ప్రముఖ ఎడ్యుకేషన్ సంస్థ బైజూస్(Byjus) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) అండ్ ఇండియా బిజినెస్ హెడ్ 'మృణాల్ మోహిత్' స్టార్టప్‌కు రాజీనామా చేశారు. ఈ స్థానంలోకి అనుభవజ్ఞుడైన 'అర్జున్ మోహన్' వచ్చాడు. ఇంతకీ మృణాల్ ఎందుకు రాజీనామా చేసాడు? కొత్త సీఈఓ బ్యాగ్రౌండ్ ఏంటి? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
మృణాల్ మోహిత్ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల వైదొలిగినట్లు సమాచారం. గత కొన్ని రోజులుగా అప్పుల భారంతో ముందుకెళుతున్న కంపెనీకి ఈయన అపారమైన సేవ అందించినట్లు కంపెనీ ఫౌండర్ రవీంద్రన్ వెల్లడించారు. కాగా ఇప్పుడు ఇప్పటికే సంస్థతో అనుభందం ఉన్న 'అర్జున్ మోహన్' సీఈఓగా బాధ్యతలు స్వీకరించాడు. ఈయన సారథ్యంలో సంస్థ మళ్ళీ పూర్వ వైభవం పొందుతుందని భావిస్తున్నారు.
గతంలో అర్జున బైజూస్‌లో కీలక పాత్ర పోషించాడు. 2020 వరకు కంపెనీ చీప్ బిజినెస్ ఆఫీసర్‌గా పనిచేశారు. ఆ తరువాత రోనీ స్క్రూవాలా స్థాపించిన ఎడ్‌టెక్ స్టార్టప్ సీఈఓగా వెళ్లే క్రమంలో రాజీనామా చేశారు. కాగా మళ్ళీ ఇప్పుడు సొంత గూటికి చేరుకున్నారు.
మృణాల్ రాజీనామా సందర్భంగా బైజూ రవీంద్రన్ మాట్లాడుతూ.. బైజూస్ ఈ రోజు గొప్ప స్థాయికి చేరుకుందంటే అది తప్పకుండా మా వ్యవస్థాపక బృందం అసాధారణ ప్రయత్నాలే అంటూ అతనికి వీడ్కోలు తెలిపాడు.
బైజూస్ నుంచి నిష్క్రమించడం గురించి మృణాల్ మోహిత్ మాట్లాడుతూ.. బైజూస్ వ్యవస్థాపక బృందంలో భాగం కావడం ఒక అద్భుతమైన ప్రయాణం, విద్యారంగంలో పరివర్తనకు సహకరించినందుకు నేను కృతజ్ఞుడను. ఈ సంస్థలో పనిచేసినందుకు గరివిస్తున్నాను అన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment