అమెజాన్‌కు భారీగా నష్టాలు | Amazons global loss hits $2 billion in Jan-Sept on India spends  | Sakshi
Sakshi News home page

అమెజాన్‌కు భారీగా నష్టాలు

Published Tue, Jan 30 2018 12:10 PM | Last Updated on Tue, Jan 30 2018 2:16 PM

Amazons global loss hits $2 billion in Jan-Sept on India spends  - Sakshi

అంతర్జాతీయంగా అమెజాన్‌కు వచ్చిన నష్టాలు(ఫైల్‌)

బెంగళూరు : అంతర్జాతీయ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌కు నష్టాలు భారీగా పెరిగిపోతున్నాయి. తన అంతర్జాతీయ వ్యాపారాల నుంచి 2017లో తొలి తొమ్మి​ది నెల కాలంలో 2.1 బిలియన్‌ డాలర్ల నష్టాలు వచ్చినట్టు అమెజాన్‌ తన కంపెనీ షేర్‌హోల్డర్స్‌ ప్రజెంటేషన్‌లో తెలిపింది.. ముందటేడాది ఇదే కాలంలో అమెజాన్‌కు 800 మిలియన్‌ డాలర్ల నష్టాలున్నాయి. ఈ నష్టాలు విపరీతంగా పెరగడానికి ప్రధాన కారణం, భారత్‌లో ఈ ఇంటర్నెట్‌ దిగ్గజం భారీగా పెట్టుబడులు పెట్టడమేనని తెలిసింది. భారత్‌లో పెరుగుతున్న ఒత్తిడికి, పెట్టుబడుల వెల్లువ కొనసాగించాల్సి వస్తుందని త్రైమాసిక ఫలితాల అనంతరం నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో అమెజాన్‌ టాప్‌ ఎగ్జిక్యూటివ్‌లు తెలిపారు.  ఈ మార్కెట్‌లో దీర్ఘకాలికంగా దృష్టిసారించాల్సి వస్తుందని పేర్కొన్నారు. అమెజాన్‌ అంతర్జాతీయ వ్యాపారాలను దెబ్బతీయడానికి ప్రధాన కారణం భారత్‌లో పెట్టుబడులేనని ఈ ఎగ్జిక్యూటివ్‌లు అంగీకరించారు.

కాగ, దేశీయ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌కు పోటీగా డిస్కౌంట్‌ రేటులో టాప్‌ గ్లోబల్‌ ఉత్పత్తులను అందజేయడానికి ఈ ఈకామర్స్‌ కంపెనీ తీవ్రంగా శ్రమిస్తోంది. ఇటీవలే కంపెనీ రూ.1,950 కోట్లను భారత్‌లో ఉన్న ప్రధాన సంస్థలోకి చొప్పించింది. అమెజాన్‌ సెల్లర్‌ సర్వీసుల ద్వారా భారత్‌లో 3 బిలియన్‌ డాలర్లను కూడా పెట్టుబడులు పెట్టింది. లాజిస్టిక్స్‌, పేమెంట్స్‌, హోల్‌సేల్‌ డిస్ట్రిబ్యూషన్‌, ఇతర తన భారతీయ కార్యకలాపాల్లో కూడా పెట్టుబడులు పెడుతోంది. తొలుత 2 బిలియన్‌ డాలర్లను పెట్టుబడులుగా పెట్టిన అనంతరం, 2016లో మరో 3 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను అమెజాన్‌ వ్యవస్థాపకుడు, సీఈవో జెఫ్‌ బెజోస్‌ పెంచారు. అయితే భారత్‌ నుంచి ఎంత మొత్తంలో నష్టాలను ఈ కంపెనీ ఎదుర్కొన్నదో తెలియదు. దేశాల వారీగా తన నష్టాలను కంపెనీ బహిర్గతం చేయలేదు. దీనిపై అమెజాన్‌ గ్లోబల్‌ అధికార ప్రతినిధి కూడా స్పందించలేదు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement