న్యూఢిల్లీ: ఎడ్యుటెక్ కంపెనీ బైజూస్.. పరీక్షల సన్నాహక అనుబంధ సంస్థ ఆకాష్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ పబ్లిక్ ఇష్యూ చేపట్టే యోచనలో ఉంది. కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023-24)లో రూ. 4,000 కోట్ల ఆదాయం అందుకునే మార్గంలో ఉన్నట్లు బైజూస్ పేర్కొంది. రూ. 900 కోట్ల నిర్వహణ లాభాన్ని(ఇబిటా) అంచనా వేస్తోంది.
ఇందుకు బోర్డు అధికారిక అనుమతి ఇచ్చినట్లు బైజూస్ వెల్లడించింది. త్వరలోనే మర్చంట్ బ్యాంకర్లను ఎంపిక చేయనున్నట్లు తెలియజేసింది. వచ్చే ఏడాది మధ్యలో ఐపీవో చేపట్టే వీలున్నట్లు తెలియజేసింది. 2021 ఏప్రిల్‌లో ఆకాష్ ఎడ్యుకేషన్‌ను రూ. 7,100 కోట్లకు బైజూస్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment