International Business
-
హైదరాబాద్‌లోని ఓ ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూల్లో ఈ-సిగరెట్ల కలకలం
-
బైజూస్ ‘ఇంటర్నేషనల్’ సీఈవోగా అర్జున్ మోహన్
న్యూఢిల్లీ: విద్యా రంగ సేవల్లో ఉన్న బైజూస్, తన ఇంటర్నేషనల్ వ్యాపారానికి సీఈవోగా అప్‌గ్రాడ్ మాజీ చీఫ్ అర్జున్ మోహన్‌ను నియమించుకుంది. కంపెనీ వ్యవస్థాపకుడు రవీంద్రన్ ఇక ముందు కూడా గ్రూప్ సీఈవోగా కొనసాగనున్నారు. మృణాల్ మోహిత్ భారత వ్యాపారానికి చీఫ్‌గా కొనసాగుతారని సంస్థ ప్రకటించింది. తాజా నియామకంతో అర్జున్ మోహన్ తన సొంతగూటికి తిరిగి వచి్చనట్టయింది. అప్‌గ్రాడ్ సీఈవోగా చేరడానికి ముందు 11 ఏళ్ల పాటు అర్జున్ మోహన్ బైజూస్లోనే చీఫ్ బిజినెస్ ఆఫీసర్‌గా సేవలు అందించడం గమనార్హం. గతేడాది డిసెంబర్లోనే అప్‌గ్రాడ్‌కు మోహన్ రాజీనామా చేశారు. అమెరికా, కెనడా, మెక్సికో, ఆ్రస్టేలియా, యూకే, బ్రెజిల్, మధ్య ప్రాచ్యం తదిత 100 దేశాల్లో బైజూస్‌కు యూజర్లు ఉన్నారు. అంతేకాదు విదేశాల్లో పెద్ద ఎత్తున కంపెనీలను సైతం కొనుగోలు చేస్తూ వచి్చంది. అమెరికాకు చెందిన రీడింగ్ ప్లాట్‌ఫామ్ ఎపిక్ (500 మిలియన్ డాలర్లు), కోడింగ్ సైట్ టింకర్(200 మిలియన్ డాలర్లు)ను బైజూస్ గతంలో కొనుగోలు చేసింది. అలాగే, సింగపూర్‌కు చెందిన గ్రేట్ లెర్నింగ్(600 మిలియన్ డాలర్లు), ఆస్ట్రియాకు చెందిన జియోగెర్బా(100 మిలియన్ డాలర్లు)ను లోగడ కొనుగోలు చేయడం గమనార్హం. ఈ వ్యాపారాలన్నింటికీ మోహన్ నేతృత్వం వహించనున్నారు. ఇటీవలి కాలంలో బైజూస్ పలు ప్రతికూల పరిణామాలు ఎదురు చూసింది. జీవీ రవిశంకర్, రస్సెల్ డ్రీసెన్స్టాక్, చాన్ జుకర్‌బెర్గ్ తదితరులు బైజూస్ బోర్డుకు రాజీనామా చేశారు. అయితే, ఈ రాజీనామాలను తాము ఇంకా ఆమోదించదేని రవీంద్రన్ వాటాదారులకు స్పష్టం చేశారు. పునర్వ్యవస్థీకరణ పేరుతో 1,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు జూన్‌లో బైజూస్ ప్రకటించింది. కంపెనీ ఆడిటర్ సేవలకు డెలాయిట్ రాజీనామా చేసి ని్రష్కమించింది. ఏప్రిల్‌లో కంపెనీ కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. సలహా మండలిలో రజనీష్ కుమార్, మోహన్‌దాస్ పాయ్ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ చైర్మన్ రజనీష్ కుమార్, ఐటీ రంగ దిగ్గజం టీవీ మోహన్‌దాస్ పాయ్ తమ సంస్థ సలహా మండలిలో చేరనున్నట్లు బైజూస్ వెల్లడించింది. తమ విజన్‌పై వారికి గల నమ్మకానికి ఇది నిదర్శనమని సంస్థ వ్యవస్థాపకులు దివ్యా గోకుల్‌నాథ్, బైజు రవీంద్రన్ తెలిపారు. వ్యవస్థాపకులు కంపెనీని సరైన దారిలో నడిపించేందుకు నిజాయితీగా కృషి చేస్తున్నారని తమకు నమ్మకం కుదిరిన మీదట సలహా మండలిలో చేరాలని నిర్ణయించుకున్నట్లు కుమార్, పాయ్ తెలిపారు. -
రెండు ట్రిలియన్ డాలర్ల అంతర్జాతీయ వాణిజ్యం లక్ష్యం
శాన్ఫ్రాన్సిస్కో: భారత్ వస్తు, సేవల ఎగుమతులు గత సంవత్సరం ముగిసే నాటికి 675 బిలియన్ డాలర్లు దాటాయని, 2030 నాటికి అంతర్జాతీయ వాణిజ్యాన్ని 2 ట్రిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలని దేశం ఆకాంక్షిస్తున్నదని వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఇక్కడి స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీలోని అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులతో సంభాషించిన గోయల్ ఈ సందర్భంగా ప్రసంగిస్తూ, భారతదేశం తన స్వాతంత్య్ర 100వ వార్షికోత్సవాన్ని జరుపుకునే సమయానికి, 30 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవిస్తుందని ఉద్ఘాటించారు. ప్రభుత్వ ప్రణాళికలు అన్నీ అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే ఈ విలువ 35 నుంచి 45 ట్రిలియన్ల స్థాయినీ అందుకోగలదని పేర్కొన్నారు. ప్రస్తుతం 3.3 ట్రిలియన్ల ఎకానమీతో భారత్ ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోంది. భారత్ ముందు వరుసలో అమెరికా, చైనా, జపాన్, జర్మనీలు ఉన్నాయి. దశాబ్దం క్రితం భారత్ 11వ స్థానంలో ఉండేది. జూన్ త్రైమాసికంలో 13.5 శాతం వృద్ధితో బ్రిటన్ను భారత్ ఎకానమీ ఆరవ స్థానంలోకి నెట్టింది. తక్షణం ఇబ్బందులే... కాగా, అంతర్జాతీయంగా డిమాండ్ మందగమనం, అనిశ్చితి వంటి పరిస్థితుల్లో భారత్ ఎగుమతులు కష్టకాలాన్ని ఎదుర్కొన తప్పదని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఇంజనీరింగ్, రత్నాలు–ఆభరణాలు వంటి రంగాలు ప్రతికూలతను ఎదుర్కొనే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం సవాళ్లు, రష్యా–ఉక్రెయిన్, చైనా–తైవాన్ మధ్య ఉద్రిక్తతలు, సరఫరాల సమస్యలు ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వృద్ధి వేగానికి, డిమాండ్ బలహీనతకు కారణమవుతున్న సంగతి తెలిసిందే. భారత్ ఎగుమతులు ఆగస్టులో అసలు వృద్ధిలేకపోగా స్వల్పంగా 1.15 శాతం మేర క్షీణించాయి. విలువలో 33 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఎగుమతుల్లో క్షీణత నమోదుకావడం 20 నెలల్లో ఇదే తొలిసారి. ఎగుమతుల క్షీణత–భారీ దిగుమతులపై ఆర్థికవేత్తలు, విధాన నిర్ణేతలు కూడా ఇటీవలి కాలంలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య ఎగుమతులు 17.12 శాతం పెరిగి 192.59 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక దిగుమతులు ఇదే ఐదు నెలల కాలంలో 45.64 శాతం పెరిగి 317.81 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. వెరసి వాణిజ్యలోటు భారీగా 53.78 బిలియన్ డాలర్ల నుంచి 125.22 బిలియన్ డాలర్లకు చేరింది. 2021–22లో భారత్ వస్తు ఎగుమతుల విలువ ఎగుమతులు 400 బిలియన్ డాలర్లు. యూఎస్ ఇన్వెస్టర్లతో స్టార్టప్స్ అనుసంధానం భారత స్టార్టప్స్‌ను యూఎస్ ఇన్వెస్టర్లతో అనుసంధానించేందుకు.. సపోర్టింగ్ ఎంట్రప్రెన్యూర్స్ ఇన్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ అప్‌స్కిల్లింగ్ (సేతు) పేరుతో కార్యక్రమానికి వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ శ్రీకారం చుట్టారు. భారత్‌లో వ్యవస్థాపకత, వృద్ధి దశలో ఉన్న స్టార్టప్స్‌లో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్న యూఎస్‌లోని ఇన్వెస్టర్ల మధ్య భౌగోళిక అడ్డంకులను అధిగమించడానికి సేతు రూపొందించారు. నిధుల సమీకరణ, ఉత్పత్తుల విక్రయం, వాణిజ్యీకరణకై ఇన్వెస్టర్లు మార్గదర్శకత్వం వహిస్తారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, పట్టణాలు, మారుమూల ప్రాంతాల్లోని స్టార్టప్స్‌కు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు భారత్‌లో అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటు చేసినట్టు గోయల్ తెలిపారు. స్టార్టప్స్‌లో 90 శాతం, అలాగే నిధులు అందుకున్న స్టార్టప్స్‌లో సగం ప్రారంభ దశలోనే విఫలం అవుతున్నాయని గుర్తు చేశారు. వ్యాపారాన్ని నిర్వహించడంలో అనుభవం లేకపోవడం ఒక కీలక సమస్య అని అన్నారు. నిర్ణయం తీసుకోవడానికి, నైతిక మద్దతు కోసం వ్యవస్థాపకులకు సరైన మార్గదర్శకత్వం అవసరమని వివరించారు. స్టార్టప్స్‌కు అండగా నిలిచేందుకు మార్గ్ కార్యక్రమంలో ఇప్పటి వరకు 200 పైచిలుకు మెంటార్స్ పేర్లు నమోదు చేసుకున్నారు. స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీలోని అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులతో మాట్లాడుతున్న గోయల్ -
అమెజాన్‌కు భారీగా నష్టాలు
బెంగళూరు : అంతర్జాతీయ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌కు నష్టాలు భారీగా పెరిగిపోతున్నాయి. తన అంతర్జాతీయ వ్యాపారాల నుంచి 2017లో తొలి తొమ్మిది నెల కాలంలో 2.1 బిలియన్ డాలర్ల నష్టాలు వచ్చినట్టు అమెజాన్ తన కంపెనీ షేర్‌హోల్డర్స్ ప్రజెంటేషన్‌లో తెలిపింది.. ముందటేడాది ఇదే కాలంలో అమెజాన్‌కు 800 మిలియన్ డాలర్ల నష్టాలున్నాయి. ఈ నష్టాలు విపరీతంగా పెరగడానికి ప్రధాన కారణం, భారత్‌లో ఈ ఇంటర్నెట్ దిగ్గజం భారీగా పెట్టుబడులు పెట్టడమేనని తెలిసింది. భారత్‌లో పెరుగుతున్న ఒత్తిడికి, పెట్టుబడుల వెల్లువ కొనసాగించాల్సి వస్తుందని త్రైమాసిక ఫలితాల అనంతరం నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో అమెజాన్ టాప్ ఎగ్జిక్యూటివ్‌లు తెలిపారు. ఈ మార్కెట్లో దీర్ఘకాలికంగా దృష్టిసారించాల్సి వస్తుందని పేర్కొన్నారు. అమెజాన్ అంతర్జాతీయ వ్యాపారాలను దెబ్బతీయడానికి ప్రధాన కారణం భారత్‌లో పెట్టుబడులేనని ఈ ఎగ్జిక్యూటివ్‌లు అంగీకరించారు. కాగ, దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌కు పోటీగా డిస్కౌంట్ రేటులో టాప్ గ్లోబల్ ఉత్పత్తులను అందజేయడానికి ఈ ఈకామర్స్ కంపెనీ తీవ్రంగా శ్రమిస్తోంది. ఇటీవలే కంపెనీ రూ.1,950 కోట్లను భారత్‌లో ఉన్న ప్రధాన సంస్థలోకి చొప్పించింది. అమెజాన్ సెల్లర్ సర్వీసుల ద్వారా భారత్‌లో 3 బిలియన్ డాలర్లను కూడా పెట్టుబడులు పెట్టింది. లాజిస్టిక్స్, పేమెంట్స్, హోల్‌సేల్ డిస్ట్రిబ్యూషన్, ఇతర తన భారతీయ కార్యకలాపాల్లో కూడా పెట్టుబడులు పెడుతోంది. తొలుత 2 బిలియన్ డాలర్లను పెట్టుబడులుగా పెట్టిన అనంతరం, 2016లో మరో 3 బిలియన్ డాలర్ల పెట్టుబడులను అమెజాన్ వ్యవస్థాపకుడు, సీఈవో జెఫ్ బెజోస్ పెంచారు. అయితే భారత్ నుంచి ఎంత మొత్తంలో నష్టాలను ఈ కంపెనీ ఎదుర్కొన్నదో తెలియదు. దేశాల వారీగా తన నష్టాలను కంపెనీ బహిర్గతం చేయలేదు. దీనిపై అమెజాన్ గ్లోబల్ అధికార ప్రతినిధి కూడా స్పందించలేదు. -
వృద్ధికి ఊతమిచ్చే చర్యలు అవసరం...
- మరిన్ని ఉద్యోగావకాశాలు కల్పించాలి - బీ20-ఎల్20 సంయుక్త తీర్మానం అంకారా (టర్కీ): వృద్ధికి ఊతమిచ్చే చర్యల అమలుకు పూర్తి సామర్థ్యం మేర పనిచేయాలని, మరిన్ని ఉద్యోగావకాశాల కల్పనపై దృష్టి పెట్టాలని భారత్ సహా జీ20 కూటమి సభ్య దేశాలకు అంతర్జాతీయ వ్యాపార, కార్మిక నేతలు సూచించారు. అలాగే 2025 నాటికి ఉద్యోగాల్లో మహిళలు, పురుషుల మధ్య వ్యత్యాసాన్ని 25 శాతం మేర తగ్గించాలని పేర్కొన్నారు. జీ20 దేశాల ఆర్థిక మంత్రులు, గవర్నర్ల సదస్సు సందర్భంగా భేటీ అయిన అంతర్జాతీయ వ్యాపార, కార్మిక నేతల బృందాలు ఈ మేరకు బిజినెస్20-లేబర్ 20 సంయుక్త తీర్మానాన్ని విడుదల చేశాయి. ‘ఉద్యోగాలు, వృద్ధి, గౌరవప్రదమైన పని’ పేరిట రూపొందించిన అంకారా తీర్మానంలో.. వృద్ధికి, మరింత మందికి ఉపాధి కల్పించేందుకు, పనిచేసే చోట పరిస్థితులను మెరుగుపర్చేందుకు ఈ మూడూ కీలకమని పేర్కొన్నాయి. కార్మిక రంగానికి సంబంధించి గతసంయుక్త తీర్మానాల అమలు పురోగతి అంతంత మాత్రంగానే ఉందని డిక్లరేషన్ పేర్కొంది. యువతకు ఉద్యోగాలు కల్పించే విషయంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో నిర్మాణాత్మక చర్యలు అవసరమని పేర్కొంది. -
ఎన్ఐఐటీ టెక్ లాభం 36 శాతం వృద్ధి
క్యూ1లో రూ. 58.5 కోట్లు న్యూఢిల్లీ : ఐటీ కంపెనీ ఎన్ఐఐటీ టెక్నాలజీస్.. ఈ ఏడాది జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం(2015-16, క్యూ1)లో రూ.58.5 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.43.2 కోట్లతో పోలిస్తే లాభం 35.5 శాతం ఎగబాకింది. ప్రధానంగా అంతర్జాతీయ వ్యాపారంలో పటిష్టమైన వృద్ధి దీనికి దోహదం చేసింది. ఇక క్యూ1లో కంపెనీ మొత్తం ఆదాయం 11 శాతం వృద్ధి చెంది రూ. 578 కోట్ల నుంచి రూ.641 కోట్లకు పెరిగింది. వేతనాల పెంపు ఇతరత్రా వ్యయాలు ఉన్నప్పటికీ.. అంతర్జాతీయంగా వివిధ ప్రాంతాల నుంచి వ్యాపారంలో 8.9 శాతం వృద్ధి(మార్చి క్వార్టర్‌తో పోలిస్తే) నమోదుకావడంతో నిర్వహణ మార్జిన్లు పుంజుకున్నాయని కంపెనీ సీఈఓ, జాయింట్ ఎండీ అరవింద్ టాకూర్ పేర్కొన్నారు. కాగా, క్యూ1లో కంపెనీ 15 కొత్త క్లయింట్లను దక్కించుకుంది. 734 మంది కొత్త ఉద్యోగులు జతకావడంతో జూన్ చివరినాటికి కంపెనీ మొత్తం సిబ్బంది సంఖ్య 9,228కి చేరింది. ఫలితాల నేపథ్యంలో ఎన్ఐఐటీ టెక్ షేరు ధర మంగళవారం బీఎస్ఈలో 11.2 శాతం ఎగబాకి రూ.464 వద్ద ముగిసింది. -
ఆటోమేషన్ వినియోగంలో భారత్ నం-1
న్యూఢిల్లీ : ఆటోమేషన్ వినియోగంలో భారత్ అగ్రస్థానంలో ఉంది. భారత్‌లోని దాదాపు 83 శాతం కంపెనీలు ఆటోమేషన్ కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నాయని అడ్వైజరీ సంస్థ గ్రాంట్ తోర్న్టన్ తన ఇంటర్నేషనల్ బిజినెస్ నివేదికలో పేర్కొంది. తక్కువ నిర్వహణ వ్యయాలు, అధిక కచ్చితత్వం, ఉత్పత్తికి అనుగుణంగా ఉండటం తదితర కారణాల వల్ల భారతీయ కంపెనీలు ఆటోమేషన్ వైపు మొగ్గు చూపుతున్నాయని తెలిపింది. ఆటోమేషన్ వినియోగంలో భారత్ తర్వాతి స్థానాల్లో మెక్సికో, ఐర్లాండ్ ఉన్నాయి. చైనాలోని 59 శాతం కంపెనీలు ఆటోమేషన్ కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నాయి. ఆటోమేషన్ దాదాపు 5 శాతం ఉద్యోగ సిబ్బందిని భర్తీ చేస్తుందని సర్వేలో పాల్గొన్న 43% తయారీ రంగ కంపెనీలు అభిప్రాయపడ్డాయి. హాస్పిటాలిటీ, ఎడ్యుకేషన్, హెల్త్‌కేర్ రంగాలకు చెందిన 9 శాతం కంపెనీలు 5 శాతానికి ఎక్కువగానే సిబ్బందిని భర్తీ చేస్తుందని పేర్కొన్నాయి.