న్యూఢిల్లీ: దేశీ ఎగుమతిదారులు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌కి చెందిన గ్లోబల్ సెల్లింగ్ ప్రోగ్రాం ద్వారా ఇప్పటివరకూ చేసిన ఎగుమతులు ఈ ఏడాదితో 8 బిలియన్ డాలర్లు దాటనున్నాయి. గతేడాది ఇవి 5 బిలియన్ డాలర్లకు చేరినట్లు అమెజాన్ తమ ఎక్స్‌పోర్ట్స్ డైజెస్ట్ 2023 నివేదికలో పేర్కొంది. 2015లో అమెజాన్ గ్లోబల్ సెల్లింగ్‌ను ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు 1.25 లక్షల ఎగుమతిదారుల స్థాయికి చేరినట్లు వివరించింది. 1,200 మంది భారతీయ ఎగుమతిదారులు గతేడాది రూ. 1 కోటి విక్రయాలు సాధించినట్లు అమెజాన్ తెలిపింది.
అత్యధికంగా ఎగుమతైన వాటిల్లో బొమ్మలు (50 శాతం), గృహ .. వంటగది ఉత్పత్తులు (35 శాతం), సౌందర్య సాధనాలు (25 శాతం) ఉన్నాయి. 2025 నాటికి భారత్ నుంచి మొత్తం ఈ-కామర్స్ ఎగుమతులు 20 బిలియన్ డాలర్లకు చేరేలా తోడ్పడేందుకు లక్షల కొద్దీ చిన్న వ్యాపార సంస్థలు, స్టార్టప్‌లతో కలిసి పని చేయనున్నట్లు అమెజాన్ ఇండియా డైరెక్టర్ భూపేన్ వాకంకర్ తెలిపారు. అమెజాన్ గ్లోబల్ సెల్లింగ్ ప్రోగ్రాం ద్వారా అమెరికా, బ్రిటన్, కెనడా, యూఏఈ తదితర దేశాలకు 26.6 కోట్ల పైచిలుకు మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులు ఎగుమతవవుతు న్నాయని నివేదిక పేర్కొంది. 2023లో ఎగుమతులపరంగా ఢిల్లీ అగ్రస్థానంలో ఉండగా, రాజస్తాన్, మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment