ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఉద్యోగులకు భారీ షాకిచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా 9 వేల మందిని తొలగిస్తున్నట్లు సీఈవో యాండీ జెస్సీ ప్రకటించారు. రానున్న రోజుల్లో ఆర్ధిక అనిశ్చితి నెలకొనే అవకాశాలు ఉన్నాయని, ఆర్ధిక భారం తగ్గించుకునే ప్రక్రియలో భాగంగా వర్క్ ఫోర్స్‌ను తగ్గిస్తున్నట్లు తెలిపారు. ఇక, లేఆఫ్స్‌పై త్వరలోనే ఉద్యోగులకు సమాచారం ఇస‍్తామని అన్నారు.
అమెజాన్ కఠిన నిర్ణయంతో ప్రపంచ వ్యాప్తంగా 9 వేల మందిని ఉద్యోగాలు కోల్పోగా.. వారిలో 500 మంది భారతీయులు ఉన్నారు. తొలగింపుకు గురవుతున్నవారిలో ఎక్కువ మంది వెబ్ సర్వీసెస్, హెచ్‌ఆర్, సహాయ విభాగానికి చెందిన వారు ఉన్నారు.
తాజా లేఆఫ్స్‌తో ఏడాదిలో ఇప్పటివరకు అమెజాన్ 27,000 మంది ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపింది. గతంలో తొలగించిన 18,000 మందిలో రిటైల్, డివైజెస్, నియామకాలు, మానవ వనరుల విభాగాలకు చెందినవారు ఉన్నారు.
చదవండి👉 ఐటీ ఉద్యోగుల్ని ముంచేస్తున్న మరో ప్యాండమిక్? అదేంటంటే?
Comments
Please login to add a commentAdd a comment