడిటర్ సేవలకు డెలాయిట్ రాజీనామా చేసి ని్రష్కమించింది. ఏప్రిల్‌లో కంపెనీ కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది.
సలహా మండలిలో రజనీష్ కుమార్, మోహన్‌దాస్ పాయ్
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ చైర్మన్ రజనీష్ కుమార్, ఐటీ రంగ దిగ్గజం టీవీ మోహన్‌దాస్ పాయ్ తమ సంస్థ సలహా మండలిలో చేరనున్నట్లు బైజూస్ వెల్లడించింది. తమ విజన్‌పై వారికి గల నమ్మకానికి ఇది నిదర్శనమని సంస్థ వ్యవస్థాపకులు దివ్యా గోకుల్‌నాథ్, బైజు రవీంద్రన్ తెలిపారు. వ్యవస్థాపకులు కంపెనీని సరైన దారిలో నడిపించేందుకు నిజాయితీగా కృషి చేస్తున్నారని తమకు నమ్మకం కుదిరిన మీదట సలహా మండలిలో చేరాలని నిర్ణయించుకున్నట్లు కుమార్, పాయ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment