Pawan Kalyan Was Criticised By His Own Fan On His Policy - Sakshi
Sakshi News home page

అన్నా.. ఇది పద్ధతి కాదే.. పవన్ కళ్యాణ్ కు అభిమాని చురకలు

Published Mon, Jul 24 2023 3:33 PM | Last Updated on Mon, Jul 24 2023 4:53 PM

Pawan Kalyan was criticised by his own fan on his policy - Sakshi

పవన్ కళ్యాణ్.. నేను ప్రశ్నిస్తూనే ఉంటానంటూ ప్రతీ సారి చెప్పుకునే పీకే.. ఇప్పుడు పనికిరాని ప్రశ్నలు వేసి నవ్వులపాలవుతున్నాడు. తనకు తెలియని విద్యావిధానం గురించి, ఇంకెవరో రాసిచ్చిన ప్రశ్నలను అనుసంధానం చేసి.. దాన్ని సోషల్ మీడియా వేదికగా సంధించి ప్రభుత్వంపై బురద జల్లాలనుకున్న పవన్ ప్రయత్నం పాపం.. బెడిసికొట్టింది.

ఆంధ్రప్రదేశ్ విద్యావిధానాలు భేష్

ఆంధ్రప్రదేశ్‌లో సీఎం జగన్‌ ప్రభుత్వం విద్యార్థుల కోసం చేస్తున్న ప్రయత్నాలు, తీసుకొచ్చిన పథకాలకు దేశవ్యాప్తంగా ఎన్నో ప్రశంసలు వచ్చాయి. అమెరికా న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి వేదికగా జులై మూడో వారంలో జరిగిన హైలెవల్‌ పొలిటికల్‌ డిస్కషన్‌ మీట్‌ సందర్భంగా ఏపీ ప్రతినిధులు ప్రత్యేకంగా రాష్ట్రంలో చేపడుతున్న విద్యావిధానాలను ఐక్యరాజ్యసమితి సమావేశంలో ప్రజెంట్‌ తీసుకొచ్చారు. పేదరికాన్ని పారదోలాలంటే విద్యకు మించిన విధానం మరొకటి లేదన్న సీఎం జగన్‌ ఆశయానికి పలు ప్రశంసలు వచ్చాయి.

(ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో ఏపీ ప్రభుత్వ విద్యావిధానాలపై స్టాల్‌)

(చదవండి : ఏపీ విద్యావిధానాలు భేష్)

విద్యార్థులకిచ్చిన ట్యాబ్లెట్లపై అక్కసు

ఏపీ విధానాలను అందరూ ప్రశంసిస్తుంటే.. కొందరిలో మాత్రం అక్కసు మొదలైంది. అసలు పేద విద్యార్థులకు ట్యాబ్‌లు ఎలా ఇస్తారన్నట్టుగా వీరి వ్యవహారం తయారయింది. విద్యార్థుల విషయ పరిజ్ఞానం పెంచుకునేందుకు ట్యాబ్‌లు ఉపయోగపడుతాయన్న కనీస స్పృహ లేకుండా.. దానిపై చిలువలు పలువలుగా వ్యాఖ్యానాలు జోడించి, కొన్ని ప్రశ్నలను ట్విట్టర్‌ వేదికగా వదిలారు పవన్‌ కళ్యాణ్‌.

సొంత అభిమాని నుంచే పవన్ కు ప్రశ్న

పవన్ వ్యాఖ్యలను చాలా మంది తప్పుబట్టారు. అయితే వారంతా ప్రభుత్వానికి చెందిన వారని, వైఎస్సార్ సిపి క్యాడర్ అని జనసేన చెప్పుకోవచ్చు కానీ..  పవన్‌ ట్వీట్‌కు సొంత అభిమాని రమేష్‌ బోయపాటి నుంచి ఎదురయిన విమర్శను మాత్రం కచ్చితంగా క్షుణ్ణంగా చదవాల్సిందే. మీ సినిమాలు చూస్తాను, మిమ్మల్ని అనుసరిస్తాను కానీ, పేద విద్యార్థులకు మేలు చేసే విద్యావిధానాన్ని విమర్శిస్తే  మాత్రం మౌనంగా ఉండలేనంటూ నేరుగా స్పందన వచ్చింది. ప్రస్తుతం అనుసరిస్తున్న విద్యావిధానంలో కచ్చితంగా సీఎం జగన్‌ ప్రభుత్వాన్ని అభినందించాల్సిందేనంటూ నొక్కి వక్కాణించారు రమేష్‌ బోయపాటి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement