Singer Sunitha Son Aakash Tollywood Debut As Hero, Deets Inside - Sakshi
Sakshi News home page

Singer Sunitha: హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న సింగర్‌ సునీత కుమారుడు!

Published Mon, Jan 31 2022 3:10 PM | Last Updated on Mon, Jan 31 2022 4:31 PM

Singer Sunitha Son Aakash Debut As Hero Soon Into Tollywood - Sakshi

సింగర్‌ సునీత.. తెలుగు సినీ, సంగీత ప్రియులకు పెద్ద పరిచయం అక్కర్లేని పేరు. గాయనిగా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె స్టార్‌ హీరోయిన్లతో సమానమైన క్రేజ్‌ సంపాదించుకున్నారు. నాలుగు పదుల వయసులో కూడా తన అందం, అభినయం, అంతకు మించి తన స్వీట్‌ వాయిస్‌తో ఎంతో మందిని ఆకట్టుకుంటున్నారు సునీత.  ఈ క్రమంలో ఆమెకు పెరిగిన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయినప్పటికీ మీడియా, సోషల్‌  మీడియాలో చాలా అరుదుగా కనిపించే సునీత రెండో పెళ్లి అనంతరం తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.

చదవండి: 'నాకే కాదు, నా భర్తకు కూడా సమంత హాట్‌గా కనిపించింది'

ఏడాది క్రితం రామ్‌ వీరపనేని అనే వ్యాపారవేత్తను రెండో పెళ్లి చేసుకున్న ఆమె ఇటూ మీడియాలో, అటూ సోషల్‌ మీడియాలో తరచూ దర్శనం ఇస్తున్నారు. ఇటీవల తన భర్త రామ్‌ ఓ వివాదంలో చిక్కుకోవడంతో ఆమె మరోసారి వార్తల్లో నిలిచారు. ఇక తాజాగా ఆమె కుమారుడికి సంబంధించిన ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ బయటకు వచ్చింది. కాగా సునీత తనయుడు ఆకాశ్‌ త్వరలో హీరోగా టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. సునీత కొడుకుని హీరోగా పరిచయం చెయ్యడానికి ఆమె రెండో భర్త రామ్ వీరపనేని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.

చదవండి: నల్లగా ఉంది.. కలర్‌ తక్కువ అని చాలా మాటలు అన్నారు : హీరోయిన్‌

అయితే సునీత కూతురు ఓ షోలో పాడి సింగర్‌గా బుల్లితెరకు పరిచమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె కుమారుడు ఆకాశ్‌ హీరోగా పరిచయం కాబోతున్నాడనే వార్తలు వినిపించడంతో ఆమె ఫ్యాన్స్‌ అంతా మురిసిపోతున్నారు. కాగా సునీత 19 ఏళ్ల వయసులో కిరణ్‌ కుమార్‌ అనే వ్యక్తిని తొలి వివాహం చేసుకోగా.. వారికి కుమారుడు ఆకాశ్‌, కూతురు శ్రేయాలు జన్మించారు. ఈ క్రమంలో భర్త కిరణ్‌ కుమార్‌తో విభేధాలు తలెత్తడంతో అతడికి సునీత విడాకులు ఇచ్చింది. ఆ తర్వాత 2020లో మ్యాంగ్‌ మీడియా అధినేత, వ్యాపారవేత్త  రామ్‌ వీరపనేనిని సునీత రెండవ వివాహం చేసుకుని సెటిలైపోయారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement