Aakash
-
మీరు మళ్లీ NEET లేదా JEE కోసం సిద్ధమవుతున్నట్లయితే, మీరు ఆకాష్ రిపీటర్/XII Passed కోర్సులను ఎందుకు ఎంచుకోవాలి?
NEET/JEE కోసం సన్నద్ధం కావడానికి ఒక సంవత్సరాన్ని వెచ్చించడం అనేది ఏడాది పొడవునా నిబద్ధత కలిగి మరియు మెడిసిన్ లేదా ఇంజినీరింగ్‌లో కెరీర్‌పై మీ కలను కొనసాగించడం పట్ల మీకు మక్కువ ఉంటే ఖచ్చితంగా విలువైనది. ఈ పరీక్షలు ఛేదించడానికి చాలా కఠినంగా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీనికి హాజరైన లక్షలాది మంది విద్యార్థులలో మొదటి ప్రయత్నంలోనే కొంత మంది మాత్రమే విజయం సాధిస్తారు. ప్రత్యామ్నాయ కెరీర్ ఎంపికల కోసం వెతకని వారు లేదా తమకు పెద్దగా నచ్చని కాలేజీలలో స్థిరపడని వారు. అయినప్పటికీ, ఒక సంవత్సరం పునరావృతం చేయడానికి మరియు మళ్లీ సిద్ధం కావడానికి వెనుకాడని వారు కూడా చాలా మంది ఉన్నారు.మీరు మీ మొదటి ప్రయత్నంలో NEETని ఛేదించనట్లయితే మరియు మళ్లీ సిద్ధం కావాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు తాజాగా ప్రారంభించి సరైన మార్గ నిర్దేశం చేయడంలో సహాయపడే ఆకాష్ రిపీటర్/XII పాస్ కోర్సులను మీరు తీవ్రంగా పరిగణించాలి.NEET/ JEE 2025 కోసం మీరు ఆకాష్ రిపీటర్/ XII Passed కోర్సును ఎంచుకోవడానికి కారణాలు● ఆకాష్ రిపీటర్ కోర్సులు మీ స్కోర్‌ను మెరుగుపరచడంలో మీకు సహాయపడటానికి రూపొందించబడ్డాయి మరియు తద్వారా మీ కలల కళాశాలకు ఎంపికయ్యే అవకాశాలను పెంచుతాయిసూర్యాంశ్ K ఆర్యన్ ఆకాష్లో NEET రిపీటర్ క్లాస్రూమ్ విద్యార్థి, అతను NEET 2023లో తన 2వ ప్రయత్నంలో తన స్కోర్లలో గణనీయమైన మెరుగుదలను నమోదు చేసుకున్నాడు మరియు NEET 2022 (592 స్కోర్)లో తన మొదటి ప్రయత్నం కంటే 705 స్కోర్ సాధించగలిగాడు మరియు ప్రస్తుతం AIIMS భోపాల్‌లో చదువుతున్నాడు. అంజలి కథ కూడా అలాంటిదే. NEET 2022లో 622 స్కోర్ చేసిన తర్వాత, అంజలి ఆకాష్ NEET రిపీటర్ క్లాస్రూమ్ ప్రోగ్రామ్‌లో చేరింది మరియు 706 స్కోర్ చేయగలిగింది మరియు NEET 2023లో అండమాన్ & నికోబార్ దీవుల టాపర్‌గా నిలిచింది. అంజలి ప్రస్తుతం MAMC, ఢిల్లీలో చదువుతోంది. ఆకాష్లోని రిపీటర్ సక్సెస్ స్టోరీలు ప్రోగ్రామ్ యొక్క దృఢత్వం మరియు తీవ్రతను తెలియజేస్తాయి, ఇది తమ కలలను సాధించుకోవడానికి తమ విలువైన సమయాన్ని వెచ్చించే విద్యార్థులకు ఆఫర్లో ఉత్తమమైన వాటి కంటే తక్కువ ఏమీ కాకుండా లభించేలా చేస్తుంది.● ఉత్తమ అధ్యాపకులతో అత్యుత్తమ ఫలితాలను అందించడం ద్వారా ఆకాష్ యొక్క 35 ఏళ్ల వారసత్వం నుండి ప్రయోజనం పొందండిఆకాష్ దానితో పాటు, దేశంలోని అత్యుత్తమ అధ్యాపకులలో ఒకరి ద్వారా ఫోకస్డ్ మరియు రిజల్ట్-ఓరియెంటెడ్ టెస్ట్ ప్రిపరేషన్‌ను అందించే 35 సంవత్సరాల శక్తివంతమైన చరిత్ర కలిగినదిగా పిలవబడింది.. ఆకాష్లోని ఉపాధ్యాయులు అధిక అర్హతలు మరియు అనుభవజ్ఞులు మాత్రమే కాకుండా కోచింగ్ మెథడాలజీలు మరియు విద్యార్థుల మారుతున్న విద్యా అవసరాలకు అనుగుణంగా వారికి సహాయపడే నైపుణ్యాలలో బాగా శిక్షణ పొందారు. ఆకాష్ రిపీటర్/ XII ఉత్తీర్ణత సాధించిన కోర్సులతో, రిపీటర్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం మరియు వారి ప్రత్యేక అవసరాలు మరియు సామర్థ్యాలను అర్థం చేసుకోవడంలో నైపుణ్యం కలిగిన అత్యుత్తమ అధ్యాపకుల దగ్గర మీరు నేర్చుకుంటారు, తద్వారా వారి ఎంపిక అవకాశాలను మెరుగుపరుస్తారు.● నిపుణులచే రూపొందించబడిన అధిక నాణ్యత అధ్యయన సామగ్రిఆకాష్లోని ప్రతి అధ్యయన వనరు అన్ని అంశాల సమగ్ర విశ్లేషణను అందించడానికి రూపొందించబడింది, విద్యార్థులు NEET మరియు/లేదా JEEలో పరీక్షించిన కాన్సెప్ట్లపై పూర్తి అవగాహన కలిగి ఉండేలా చూసుకుంటారు. విద్యార్థులు కష్టమైన పాఠాలను సులభంగా గ్రహించడంలో సహాయపడేందుకు వివిధ రకాల అభ్యాస ప్రశ్నలు, ఉదాహరణలు మరియు దృష్టాంతాలను చేర్చడానికి మా నిపుణులు స్టడీ మెటీరియల్‌ను జాగ్రత్తగా డిజైన్ చేస్తారు.అంతేకాకుండా, తాజా పరీక్షల ట్రెండ్లు మరియు ప్యాటర్న్లకు అనుగుణంగా మా స్టడీ మెటీరియల్ కఠినమైన సమీక్ష మరియు అప్డేట్లను కలిగియున్నది. విద్యార్థులు తమ పరీక్షా సన్నాహక ప్రయాణంలో ముందుకు సాగడానికి అత్యంత సందర్భోచితమైన మరియు నవీనమైన కంటెంట్‌పై అవగాహణ కలిగి ఉండేలా ఇది దోహదపడుతుంది.● పూర్తి అభ్యాసం కోసం కఠినమైన పరీక్షలు మరియు మూల్యాంకన షెడ్యూల్ఆకాష్లో విద్యార్థులు తమ సన్నద్ధత సమయంలో వారి బలహీనమైన ప్రాంతాలలో గణనీయమైన మెరుగుదలను ప్రదర్శించడంలో సహాయపడే నిర్దిష్టమైన పరీక్ష షెడ్యూల్‌ను అనుసరిస్తారు. ప్రస్తుతం భోపాల్‌లోని AIIMSలో ఉన్న ఆకాష్లోని రిపీటర్ క్లాస్రూమ్ విద్యార్థి సూర్యాంశ్ మాటల్లో, “నేను ప్రతిరోజూ ఒక పరీక్ష రాశాను”, పరీక్షలు నా బలమైన మరియు బలహీనమైన ప్రాంతాలను గుర్తించడంలో నాకు సహాయపడాయి.● గరిష్టంగా 90% మొత్తం స్కాలర్షిప్ పొందండిమీ కల కోసం సిద్ధపడడం మరియు అది కూడా రెండవసారి, ఖచ్చింగా సవాలుగా ఉంటుంది, ముఖ్యంగా ఆర్థికంగా. మేము, ఆకాష్ వద్ద, ఆకాష్ ఇన్స్టంట్ అడ్మిషన్ కమ్ స్కాలర్షిప్ టెస్ట్ (iACST)తో మీ కలను సాకారం చేయడానికి మీకు అవకాశాన్ని అందిస్తున్నాము. iACST మీకు 90% మొత్తం స్కాలర్షిప్ను గెలుచుకోవడానికి మరియు ఆకాష్ యొక్క రిపీటర్/ XII ఉత్తీర్ణత సాధించిన కోర్సులతో మీ కెరీర్ లక్ష్యాలను సాధించడానికి తక్షణ అవకాశాన్ని మీకు అందిస్తుంది.మీరు 2025లో NEET లేదా JEEలో మరోసారి మీ అదృష్టం పరీక్షించుకోవాలనుక్నుట్లయితే , మెడిసిన్/ఇంజినీరింగ్‌లో మీ కలల కెరీర్‌కు ఒక అడుగు దగ్గరగా తీసుకెళ్లగల సరైన మెంటర్ని మీరు ఎంచుకున్నారని నిర్ధారించుకోండి. ఆకాష్ రిపీటర్ కోర్సుల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఈరోజే నమోదు చేసుకోండి మరియు మొత్తం 90% స్కాలర్షిప్ పొందండి.ఇక్కడ క్లిక్ చేయండి -
కండోమ్ తెచ్చిన కష్టాలు.. ఆసక్తికరంగా సర్కారు నౌకరి ట్రైలర్
ప్రముఖ సింగర్ సునీత కుమారుడు ఆకాష్ హీరోగా పరిచమవుతున్న చిత్రం ‘సర్కారు నౌకరి’. భావన హీరోయిన్ గా నటిస్తోంది. గంగనమోని శేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్కే టెలీ షో బ్యానర్ పై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మిస్తున్నారు. న్యూఇయర్ సందర్భంగా వచ్చే జనవరి 1న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ ట్రైలర్‌ని విడుదల చేశారు మేకర్స్. హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమంలో ప్రముఖ దర్శకులు రాఘవేంద్రరావు, శేఖర్ కమ్ముల, అనిల్ రావిపూడి, సునీతతో పాటు చిత్రం బృందం పాల్గొంది. ఇక ట్రైలర్ విషయానికొస్తే.. గ్రామీణ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. గోపాల్(ఆకాష్)కి ఆరోగ్య శాఖలో ఉద్యోగం వస్తుంది. కొత్తగా పెళ్లైన భార్య (భావన)తో కలిసి తెలంగాణలోని ఓ మారుమూల గ్రామానికి వెళ్తాడు. గ్రామాల్లో నిరోధ్ వాడకం గురించి అవగాహన కల్పించడం అతని పని. కానీ గోపాల్‌కు ఆ ఊరి ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. నిరోధ్ వాడకం గురించి తెలియక వాటిని పిల్లలు ఆడుకునే బుగ్గలుగా చూస్తారు. అంతేకాదు గోపాల్ని బుగ్గలోడు అని హేళన చేస్తారు. గోపాల్ చేసే పని కాపురంలో కూడా చిచ్చు పెడుతుంది. ఆ ఉద్యోగం భార్యకు నచ్చదు. దీంతో ఉద్యోగమో నేనో తేల్చుకోమని భార్య అంటుంది. అప్పుడు హీరో ఏం చేశాడు? ఉద్యోగాన్ని ప్రాణంగా భావించే గోపాల్ తన లక్ష్యాన్ని ఎలా నెరవేర్చాడు అనేదే మిగతా కథ. ట్రైలర్ కామెడీగా అనిపించినా.. చాలా ఇదొక ఎమోషనల్ స్టోరీలా ఉంది. -
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్.. భారత జట్టులోకి అనూహ్యంగా...!!
దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న టీమిండియా ఆతిథ్య జట్టుతో మరో కీలక పోరుకు సిద్దమైంది. ఆదివారం(డిసెంబర్ 17) జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌తో ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. కాగా ఈ వన్డే సిరీస్ నుంచి టీమిండియా పేసర్ దీపక్ చాహర్ వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నాడు. తన తండ్రి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో సఫారీలతో వన్డే సిరీస్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఇక దక్షిణాఫ్రికాతో వన్డేలకు చాహర్ స్దానాన్ని ఎవరూ ఊహించని ఆటగాడితో బీసీసీఐ భర్తీ చేసింది. బెంగాల్ పేసర్ ఆకాష్ దీప్‌ను చాహర్ ప్రత్యామ్నాయంగా బీసీసీఐ ప్రకటించింది. తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికైన ఆకాష్ దీప్ గురించి పలు ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. ఆకాష్ ఈ స్దాయికి చేరడానికి ఎన్నో కష్టాలు పడ్డాడు. ఎవరీ ఆకాష్ దీప్..? 27 ఏళ్ల ఆకాష్ ఆకాష్ దీప్ బీహార్‌లోని ససారం అనే గ్రామంలో జన్మించాడు. ఆకాష్‌ది మధ్యతరగతి కుటంబం. అతడు తన చిన్నతనం నుంచే క్రికెట్‌పై మక్కువ ఎక్కువ. క్రికెట్ వైపు అడుగులు వేస్తున్న సమయంలో దీప్ జీవితంలో ఊహించని విషాదం చోటు చేసుకుంది. అతడి తండ్రి మరణించాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే అతడి సోదురుడు కూడా తుదిశ్వాస విడిచాడు. ఇన్ని కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ ఆకాష్ మాత్రం దృడ సంకల్పంతో తన కెరీర్ వైపు అడుగులు వేశాడు. తన సొంత రాష్ట్రం బిహార్‌లో అవకాశాలు తక్కువగా ఉండటంతో వెస్ట్‌బెంగాల్‌కు తన మకాం మార్చాడు. అక్కడకు వెళ్లాక అసన్సోల్లోని ఓ క్రికెట్ ఆకాడమీలో దీప్ చేరాడు. ఆ తర్వాత అసన్సోల్లోని ఖేప్ క్రికెట్' టెన్నిస్ బాల్ టోర్నీలో అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ టోర్నీలో మెరుగైన ప్రదర్శన చేయడంతో దుబాయ్ వెళ్లే అవకాశం వచ్చింది. అక్కడ కూడా ఆకాష్ దుమ్మురేపాడు. ఆ తర్వాత బెంగాల్ క్రికెట్ ఆసోషియేషన్ డివిజన్ మ్యాచ్‌ల్లో ఆడే ఛాన్స్ లభించింది. ఓ సారి కోల్‌కతాలోని రేంజర్స్ గ్రౌండ్లో మ్యాచ్ జరుగుతున్నప్పుడు అప్పటి బెంగాల్ సీనియర్ టీమ్ డైరెక్టర్ జోయ్‌దీప్ ముఖర్జీ దృష్టిలో ఆకాష్ దీప్ పడ్డాడు. ఆకాష్ దీప్ బౌలింగ్ చేస్తున్నప్పుడు కీపర్ స్టంప్‌ల వెనుక 10 గజాల దూరంలో నిల్చోడం చూసి జోయ్‌దీప్ ముఖర్జీ ఆశ్చర్యపోయారు. వెంటనే అండర్-23 కోచ్ సౌరాశిష్‌ను పిలిపించి ఆకాష్ దీప్ గురించి తెలుసుకున్నాడు. ఈ క్రమంలో అప్పటి బెంగాల్ క్రికెట్ ఆసోషియేషన్ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ విజన్ 2020 పోగ్రాంకు దీప్‌ను ముఖర్జీ రిఫర్ చేశాడు. ఇదే అతడి కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. సౌరవ్ గంగూలీ విజన్ 2020 పోగ్రాంకు షార్ట్‌లిస్ట్ చేసిన జాబితాలో ఆకాష్‌కు చోటు దక్కింది. దీంతో బెంగాల్ రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించేందుకు నిర్వహించిన ట్రయల్స్‌లో ఆకాష్ పాల్గొనున్నాడు. ఆ తర్వాత 2019లో బెంగాల్ తరపున ఆకాష్ దీప్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అడుగుపెట్టాడు. అదే ఏడాది ఫస్ట్‌క్లాస్ క్రికెట్, టీ20ల్లో అరంగేట్రం చేశాడు. ఓవరాల్‌గా దేశీవాళీ క్రికెట్లో ఇప్పటివరకు 80 మ్యాచ్‌లు ఆడిన ఆకాష్ 170 వికెట్లు పడగొట్టాడు. ఇక ఐపీఎల్లో ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్-2022 మెగా వేలంలో రూ.20 లక్ష్లల కనీస్ ధరకు అతడిని ఆర్సీబీ కొనుగోలు చేసింది. -
వచ్చే ఏడాది బైజూస్ ఆకాష్ ఐపీవో
న్యూఢిల్లీ: ఎడ్యుటెక్ కంపెనీ బైజూస్.. పరీక్షల సన్నాహక అనుబంధ సంస్థ ఆకాష్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ పబ్లిక్ ఇష్యూ చేపట్టే యోచనలో ఉంది. కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023-24)లో రూ. 4,000 కోట్ల ఆదాయం అందుకునే మార్గంలో ఉన్నట్లు బైజూస్ పేర్కొంది. రూ. 900 కోట్ల నిర్వహణ లాభాన్ని(ఇబిటా) అంచనా వేస్తోంది. ఇందుకు బోర్డు అధికారిక అనుమతి ఇచ్చినట్లు బైజూస్ వెల్లడించింది. త్వరలోనే మర్చంట్ బ్యాంకర్లను ఎంపిక చేయనున్నట్లు తెలియజేసింది. వచ్చే ఏడాది మధ్యలో ఐపీవో చేపట్టే వీలున్నట్లు తెలియజేసింది. 2021 ఏప్రిల్‌లో ఆకాష్ ఎడ్యుకేషన్‌ను రూ. 7,100 కోట్లకు బైజూస్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. -
President Election 2022: బీజేపీ ఆకర్ష్!
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికలో సొంత బలంతోనే తమ అభ్యర్థిని గెలిపించుకొనేందుకు అధికార బీజేపీ ఆకర్ష్ మంత్రాన్ని జపిస్తోంది. ఎలక్టోరల్ కాలేజీలో ఓట్ల శాతాన్ని పెంచుకునేలా పలు రాష్ట్రాల్లో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకునే పనిలో పడింది. బిహార్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్‌లో వారికి గాలం వేసిన బీజేపీ, తాజాగా గోవా, హరియాణా, రాజస్తాన్‌పైనా కన్నేసింది. బలం పెంచుకునే ఎత్తుగడలు రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో బీజేపీకి 48.9 శాతం ఓట్లున్నాయి. ఇంకో 11,990 ఓట్లు కావాలి. ఇందుకోసం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో విపక్ష ఎమెల్యేలకు గాలమేస్తోంది. బిహార్‌లో వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ(వీఐపీ) పార్టీ ముగ్గురు ఎమ్మెల్యేలూ, హిమాచల్‌లోనూ ఇద్దరు ఇండిపెండెంట్లు ఇప్పటికే బీజేపీలో చేరిపోయారు. మధ్యప్రదేశ్‌లో ఇద్దరు ఎస్పీ, బీఎస్పీ ఎమ్మెల్యేలతో పాటు మరో స్వతంత్ర ఎమ్మెల్యే కాషాయ కండువా కప్పుకున్నారు. మధ్యప్రదేశ్‌లో ఒకరిద్దరు ఎంపీలను కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. గోవాలో 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఏకంగా 10 మంది బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం సాగుతోంది. హరియాణాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణోయ్, రాజస్తాన్‌లో అధికార కాంగ్రెస్‌కు చెందిన మంత్రి రాజేంద్రసింగ్, మరో ఇద్దరు ఎమ్మెల్యేలు, ముగ్గురు బీఎస్పీ ఎమ్మెల్యేలు, ఇద్దరు బీటీపీ ఎమ్మెల్యేలు బీజేపీ చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఉద్ధవ్ థాకరేకు రాజ్‌నాథ్ ఫోన్ మరోవైపు, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మహారాష్ట్ర సీఎం, శివసేన పార్టీ అధినేత ఉద్ధవ్ థాకరేతో ఫోన్లో మాట్లాడారు. రాష్ట్రపతి ఎన్నికపై చర్చించుకున్నట్లు సమాచారం. తమ అభ్యర్థికి మద్దతివ్వాలని రాజ్‌నాథ్ కోరినట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి ఎన్నిక విషయంలో ఇతర పార్టీల నాయకులతో సంప్రదింపులు జరపడానికి బీజేపీ అధిష్టానం రాజ్‌నాథ్‌సింగ్, జేపీ నడ్డాలను నియమించిన సంగతి తెలిసిందే. -
హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న సింగర్ సునీత కుమారుడు!
సింగర్ సునీత.. తెలుగు సినీ, సంగీత ప్రియులకు పెద్ద పరిచయం అక్కర్లేని పేరు. గాయనిగా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె స్టార్ హీరోయిన్లతో సమానమైన క్రేజ్ సంపాదించుకున్నారు. నాలుగు పదుల వయసులో కూడా తన అందం, అభినయం, అంతకు మించి తన స్వీట్ వాయిస్‌తో ఎంతో మందిని ఆకట్టుకుంటున్నారు సునీత. ఈ క్రమంలో ఆమెకు పెరిగిన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయినప్పటికీ మీడియా, సోషల్ మీడియాలో చాలా అరుదుగా కనిపించే సునీత రెండో పెళ్లి అనంతరం తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. చదవండి: 'నాకే కాదు, నా భర్తకు కూడా సమంత హాట్‌గా కనిపించింది' ఏడాది క్రితం రామ్ వీరపనేని అనే వ్యాపారవేత్తను రెండో పెళ్లి చేసుకున్న ఆమె ఇటూ మీడియాలో, అటూ సోషల్ మీడియాలో తరచూ దర్శనం ఇస్తున్నారు. ఇటీవల తన భర్త రామ్ ఓ వివాదంలో చిక్కుకోవడంతో ఆమె మరోసారి వార్తల్లో నిలిచారు. ఇక తాజాగా ఆమె కుమారుడికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. కాగా సునీత తనయుడు ఆకాశ్ త్వరలో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. సునీత కొడుకుని హీరోగా పరిచయం చెయ్యడానికి ఆమె రెండో భర్త రామ్ వీరపనేని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. చదవండి: నల్లగా ఉంది.. కలర్ తక్కువ అని చాలా మాటలు అన్నారు : హీరోయిన్ అయితే సునీత కూతురు ఓ షోలో పాడి సింగర్‌గా బుల్లితెరకు పరిచమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె కుమారుడు ఆకాశ్ హీరోగా పరిచయం కాబోతున్నాడనే వార్తలు వినిపించడంతో ఆమె ఫ్యాన్స్ అంతా మురిసిపోతున్నారు. కాగా సునీత 19 ఏళ్ల వయసులో కిరణ్ కుమార్ అనే వ్యక్తిని తొలి వివాహం చేసుకోగా.. వారికి కుమారుడు ఆకాశ్, కూతురు శ్రేయాలు జన్మించారు. ఈ క్రమంలో భర్త కిరణ్ కుమార్‌తో విభేధాలు తలెత్తడంతో అతడికి సునీత విడాకులు ఇచ్చింది. ఆ తర్వాత 2020లో మ్యాంగ్ మీడియా అధినేత, వ్యాపారవేత్త రామ్ వీరపనేనిని సునీత రెండవ వివాహం చేసుకుని సెటిలైపోయారు. -
బైజూస్ మెగా డీల్ @7,300 కోట్లు
ముంబై: దేశంలోనే అతిపెద్ద ఆన్లైన్ ఎడ్యుకేషన్ స్టార్టప్ బైజూస్ తాజాగా ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్‌ను కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు 1 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 7300 కోట్లు) చెల్లించనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వెరసి దేశీయంగా అతిపెద్ద ఎడ్యుటెక్ డీల్స్‌లో ఒకటిగా ఇది నిలవనున్నట్లు అభిప్రాయపడ్డాయి. కోవిడ్–19 నేపథ్యంలో ఆన్లైన్ క్లాసులకు డిమాండ్ మరింత పెరగడంతో బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న బైజూస్ ఇటీవల నిధుల సమీకరణ చేపట్టిన విషయం విదితమే. ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ సంస్థతోపాటు, టైగర్ గ్లోబల్ మేనేజ్మెంట్, బాండ్ క్యాపిటల్ తదితర సంస్థల నుంచి నిధులను సమకూర్చుకుంది. దీంతో బైజూస్ విలువ 12 బిలియన్ డాలర్లకు చేరినట్లు పరిశ్రమవర్గాలు తెలియజేశాయి. ఇంజినీరింగ్, మెడికల్ విద్యా శిక్షణలో పట్టున్న ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్‌కు దేశవ్యాప్తంగా 200 శిక్షణా కేంద్రాలున్నాయి. బైజూస్‌తో డీల్‌లో భాగంగా ఆకాష్లో కంపెనీ వ్యవస్థాపకులు చౌధరీ కుటుంబ సభ్యులు వైదొలగనున్నట్లు తెలుస్తోంది. మరోపక్క ఆకాష్లోగల 37.5 శాతం వాటాకుగాను బైజూస్‌లో కొంత వాటాను బ్లాక్‌స్టోన్ గ్రూప్ పొందే వీలున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. జేఈఈ ప్రిపరేషన్‌కు ‘అమెజాన్ అకాడమీ’ అమెజాన్ ఇండియా ‘అమెజాన్ అకాడమీ’ పేరిట జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) ప్రిపరేషన్ కోసం విద్యార్థులకు అవసరమైన ఆన్లైన్ వేదికను ప్రారంభించింది. గూగుల్‌ప్లే స్టోర్‌లో బీటా వర్షన్ యాప్ ఉచితంగా అందుబాటులో ఉందని కంపెనీ తెలిపింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో బైజూస్, అన్అకాడమీ, వేదాంతు వంటి కంపెనీలకు ప్రజాదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెజాన్ ఇండియా (ఎడ్యుకేషన్) డైరెక్టర్ అమోల్ గుర్వారా తెలిపారు. జేఈఈతో పాటు బీఐటీఎస్ఏటీ, వీఐటీఈఈఈ, ఎస్‌ఆర్‌ఎంజేఈఈఈ, ఎంఈటీ పరీక్షల విద్యార్థులకు కూడా నాణ్యమైన కంటెంట్ అందుబాటులో ఉందని తెలిపారు. చదవండి: ఫుల్ సిగ్నల్.. జోరుగా టెలిగ్రాం! మొబైల్ యూజర్లకు అమెజాన్ ప్రైమ్ వీడియో సూపర్ ఆఫర్ -
నా కొడుకైతే మాత్రం?!
కూడబెట్టుకున్న సంపదను కరిగించేసినట్లే, కష్టపడి సంపాదించుకున్న పేరు ప్రతిష్టల్ని కూడా హరించేస్తుంటారు కొందరు పుత్రరత్నాలు. బీజేపీ ఎంపీ రూపా గంగూలి కుమారుడు ఆకాశ్ ముఖోపాధ్యాయ్ (20) కారు నడుపుతూ ఇంటి పక్కనే ఉన్న ఓ గోడను డీకొట్టాడు. ఆ ధాటికి గోడకు అవతల ఉన్న కొన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోయేవే గానీ ఏ దేవుడో చెయ్యి అడ్డు పెట్టి తృటిలో తప్పించేశాడు. గోడ మాత్రం కూలిపోయింది. కారు నడుపుతున్నప్పుడు అతడు తప్ప తాగి ఉండడాన్ని తాము చూశామని ఘటనాస్థలంలో ఉన్న వాళ్లు చెప్పడంతో పోలీసులు ఆకాశ్‌ని అరెస్ట్ చేశారు. ఎంపీ గారి తనయుడు కనుక శిక్ష లేకుండా బయటికి వచ్చేస్తాడని మనం అనుకోవచ్చు. కానీ రూపా గంగూలి ‘నో పాలిటిక్స్ ప్లీజ్’ అంటున్నారు. ‘దయచేసి ఈ ఘటనను రాజకీయం చేయకండి. నా కొడుకంటే నాకు ఇష్టమే. కానీ చట్టం తన పని చేసుకుపోతుంది’’ అని కొడుకు అరెస్ట్‌పై ఆమె ఒక ట్వీట్ పెట్టారు. కోల్‌కతాలోని గోల్ఫ్ గార్డెన్ ప్రాంతంలో గురువారం ఈ ఘటన జరిగింది. ఆకాశ్ కారు గుద్దిన గోడ ఒక క్లబ్బుది. -
సిటీకి ‘స్టాండప్’ స్టార్
సాక్షి, సిటీబ్యూరో: ముంబైకి చెందిన ప్రముఖ స్టాండప్ కామెడీ ఆర్టిస్ట్ ఆకాశ్ మెహతా తన ‘నాస్టీ’ ప్రదర్శన ద్వారా నగరంలోని హాస్యప్రియులకు నవ్వుల విందు అందించనున్నారు. ఈ విషయాన్ని కార్యక్రమ నిర్వాహక సంస్థ కౌంటర్ కల్చర్ ప్రతినిధులు గురువారం తెలిపారు. జూబ్లీహిల్స్ ఫిల్మ్‌నగర్‌లోని మూన్‌షైన్ ప్రాజెక్టులో ఆదివారం జరుగనున్న లైవ్ కామెడీ షోలో ఆయన పాల్గొంటారని, సాయంత్రం 5గంటలకు షో ప్రారంభమవుతుందని చెప్పారు. -
అమ్మతో ఆకాశ్
-
‘అపరిచితుడు’లా...
‘ఆనందం’ ఫేమ్ ఆకాష్ నటించిన తాజా తెలుగు చిత్రం ‘కొత్తగా ఉన్నాడు’. ప్రియ, సోనియా కథానాయికలు. ఎం.రాధా దర్శకత్వంలో రాజా మీడియా వరల్డ్ సమర్పణలో జై బాలాజీ మూవీ మేకర్స్ పతాకంపై ఎం.కె. రాజా ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ని, యు.కె.మురళి స్వరపరచిన పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆకాష్ మాట్లాడుతూ– ‘‘లండన్ నేపథ్యంలో జరిగే కథ ఇది. ఆంధ్ర, తెలంగాణ కుర్రాడిగా రెండు షేడ్స్ ఉన్న పాత్రలో నటించా. విక్రమ్ నటించిన ‘అపరిచితుడు’ తరహాలో అందర్నీ అలరిస్తుంది. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే నేనే అందించా’’ అన్నారు. ‘‘ఆకాష్గారి ప్రోత్సాహాన్ని ఎప్పటికీ మరువలేను. ‘కొత్తగా ఉన్నాడు’లో అన్ని పాటలు బాగున్నాయి’’ అన్నారు యు.కె.మురళి. ‘‘కొత్తగా ఉన్నాడు’ చిత్రంతో తెలుగు సినిమా నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతుండటం ఆనందంగా ఉంది. ఈ చిత్రంతో టాలీవుడ్లో నాకు మంచి బోణీ లభిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు ఎం.కె.రాజా. ‘సంతోషం’ పత్రికాధినేత సురేష్ కొండేటి, ‘వైకుంఠపాళి’ నిర్మాత జైరామ్, నటుడు–నిర్మాత దినేష్ మాడ్నే, దర్శకుడు రవిశర్మ, నిర్మాతలు బాల్‌రెడ్డి, బలవంత్ రెడ్డి, హీరోయిన్స్ ఆర్తీ సురేష్, సుమ, లక్కీ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: షాన్. -
‘పూరి కెరీర్లోనే ఉత్తమ చిత్రంలా ఉంది’
సాక్షి, హైదరాబాద్: తన కుమారుడు ఆకాశ్‌ను హీరోగా పెట్టి ప్రముఖ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ‘మెహబూబా’ సినిమా ఫస్ట్‌లుక్ టీజర్ శుక్రవారం విడుదలైంది. దీనిపై విలక్షణ దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. ‘వావ్.. మెహబూబా మూవీ పూరి జగన్నాథ్ కెరీర్లోనే ఉత్తమ చిత్రంలా ఉంది. ఈ సినిమా తీసిన విధానం చూస్తుంటే మహాకావ్యం (ఎపిక్ లవ్‌స్టోరీ)లా నిలిచే అవకాశముంద’ని వర్మ ట్వీట్ చేశారు. 1971 నాటి భారత్-పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో ‘మెహబూబా’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆకాశ్ సరసన నేహాశెట్టి హీరోయిన్గా నటిస్తోంది. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమాకు సందీప్ చౌతా సంగీతం అందిస్తున్నాడు. వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. -
‘మెహబూబా’ ఫస్ట్ లుక్ టీజర్ విడుదల
-
పూరీ ‘మెహబూబా’ ఫస్ట్ లుక్ టీజర్ విడుదల
స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరెకెక్కిస్తున్న ‘మెహబూబా’ సినిమా ఫస్ట్ లుక్ టీజర్‌ను శుక్రవారం విడుదలచేశారు. పాక్-భారత్ సరిహద్దులో ఆకాశ్ సైనికాధికారిగా నేహాశెట్టి చేయి పట్టుకుని యుద్ధం చేసుకుంటూ పరిగెత్తడం అందరిని ఆకట్టుకుంటోంది. టీజర్ ‘మెహబూబా..’ అంటూ బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌తో సాగుతుంది. 1971 నాటి భారత్, పాకిస్థాన్ ల యుద్ధ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పీరియాడిక్ లవ్ స్టోరిలో పూరీ తనయుడు ఆకాష్ హీరోగా, నేహా శెట్టి హీరోయిన్గా నటిస్తున్నారు. సందీప్ చౌతా సంగీతం అందించారు. తమిళ సూపర్ హిట్ తుపాకీ సినిమాలో కీలక పాత్రలో నటించిన గౌతమ్ కురుప్ విలన్ గా నటించారు. సమ్మర్లో ఈ సినిమా విడుదల కానుంది. పూరి జగన్నాథ్ కొంత కాలంగా వరుస ఫెయిల్యూర్స్‌తో కష్టాల్లో ఉన్న సంగతి తెలిసిందే. -
ప్రేమోన్మాదం
ప్రేమ పేరుతో రాష్ట్రంలో వేధింపులు, కిరాతకాలు నానాటికీ పెరుగుతున్నాయి. వన్‌సైడ్ ప్రేమ అంటూ కొందరు.. తనను విస్మరించిందంటూ మరికొందరు.. తనకు దక్కనిది మరొకరికి దక్క కూడదంటూ ఇంకొందరు యువకులు ప్రేమోన్మాదులుగా మారుతున్నారు. ఈ పరిణామాలు వెరసి యువతులకు రాష్ట్రంలో భద్రత కరువైన పరిస్థితులు నెలకొన్నాయి. కొందరు యువత ఒడిగడుతున్న ఘాతుకాలు మరింత కిరాతకంగా ఉంటున్నాయి. గత ఏడాది కాలంలో పదిమంది యువతులు ఒన్‌సైడ్ ప్రేమకు ఉన్మాదుల చేతిలో బలయ్యారు. అలాగే, తనను విస్మరించారనే నెపంతో ఉన్మాదుల ఆగ్రహానికి మరో ఆరుగురు యువతులు బలికాక తప్పలేదు. ఇందులో కారైక్కాల్ వినోదిని, చెన్నైలో విద్య, సోనియా, కరూర్‌లో సోనాలి, తూత్తుకుడిలో టీచర్ ప్రాన్సీన, కోవైలో ధన్య, చెన్నై నుంగంబాక్కంలో స్వాతి, అంబత్తూరులో మైథిలి వంటి వారు ఎందరో ఉన్నారు. తాజాగా, తనకు దక్కనిది మరొరికి దక్కకూడదన్న ఆగ్రహంతో ఇందుజాను కిరాతక ప్రియుడు సజీవ దహనంచేశాడు. ఈ తరహా ఉన్మాద ఘటనలు తల్లిదండ్రుల్ని కలవరంలో పడేస్తున్నాయి. సాక్షి, చెన్నై : ఆ ఇద్దరు పాఠశాల స్థాయిలో మిత్రులు. కళాశాల స్థాయికి ఎదగడంతో మిత్రులు ప్రేమికులయ్యారు. చెన్నై నగరంలో చెట్టాపట్టలేసుకుని తిరిగారు. ప్రియురాలి ఇంటికి వెళ్లడమే కాదు, ఆ ఇంట్లో తానూ ఒకడే అనుకుని సపర్యలు చేశాడు. పీకల్లోతు ప్రేమలో మునిగి చదువును అటకెక్కించాడు. ఇక్కడే కథ అడ్డం తిరిగింది. ‘చదువు, ఉద్యోగం సద్యోగం లేని వాడిని ఎలా పెళ్లి చేసుకోవాలి..?’ అని ప్రియురాలు, ఆమె తల్లి ప్రశ్నించారు. ఆ ప్రియుడు ప్రేమోన్మాదిగా మారాడు. ఆరేళ్లు అమితంగా తాను ప్రేమించిన యువతిని సజీవ దహనం చేసి కిరాతకుడయ్యాడు. తనకు దక్కని ప్రియురాలు ఇంకెవరికీ దక్కకూడదనే ఉన్మాదంతో ఆ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. తమ ఎదుటే పెట్రోలు పోసి తగులబెడుతుంటే అడ్డొచ్చిన ఆ యువతి తల్లి, చెల్లిపైనా పోసి నిప్పంటించాడు. చెన్నైలోని ఆదంబాక్కంలో సోమవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సేలంకు చెందిన షణ్ముగం(50), రేణుక(42) దంపతుల కుటుంబం కొన్నేళ్ల క్రితం చెన్నై ఆదంబాక్కం సరస్వతి నగర్ ఏడో వీధిలో స్థిర పడింది. వీరికి కుమార్తెలు ఇందుజా(22), నివేద(20), కుమారుడు మనోజ్(15) ఉన్నారు. పెద్దకుమార్తె ఇందుజా గిండిలోని ఓ ప్రముఖ స్కూల్లో పాఠశాల చదువును ముగించింది. ఈ సమయంలో వేళచ్చేరికి చెందిన ముత్తుకుమార్ కుమారుడు ఆకాష్(24)తో స్నేహం ఏర్పడింది. తామే బెస్ట్ ఫ్రెండ్స్ అన్నట్టుగా మెలిగారు. ప్లస్ ఒన్లోనే ఈ ఇద్దరు ఒకర్ని మరొకరు ఇష్టపడే రీతిలో వ్యవహరించారు. ప్లస్‌టూ ముగియగానే ఇందుజా బీటెక్ , ఆకాష్ డిప్లొమో కోర్సులపై దృష్టి పెట్టారు. వీరిద్దరి కళాశాలలు వేరైనా స్నేహం మాత్రం కొనసాగింది. కాల క్రమేణా మిత్రులు ప్రేమికులయ్యారు. ప్రేమికులుగా.. ఆకాష్, ఇందుజా కళాశాల జీవితంలోకి అడుగు పెట్టిన నంతరం ప్రేమ పక్షుల్లా ఇద్దరూ పెద్దల కళ్లు గప్పి చెన్నైలో చెట్టాపట్టలేసుకుని తిరగని ప్రదేశం అంటూ లేదని చెప్పవచ్చు. పీకల్లోతు ప్రేమలో మునిగినా, ఇందుజా మాత్రం తన దృష్టిని చదువుల మీదే పెట్టింది. అయితే, ఆకాష్ చదువును అటకెక్కించాడు. తన ఇంటికి ఆకాష్ వచ్చి వెళ్లేంతగా చనువును ఇందుజా పెంచుకుంది. ఇందుజా తండ్రి బెంగళూరుకు బదిలీ కావడంతో వీరికి అడ్డు అన్న వారే లేరు. ఆ ఇద్దరు స్కూల్మెట్సే కదా.. అనుకుని తల్లి రేణుక ఎన్నడూ ఖండించలేదు. దీనిని అదనుగా తీసుకున్న ఆకాష్ ఆ కుటుంబానికి దగ్గరై తలలో నాలుకలా మారాడు. ఆ ఇంటికి కావాల్సినవన్నీ తానే స్వయంగా వెళ్లి తీసుకొచ్చే వాడు. కథ అడ్డం తిరిగింది ఓ దశలో రేణుకతో ఇందుజాను తనకు ఇచ్చి వివాహం జరిపించాలన్నట్టు ఆకాష్ చమత్కారంతో ప్రతిపాదన తీసుకొచ్చినా, ఆమె చిన్న పిల్లల చేష్టలుగా పరిగణించి పెద్దగా పట్టించుకోకుండా మరో తప్పుచేసింది. ఆరు నెలల క్రితం బీటెక్ ముగించిన ఇందుజా తరమణిలోని ఓ ఐటీ సంస్థలో ఉద్యోగాన్ని దక్కించుకుంది. తనకు ఉద్యోగం వచ్చిన రెండు నెలలకు ఆకాష్‌తో ప్రేమ విషయాన్ని తల్లి రేణుక దృష్టికి తీసుకెళ్లింది. ఇందుకు ఆమె నిరాకరించడంతో కథ అడ్డం తిరిగింది. అప్పటివరకు ఆ ఇంటికి స్వేచ్ఛగా వచ్చే ఆకాష్‌కు తదుపరి తలుపులు తెరచుకోలేదు. మానసికంగా కుంగిన అతను ఇందుజా కోసం పరితపించడం మొదలెట్టాడు. ప్రేమోన్మాదిగా.. ఆరేళ్ల ప్రేమ పరిచయంలో నాలుగేళ్లుగా తనతో ప్రతి గంటకు ఓసారి ఫోన్లో మాట్లాడటం లేదా, వాట్సాప్‌లో చాటింగ్ వచ్చే ఇందుజా తనను దూరం పెట్టడంతో కుంగిపోయాడు. ఆమెను కలిసేందుకు శతవిధాలుగా ప్రయత్నించాడు. ఎట్టకేలకు కొద్ది రోజుల క్రితం అతి కష్టం మీద సంప్రదించగా, చదువును అటకెక్కించి, ఉద్యోగం, సద్యోగం లేకుండా తిరిగేవాడిని పెళ్లి చేసుకోవాలా..? అని తన తల్లి రేణుక ప్రశ్నిస్తోందని, ఇక తనకు దూరంగా ఉండమని ఇందుజా హెచ్చరించింది. ఆ తర్వాత అను పలుమార్లు ఆమె ఇంటికి వెళ్లి తల్లి రేణుకను ప్రాధేయపడ్డా ఫలితం శూన్యం. ప్రేమోన్మాదిగా మారిన ఆకాష్ రెండు రోజుల క్రితం సహచర ఉద్యోగి ఒకరితో ఇందుజా సన్నిహితంగా ఉండడాన్ని చూశాడు. దీంతో తనకు దక్కనిది మరొకరికి దక్కకూడదన్నంతగా ఉన్మాది అయ్యాడు. పెట్రోల్ పోసి నిప్పంటించి.. చివరి ప్రయత్నం లేదా, హతమార్చడం లక్ష్యంగా పథకంతో సోమవారం రాత్రి ఆకాష్ ఆదంబాక్కంకు చేరుకున్నాడు. రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో తలుపు తట్టగా, రేణుక వచ్చింది. ఆమెను చివరి ప్రయత్నంగా ప్రాధేయపడ్డాడు. ఫలితం శూన్యం. కులం అడ్డుగా ఉందని, ఉద్యోగం సద్యోగం లేని వాడికి ఇచ్చి ఎలా పెళ్లి చేయాలన్నట్టుగా ఆమె ప్రశ్నించడం, అదే సమయంలో ఇందుజా సైతం అక్కడికి వచ్చిన హెచ్చరించడంతో తనలోని ఉన్మాదిని ఆకాష్ బయటకుతీశాడు. ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. ముందుగా అక్కడ దాచిన పెట్టిన క్యాన్‌ను తీసుకుని క్షణాల్లో ఇంట్లోకి మళ్లీ దూరాడు. ఇందుజా మీద ఆ క్యాన్‌లో ఉన్న ద్రవాన్ని పోశాడు. అడ్డు వచ్చిన రేణుక, నివేదల మీద పోసి లైటర్‌తో నిప్పు పెట్టాడు. పెట్రోల్ కలిపిన టర్బన్ టైల్ ఆయిల్‌ను పోసిన దృష్ట్యా, క్షణాల్లో ఆ ముగ్గుర్ని మంటలు ఆవహించాయి. బెడ్రూమ్లో ఉన్న ఇందుజా సోదరుడు మనోజ్ బయటకు వచ్చేలోపు ఆకాష్ ఉడాయించాడు. సంఘటన స్థలంలోనే సజీవదహనం రేణుక ఇంటి నుంచి కేకల్ని విన్న కింది ఫ్లోర్‌లోని రామ్‌కుమార్ పైకి పరుగులు తీశాడు. మంటల్లో కాలుతున్న వారిని రక్షించే యత్నంచేశాడు. ఇరుగు పొరుగు వారు అక్కడికి చేరుకున్నారు. రేణుక, నివేదల్ని చుట్టుముట్టిన మంటల్ని ఆర్పారు. అయితే, ఇందుజ అక్కడే సజీవదహనమైంది. సమాచారం అందుకున్న ఆదంబాక్కం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. తీవ్రంగా గాయపడ్డ రేణుక, నివేదలను కీల్పాకం ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఆ ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఆ ఇల్లు ఎప్పుడూ సందడిగా ఉండేదని, అయితే, ఆ కుటుంబంలో చోటుచేసుకున్న తాజా ఘటనతో ఇరుగుపొరుగు వారు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్‌స్టేషన్‌లో లొంగుబాటు అజ్ఞాతంలోకి వెళ్లిన ఆకాష్ కోసం పోలీసులు రాత్రంతా గాలించారు. చివరకు మంగళవారం ఉదయాన్నే అతను ఆదంబాక్కం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. తన ప్రేమ పయనం నుంచి ఉన్మాదం వరకు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చి నేరాన్ని అంగీకరించాడు. తనకు దక్కనిది మరొకరికి దక్క కూడదని, తనను మోసం చేశారంటూ అందుకే సజీవదహనం చేశానంటూ చేసిన తప్పును కిరాతక ప్రేమికుడు సమర్థించుకునే యత్నం చేయడం గమనార్హం. -
పూరీ కొడుకు ఆకాశ్‌తో సెల్ఫీలకు క్రేజ్
-
మోదీ ఫాలో అవుతున్న యువకుడు ఎవరో తెలుసా?
బెంగళూరు: ఒక వైపు చెల్లిపెళ్లి.. మరోవైపు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి వచ్చిన అనూహ్య స్పందన దీంతో ఓ బెంగళూరు యువకుడు సంతోషంలో మునిగి తెలుతున్నాడు. ప్రధాని చేపట్టిన స్వచ్ఛ్భారత్ పథకం అంటే ప్రాణం పెట్టే తండ్రి కోరిక తీర్చేందుకు ఈ యువకుడు తన సోదరి వివాహ ఆహ్వాన పత్రికలపై స్వచ్చ్ భారత్ లోగోను ముద్రించాడు. అంతేకాదు స్వచ్ఛ భారత్ సింబల్ ముద్రించిన ఈ వెడ్డింగ్ కార్డును మోదీకి ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. అంతే ఆశ్చర్య పోవడం ఆ యువకుడి వంతైంది. వివరాల్లోకి వెళితే కర్నాటక రాజధాని బెంగళూరుకు చెందిన ఆకాష్ జైన్ తన సోదరి పెళ్ళి కోసం శుభలేఖలు ముద్రించారు. తండ్రి సూచన మేరకు సోదరి పెళ్ళి కార్డులపై స్వచ్ఛ భారత్ లోగో కూడా ముద్రించారు. దీంతోపాటు ఉత్సాహంగా ఆ పెళ్ళి శుభలేఖను మోదీకి పంపించాడు. అంతే ప్రధాని నుంచి ఊహించని విధంగా వచ్చిన స్పందన వచ్చింది. ఆకాష్, ఏప్రిల్ 1న ప్రధాని మోదీకి ట్వీట్ చేయగా, ఆకాష్ ట్వీట్‌ను మోదీ రీట్వీట్ చేయడంతోపాటు ట్విట్టర్లో ఆయన్ను ఫాలో అవడం విశేషంగా నిలిచింది. దీంతో ఉబ్బితబ్బిబ్బయిన ఆకాష్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. దీంతోపాటుగా ఆకాష్ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. ఫాలోయింగ్ కూడా అదే రేంజ్ లో ఊపందుకుంటోంది. Dear @narendramodi, My dad specifically wanted @swachhbharat logo to be there on my sister's wedding invitation, hence got it. @PMOIndia pic.twitter.com/kD28savm82 — Akash Jain (@akash207) April 1, 2017 -
ప్రాణమే ముద్దు ‘ఆకాష్’మే హద్దు
హెల్మెట్ వాడకంపై చిన్నారి వినూత్న ప్రచారం ఒక పుస్తకం పది చెడు అలవాట్ల్లను దూరం చేస్తుంది.... ఒక సంఘటన పది మందికి సాయపడేలా ప్రేరణ కలిగిస్తుంది. 2013వ సంవత్సరం మహాబలిపురం వద్ద జరిగిన ఒక సంఘటన ఐదేళ్ల చిన్నారిలో ప్రేరణ కలిగించింది. హెల్మెట్ లేకుండా వాహనాలను నడిపి ప్రమాదానికి గురైన సంఘటనతో చలించి పోయిన ఆకాష్‌ను హెల్మెట్‌పై ప్రచారం చేసేలా ఉసిగొల్పింది... ఎంతగా అంటే.... హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాన్ని నడిపిన ముఖ్యమంత్రినే నిలదీసేంతగా... రాష్ట్ర సరిహద్దులు దాటి పొరుగు రాష్ట్రాల్లోనూ ప్రచారం చేస్తూ ముఖ్యమంత్రినే మెప్పించిన ఐదేళ్ల చిన్నారి ఆకాష్ ఉదంతమిది. తిరువళ్లూరు: 2013వ సంవత్సరం తమిళనాడులోని కాంచీపురం జిల్లా మహాబలిపురం రోడ్డులో ఆకాష్‌తో కలిసి షికారుకు బయలుదేరాం. ఎప్పుడూ రద్దీగా ఉండే మాంబళం రోడ్డులో వాహనాలు రాకెట్లా దూసుకెళ్తున్నాయి. హెల్మెట్ లేకుండా చాలా మంది వాహనాలను నడుపుతూనే ఉన్నారు. సరిగ్గా ఆరు గంటల సమయంలో మా వెనుక నుండి వచ్చిన ద్విచక్ర వాహనం ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరికి తలపై తప్ప మరెక్కడా గాయం లేదని అప్పట్లో జరిగిన సంఘటనను వివరించాడు ఆకాష్ తండ్రి ఆనందన్. బహుశా ఇదే సంఘటన హెల్మెట్‌పై ప్రచారం నిర్వహించాలనే ఆలోచన ఆకాష్‌కు కలిగివుండవచ్చని వివరించాడు ఆనందన్. కాంచీపురం జిల్లా మహాబలిపురం ప్రాంతానికి చెందిన పెయింటర్ ఆనందన్. తల్లి యోగలక్ష్మి. గృహణి. వీరి ఐదేళ్ల కుమారుడు ఆకాష్ . చెన్నైలోని ప్రయివేటు పాఠశాలల్లో ఒకటో తరగతి చదువుతున్నాడు. మాంబళం రోడ్డు ప్రమాదం ఘటన చోటు చేసుకున్నప్పటి నుంచి ప్రతి చోటా సమయం దొరికినప్పడు హెల్మెట్‌పై ప్రచారం చేసేవాడు. అలా ప్రారంభమైన ప్రచారం ఆంధ్ర, కర్ణాటక, కేరళా, తమిళనాడు, పాండిచ్చేరి తదితర రాష్ట్రాల్లో హెల్మెట్‌పై ప్రచారం కొనసాగిస్తున్నాడు. ఇప్పటి వరకు ఆరు లక్షల కరపత్రాలను పంపిణీ చేసి, పది లక్షల మందిని కలిసి హెల్మెట్ ధరించాలని విన్నవించాడు. ఇతని బృందంలోని సభ్యులు మణిమేఘలై. 2014లో పాండిచ్చేరిలో హెల్మెట్‌పై ప్రచారం నిర్వహిస్తున్నారు. అదే సమయంలో ముఖ్యమంత్రి రంగస్వామి ద్విచక్ర వాహనంపై హెల్మెట్ లేకుండా వస్తున్నారు. రంగస్వామి వద్దకు వెళ్లిన ఆకాష్, హెల్మెట్ లేకుండా వాహనం నడపడం సరికాదంటూ సలహా ఇచ్చాడు. వెంటనే గుర్తించి ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి చిన్న పిల్లోడు మీరెవరో తెలియకుండా వాహనాన్ని ఆపేసాడంటూ క్షమాపణ కోరాం. కాని రంగస్వామి మాత్రం ఆకాష్ చేస్తున్న ప్రచారానికి మురిసిపోయాడు. అప్పటికప్పడు హెల్మెట్ తెప్పించి వేసుకోవడంతో పాటు తన చాంబర్‌కు తీసుకెళ్లి సన్మానించి ఆకాష్ పేరిట ప్రత్యేక కార్యక్రమాలు జరిపించాడు. ఈ ఘటన తమలో మరింత ఉత్సాహాన్ని నింపిందని వివరించాడు ఆకాష్ బృందంలోని ఓ సభ్యుడు తమిళ్‌సెల్వన్. ప్రచారం ఇలా హెల్మెట్‌పై ప్రచారం చేయాలని నిర్ణయించిన ఆకాష్‌కు తల్లిదండ్రులు బాసటగా నిలిచారు. ఆకాష్ చేస్తున్న హెల్మట్ ప్రచారాన్ని గమనించిన 20 మంది బృందంలో చేరారు. ఆకాష్‌కు పాఠశాల సెలవు రోజుల్లో హెల్మెట్ ప్రచారం కోసం వెళ్లేవాడు. ప్రచారం ఎలా నిర్వహించాలి. ఎక్కడ నిర్వహించాలి అనే విషయాన్ని ఆకాష్ నిర్ధేశించేవాడు. 20 మంది వేర్వేరు చోట నిలబడి కరపత్రాలను పంపిణీ చేసే వాడు. ఉదయం 8 గంటలకు ఇంటి నుంచి బయలుదేరితే సాయంత్రం వరకు ప్రచారం నిర్వహించి ఇంటికి వచ్చే వాళ్లం. మా ప్రచారాన్ని పోలీసులు స్వాగతించేవారు. అదే సమయంలో ఐదేళ్ల చిన్నారి ెహ ల్మెట్పై చేస్తున్న పోరాటంపై పలువురు ప్రశంసించే సమయంలో తాము పొందే ఆనందానికి అవధులు లేవంటూ మురిసిపోయారు మణిమేఖలై. ఒక పువ్వు- ఒక నవ్వు మంచి పనులకు ముహూర్తం చూడకూడదని తాతగారు చెప్పేవారు. ప్రమాదం జరిన తీరును చూసి తన వంతుగా హెల్మెట్‌పై ప్రచారం చేయాలని నిర్ణయించి తల్లిదండ్రులకు చెప్పా. ఈ ప్రచారం వలన చదువు పాడైపోతుందని బాధపడ్డారు తల్లిదండ్రులు. పాఠశాలకు ఒక్క రోజు కూడా నిలిచిపోనని చెప్పడంతో వారు ఓకే చెప్పారు. రెండు సంవత్సరాల్లో వంద శాతం పాఠశాలకు హాజరుకావడంతో అవార్డు వచ్చింది. అయితే నేను చేస్తున్న ప్రచారం కొంత వినూత్నంగా ఉండాలన్న ఉద్దేశంతోనే హెల్మెట్‌తో వాహనాలను నడిపే వారిని సన్మానించేలా పూల బొకే ఇవ్వడం, లేకుంటే ఒక నవ్వు నవ్వి కరపత్రాన్ని ఇవ్వడం ఇది దినచర్య అంటూ వివరించాడు ఆకాష్. మిడిమిడి జ్ఞానం. అసలే ఆరేళ్లు దాటని వయస్సులో చిన్నారి చేస్తున్న అవగాహన ప్రచారానికి అపూర్వ స్పందన లభిస్తోంది. వందలాది అవార్డులు.. ప్రశంసలు వచ్చినా ఆత్మసంతృప్తి లేదంటూనే తన ఆశయం కోసం నిరంతరం శ్ర మిస్తున్న ఆకాష్‌ను మనసారా దీవిద్దాం. -
పూరీ జగన్నాథ్ తనయుడు హీరోగా 'ఆంధ్ర పోరీ'
పూరి ఆకాశ్ బాలనటునిగా ఉన్నప్పుడే... ‘భవిష్యత్ హీరో’గా ప్రేక్షకులు ఫిక్సయిపోయారు. ‘చిరుత, బుజ్జిగాడు... మేడిన్ చెన్నై, గబ్బర్‌సింగ్, ధోనీ’ తదితర చిత్రాల్లో బాలనటునిగా ఆకాశ్ కనబరిచిన అభినయమే దానికి కారణం. పసి వయసులోనే మాస్ మెచ్చే అభినయాన్ని కనబరిచి, తనపై ఉన్న అంచనాలను పెంచేశాడు ఆకాశ్. ఈ చిచ్చరపిడుగు హీరోగా మారే ఘడియ కోసం ఎదురుచూసిన ఆడియన్స్ కూడా లేకపోలేదు. ఎట్టకేలకు వారి ఎదురు చూపులకు తెరదించుతూ హీరోగా ఆకాశ్ అరంగేట్రానికి రంగం సిద్ధమైంది. అయితే... అందరూ ఊహించినట్లు ఈ చిత్రానికి తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకుడు కాదు. ‘ఋషి’ ఫేం రాజ్ ముదిరాజ్ దర్శకుడు. సినిమా పేరు ‘ఆంధ్రాపోరి’. ప్రసాద్ సంస్థల అధినేత ఎ.రమేశ్‌ప్రసాద్ నిర్మాత. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో జరిగాయి. పూరీ దంపతులు ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరయ్యారు. మరాఠీలో ఘనవిజయం సాధించిన ‘టైంపాస్’ చిత్రానికి రీమేక్‌గా రూపొందతోన్న ఈ చిత్రంలో ఆకాశ్‌కు జోడీగా ఉల్కా గుప్తా నటిస్తున్నారు. జనవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. -
వెండితెరపై పర్వీన్ జీవితం?
సినిమా తారల వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి చాలామందికి ఉంటుంది. ముఖ్యంగా వెండితెరపై ఓ స్థాయిలో విజృంభించిన పర్వీన్ బాబీ లాంటి తారల గురించి తెలుసుకోవాలను కుంటున్నారు. నటిగా మంచి కీర్తి ప్రతిష్ఠలు సంపాదించుకున్న పర్వీన్ నిజజీవితంలో మాత్రం చాలా ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. ఆ సంఘటనల సమాహారంగా హిందీ, బెంగాలీ భాషల్లో ఓ సినిమా రూపొందించనున్నారు దర్శకుడు అగ్నిదేవ్ చటర్జీ. ఈ సినిమాకి ‘డిస్టర్బ్డ్’ అనే టైటిల్ ఖరారు చేశారు. హిందీ రూపంలో ప్రియాంక చోప్రాను నాయికగా తీసుకోవాలనుకుంటున్నారట. బెంగాలీ చిత్రానికి ఇంకా నాయికను ఖరారు చేయలేదని సమాచారం. వచ్చే నెలలో కానీ, కుదరకపోతే జూన్‌లో కానీ ఈ చిత్రం షూటింగ్‌ని ప్రారంభించాలనుకుంటున్నారు.ఇందులో తనతనయుడు ఆకాశ్‌ని హీరోగా నటింపజేయాలనుకుంటు న్నారట దర్శకుడు అగ్నిదేవ్ చటర్జీ. -
పాతబస్తీ లో రెండేళ్ల బాలుడి కిడ్నాప్ వ్యవహారం సుఖాంతం
మూడు కిలోల బంగారం డిమాండ్ చేస్తూ రెండేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసిన ఘటనను హైదరాబాద్ పొలీసులు విజయవంతంగా చేధించారు. ఈ కిడ్నాప్ వ్యవహారాన్నిచేధించిన హైదరాబాద్ స్పెషల్ పోలీసుల బృందం ఇద్దరు నిందితులను పశ్చిమ బెంగాల్ లో అరెస్ట్ చేశారు. కిడ్నాప్ కు పాల్పడిన రాం ప్రసాద్ మిస్త్రీ, ప్రియాంక హల్దర్ లిద్దర్ని 24 పరగణాల జిల్లా దుమ్కి గ్రామం నుంచి నవంబర్ 9 తేదిన అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. కిడ్నాప్ గురైన ఆకాశ్ ను సురక్షితంగా తీసుకువచ్చామని మీడియాకు వెల్లడించారు. కిడ్నాప్ గురైన ఆకాశ్ తండ్రి గోపాల్ చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రికాబ్ గంజ్ ప్రాంతంలో స్వర్ణకారుడిగా పనిచేస్తున్నారు. నవంబర్ 2 తేదిన తన అక్క అల్లుడు రాంప్రసాద్ మిస్తీ టపాసులు కొనిస్తానని తీసుకువెళ్లాడని.. ఆతర్వాత ఆకాశ్ రాకపోవడంతో పోలీసులకు గోపాల్ ఫిర్యాదు చేశారు. కిడ్నాప్ చేసిన నిందితులు మూడు కిలోల బంగారాన్ని డిమాండ్ చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు మిస్త్రీ, ప్రియాంకలను అనుమానించారు. విచారణలో రాంప్రసాద్ నేరాన్ని అంగీకరించారని పోలీసులు తెలిపారు. నిందితుడు గోపాల్ వద్ద పనిచేశారని.. కొన్ని విభేదాలు తలెత్తడంతో మిస్త్రీని ఉద్యోగం నుంచి తొలిగించడంతో కొంతకాలం కోల్ కతాకు వెళ్లిపోయారని పోలీసులు తెలిపారు. ఆతర్వాత మళ్లీ హైదరాబాద్ కు వచ్చి ఉంటున్నట్టు పోలీసులు తెలిపారు. నిందిలిద్దర్ని టాన్సిట్ వారెంట్ పై హైదరాబాద్ కు తీసుకువచ్చి.. స్థానిక కోర్టులో హాజరుపరిచామన్నారు. -
ఒకటే పాత్రతో ఆరు భాషల్లో సినిమా
‘‘ఇప్పటివరకు నేను ఎక్కువ కష్టపడి చేసిన చిత్రం ఇదే. ఆరు భాషల్లో రూపొందించడం వల్ల ఒక్కో సన్నివేశాన్ని ఆరుసార్లు చిత్రీకరించాం’’ అన్నారు ఆకాష్. వారియర్స్ క్లాన్ పిక్చర్స్ పతాకంపై రాహుల్‌సింగ్ ఖగ్వాల్ దర్శకత్వంలో ఏక పాత్రతో రూపొందిన చిత్రం ‘నాతో నేను’. ఏకైక పాత్రను ఆకాష్ పోషించగా, నేహా త్యాగి ఈ చిత్రాన్ని నిర్మించారు. హైదరాబాద్‌లో ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వీరభద్రమ్, ఈశ్వర్‌రెడ్డి, బెక్కెం వేణుగోపాల్, బసిరెడ్డి, గణేష్ దొండి తదితరులు చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘భారతీయ చలన చిత్ర చరిత్రలో ఏకకాలంలో ఆరు భాషల్లో ఒక చిత్రాన్ని రూపొందించిన ఘనత మాకే దక్కుతుంది. ఒకే లొకేషన్లో ఈ చిత్రాన్ని రూపొందించడం ఓ విశేషం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎ.కె. ఎన్.సెబాస్టియన్, మాటలు: సిద్దార్ధ్ ఇంజేటి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: మయాంక్ గుప్తా. -
అమావాస్యనాడు ఏం జరిగింది?
ఓ దుర్మార్గుడి కారణంగా మరణించిన ఓ యువజంట... ప్రేతాత్మలుగా మారి వాడిపై ఎలా ప్రతీకారం తీర్చుకుంది? అనే ఆసక్తికరమైన కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘అమావాస్య’. రాఖీసావంత్ సోదరుడు రాకేష్ సావంత్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆకాష్, నృపుర్ మెహతా, రూబీ అహ్మద్, సోనమ్ ప్రధాన పాత్రధారులు. నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా గురించి రాకేష్ సావంత్ మాట్లాడుతూ -‘‘కథ పాతదైనా...కథనం కొత్తగా ఉంటుంది. హారర్ చిత్రాల్లో ఇది కొత్త కోణమని చెప్పొచ్చు. నటి సీమపై ఇటీవలే ఐటమ్ సాంగ్ తీశాం. ఒక పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. డబ్బింగ్ కూడా పూర్తయ్యింది. త్వరలో పాటల్ని విడుదల చేస్తాం. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. కోట శ్రీనివాసరావు, జీవా, ముమైత్‌ఖాన్, శ్రావణ్, సంభావన సేత్, జితేందర్‌సింగ్ సాహు, రాజేష్ వివేక్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: మణికంఠ నాయుడు, కెమెరా: ద్రిడ్ బసు, సంగీతం: సయ్యద్ అహ్మద్.