son name
-
దిల్ రాజు కొడుకు పేరేంటో తెలుసా ?
Is Dil Raju Reveals His New Born Son Name: తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. ఆయన ఇటీవల మరోసారి తండ్రి అయిన విషయం తెలిసిందే. దీంతో దిల్ రాజు ఇంటికి వారసుడొచ్చాడని నెటిజన్లు, టాలీవుడ్ సెలబ్రిటీలు శుభాకాంక్షలు కూడా తెలిపారు. అయితే దిల్ రాజు కుమారుడికి అద్భుతమైన పేరు పెట్టినట్లు ప్రస్తుతం టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. దిల్ రాజు వారసుడికి 'అన్వి రెడ్డి' అని నామకరణం చేసినట్లు సమాచారం. అయితే దిల్ రాజు మొదటి భార్య అనిత పేరు కలిసివచ్చేలా ఈ పేరు పెట్టినట్లు టాక్. ఈ పేరు విషయంలో దిల్ రాజు రెండో భార్య తేజస్వినికి ఎలాంటి ఇబ్బందిలేదని, అలాగే సంస్కృతంలో కూడా ఆ పేరుకు మంచి అర్థం ఉండటంతో అడ్డుచెప్పలేదట. కాగా దిల్ రాజు మొదటి భార్య అనిత గుండెపోటుతో 2017లో మరణించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన తేజస్విని రెండో వివాహం చేసుకున్నారు. డిసెంబర్ 10, 2020న నిజామాబాద్‌లో దిల్ రాజు, తేజస్వినిల వివాహం జరిగింది. చదవండి: ఘోరంగా ఉన్న నిన్ను సినిమాల్లోకి ఎలా తీసుకుంటున్నారో?.. నితిన్ పాటకు మహేశ్ బాబు స్టెప్పులు !.. వీడియో వైరల్ ఆ పుకార్లు నిజమే.. తేల్చి చెప్పేసిన రష్మిక మందన్నా.. -
హీరోగా డీవీవీ దానయ్య తనయుడు ఎంట్రీ, డైరెక్టర్ ఎవరంటే!
‘ఆర్ఆర్ఆర్’ నిర్మాత డివివి దానయ్య తనయుడు కల్యాణ్ హీరోగా తెలుగు వెండితెరకు త్వరలో పరిచయం కాబోతున్నాడు. తనయుడిని లాంచ్ చేసే బాధ్యతను దానయ్య యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు అప్పగించినట్లు టాక్ నడుస్తోంది. అ, కల్కి, వంటి సినిమాలతో యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ తేజ సజ్జను హీరోగా పరిచయం చేశాడు. మరోసారి తేజ హీరోగా హను-మాన్ అనే సూపర్ హీరో చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మను కళ్యాణ్ తొలి చిత్రానికి దర్శకత్వం వహించడానికి ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కల్యాణ్ కోసం ప్రస్తుతం ప్రశాంత్ వర్మ ఓ విభిన్నమైన కథను సిద్ధం చేసినట్లు సమాచారం. దీనికి అదిరా అనే టైటిల్ పరిశీలిస్తున్నాడట వర్మ. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందని సమాచారం. మరోవైపు కళ్యాణ్ హీరోగా మారేందుకు అన్నివిధాల ట్రైన్ అయ్యాడట. నటన, ఫైట్స్ తదితర అంశాల్లో స్పెషల్‌గా శిక్షణ కూడా తీసుకున్నాడట. మరోవైపు దానయ్య ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ విడుదల కోసం డివివి దానయ్య ఎదురు చూస్తున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ మార్చ్ 25న విడుదలకు సిద్ధంగా ఉంది. -
హీరోగా ‘మైనింగ్ కింగ్’ గాలి జనార్థన్ రెడ్డి కుమారుడు, మూవీ టైటిల్ ఖరారు
కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి తనయుడు గాలి కిరిటి సినీరంగ ప్రవేశం చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే గాలి కిరిటి కన్నడ, తెలుగు ఇండస్ట్రీకి హీరోగా పరిచయంగా కాబోతున్నాడు. దీనికి సంబంధించిన స్క్రీప్ట్ వర్క్, నటీనటుల ఎంపిక కూడా పూర్తయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో త్వరలోనే మూవీ సెట్స్‌పైకి రానుందంటూ తాజాగా చిత్ర బృందం అప్డేట్ ఇచ్చింది. యువ దర్శకుడు రాధాకృష్ణ ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ సినిమాకు వారాహి అనే టైటిల్‌ను ఖరారు చేశారు. చదవండి: విజయ్‌తో పెళ్లి వార్తలపై తొలిసారి నోరు విప్పిన రష్మిక, ఏం చెప్పిందంటే.. తెలుగు కన్నడ ద్విభాషా చిత్రంగా ప్రేమ, కుటుంబ కథా అంశాలను కలిపి రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ప్రారంభానికి సన్నాహాలు చేసుకుంటున్నది. దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా..కె సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు తీసుకుంటున్నారు. పీటర్ హెయిన్ స్టంట్స్ సమకూర్చుతున్నారు. ఈ మూవీలో మిగతా నటీనటులను కూడా త్వరలోనే ప్రకటించనున్నారు. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలన్న ఆలోచన రాగానే దానిపైనే దృష్టి సారించిన కిరీటి స్వదేశంతో పాటు విదేశాల్లోనూ ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాడట. మొత్తంగా ఓ రేంజిలో సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న గాలి కిరీటి ఏ మేర జనాలను మెప్పిస్తారో చూడాలి. -
హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న సింగర్ సునీత కుమారుడు!
సింగర్ సునీత.. తెలుగు సినీ, సంగీత ప్రియులకు పెద్ద పరిచయం అక్కర్లేని పేరు. గాయనిగా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె స్టార్ హీరోయిన్లతో సమానమైన క్రేజ్ సంపాదించుకున్నారు. నాలుగు పదుల వయసులో కూడా తన అందం, అభినయం, అంతకు మించి తన స్వీట్ వాయిస్‌తో ఎంతో మందిని ఆకట్టుకుంటున్నారు సునీత. ఈ క్రమంలో ఆమెకు పెరిగిన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయినప్పటికీ మీడియా, సోషల్ మీడియాలో చాలా అరుదుగా కనిపించే సునీత రెండో పెళ్లి అనంతరం తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. చదవండి: 'నాకే కాదు, నా భర్తకు కూడా సమంత హాట్‌గా కనిపించింది' ఏడాది క్రితం రామ్ వీరపనేని అనే వ్యాపారవేత్తను రెండో పెళ్లి చేసుకున్న ఆమె ఇటూ మీడియాలో, అటూ సోషల్ మీడియాలో తరచూ దర్శనం ఇస్తున్నారు. ఇటీవల తన భర్త రామ్ ఓ వివాదంలో చిక్కుకోవడంతో ఆమె మరోసారి వార్తల్లో నిలిచారు. ఇక తాజాగా ఆమె కుమారుడికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. కాగా సునీత తనయుడు ఆకాశ్ త్వరలో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. సునీత కొడుకుని హీరోగా పరిచయం చెయ్యడానికి ఆమె రెండో భర్త రామ్ వీరపనేని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. చదవండి: నల్లగా ఉంది.. కలర్ తక్కువ అని చాలా మాటలు అన్నారు : హీరోయిన్ అయితే సునీత కూతురు ఓ షోలో పాడి సింగర్‌గా బుల్లితెరకు పరిచమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె కుమారుడు ఆకాశ్ హీరోగా పరిచయం కాబోతున్నాడనే వార్తలు వినిపించడంతో ఆమె ఫ్యాన్స్ అంతా మురిసిపోతున్నారు. కాగా సునీత 19 ఏళ్ల వయసులో కిరణ్ కుమార్ అనే వ్యక్తిని తొలి వివాహం చేసుకోగా.. వారికి కుమారుడు ఆకాశ్, కూతురు శ్రేయాలు జన్మించారు. ఈ క్రమంలో భర్త కిరణ్ కుమార్‌తో విభేధాలు తలెత్తడంతో అతడికి సునీత విడాకులు ఇచ్చింది. ఆ తర్వాత 2020లో మ్యాంగ్ మీడియా అధినేత, వ్యాపారవేత్త రామ్ వీరపనేనిని సునీత రెండవ వివాహం చేసుకుని సెటిలైపోయారు. -
దుబాయ్‌లో హీరోయిన్‌తో హీరో విక్రమ్ తనయుడు డేటింగ్, ఫొటోలు వైరల్
Hero Vikram Son Dhruv Vikram In Dubai With His Rumoured Girlfriend Banita Sandhu: తమిళ స్టార్ హీరో, విలక్షణ నటుడు విక్రమ్ చియాన్ కుమారుడు ధృవ్ విక్రమ్ ఇప్పటికే సినీ ఇండస్ట్రీకి పరిచమైన సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ బ్లాక్‌బస్టర్ చిత్రం అర్జున్ రెడ్డి రీమేక్ ‘ఆదిత్య వర్మ’తో ధృవ్ తమిళ పరిశ్రమకు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో బ్రిటిష్‌కు(భారత సంతతికి చెందిన బ్రిటిష్ కుటుంబంలో జన్మించింది) చెందిన నటి బనిత సంధు హీరోయిన్గా నటించింది. ఇదిలా ఉంటే బనిత, ధృవ్ కొంతకాలంగా డేటింగ్లో ఉన్నారంటూ జోరుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అంతేగాక వీరిద్దరూ పీకల్లోతూ ప్రేమలో మునిగి తేలుతున్నారంటూ పలు తమిళ మీడియాల్లో వార్తలు కూడా వచ్చాయి. ఈ క్రమంలో న్యూ ఇయర్‌కి ధృవ్ షేర్ చేసిన ఫొటోలు, వీడియోలు చూస్తుంటే వీర్దిదరూ నిజంగా ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా ఈ జంట కలిసి దుబాయ్ వెళ్లారు. అక్కడ హోటల్ రూంలో బనితతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ దానికి బ్యాక్‌గ్రౌండ్‌లో ‘డర్కెస్ట్ హోల్డ్ ఆన్ వీ ఆర్ గోయింగ్ హోం’ అనే ఇంగ్లీష్ పాటను జత చేశాడు. అంతేకాదు బనిత తమ హోటల్ రూం బాల్కానిలో నిలబడిన ఫొటోను కూడా షేర్ చేస్తూ హ్యాపీ న్యూ ఇయర్ అంటూ విష్ చేశాడు ధృవ్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ధృవ్, బనితలను ఇలా చూసి వారి ఫ్యాన్స్ అంతా షాక్ అవుతున్నారు. ఏంటి వీరిద్దరూ నిజంగా డేటింగ్లో ఉన్నారా? అంటూ చర్చించుకుంటున్నారు. అంతేకాదు న్యూ ఇయర్ సందర్భంగా వారు రిలేషన్లో ఉన్నట్లు చెప్పకనే చెప్పారా?, మీరు ఇద్దరూ ఎంతకాలంగా రిలేషన్లో ఉన్నారంటూ నెటిజన్లు, ఫ్యాన్స్ వారి ఫొటోలను రీట్వీట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ధృవ్ నటించిన రెండవ చిత్రం మహాన్ షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. అలాగే అక్టోబర్ హూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్రిటిష్ బ్యూటీ చివరిగా విక్కీ కౌశల్ సర్దార్ ఉదమ్లో నటించింది. ప్రస్తుతం ఆమె కవిత అండ్ థెరిసాలో నటిస్తోంది. Dhruv vikram and banita Sandhu .... Nalla iruntha sari .... — நான் ஒரு சங்கி (@aruntwitsss) January 1, 2022 the audacity pic.twitter.com/o2ubrtN95E — wouldpackher (@coolhuncoolhun) January 1, 2022 -
కొడుకుతో నటి క్రికెట్ : ఫోటోలు చూస్తే ఫిదానే
సాక్షి, ముంబై: బాలీవుడ్ నటి మలైకా అరోరా (47) తన కుమారుడు అర్హాన్ ఖాన్(19)తో క్రికెట్ ఆడుతూ సందడి చేశారు. ఇటీవల ధర్మశాల నుండి ముంబైకి తిరిగి వచ్చిన మలైకా అర్హాన్‌తో కలిసి క్రికెట్ ఆడుతూ ఎంజాయ్ చేశారు. తల్లి కొడుకులిద్దరూ తమ నివాసాన్నే క్రికెట్ పిచ్‌గా మార్చేశారు. అథ్లెటైజర్ ధరించిన మలైకా, అర్హాన్ బౌలింగ్‌లో బిగ్షాట్స్ కొడుతున్న ఫోటోలు ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఫిట్నెస్తో వాహ్వా అనిపించే మలైకా, బ్యాటింగ్, బౌలింగ్ స్టిల్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. మరో ఫోటోలో బాడ్మింటన్ ఆడుతూ కనిపించడంతో సూపర్ కూల్ మమ్మీ అంటూ కమెంట్ చేస్తున్నారు. ఈ ఫోటోలలో ఆమె పెంపుడు కుక్క కాస్పర్ కూడా ఉండటం విశేషం. కాగా మొదటి భర్త ఆర్భాజ్ ఖాన్‌తో విడాకులు తీసుకున్న అనంతరం అర్జున్‌కపూర్‌తో డేటింగ్ చేస్తున్న మలైకా ఇటీవల ధర్మశాల వెళ్లింది. త్వరలో ఈ జంట పెళ్లి కూడా చేసుకోబోతోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. View this post on Instagram A post shared by Nir_haan (@nir_haan) View this post on Instagram A post shared by Nir_haan (@nir_haan) -
అల్లు వారసుడి పేరు అయాన్
వైవాహిక బంధానికి అసలైన అర్థం బిడ్డ పుట్టిన తర్వాతే తెలుస్తుందని ఇటీవల తండ్రయిన సందర్భంగా అల్లు అర్జున్ పేర్కొన్నారు. తల్లిదండ్రులు కాకముందు, ఆలుమగలు ఏదో డేటింగ్ చేస్తున్నట్లుగా ఉంటుందని కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. తన ముద్దుల తనయుడికి ‘అయాన్’ అనే పేరుని ఖరారు చేశారు. ఈ పేరుకి ఇస్లామ్‌లో ‘దేవుడి బహుమతి’ అని, సంస్కృతంలో ‘పవిత్రం’ అని, పెర్షియన్లో ‘గుర్తుంచుకోదగ్గవాడు’ అని, హెబ్రూలో ‘ప్రశాంతం’ అని అర్థం అని అల్లు అర్జున్ పేర్కొన్నారు.