
డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, డీవీవీ దానయ్య కుమారుడు కల్యాణ్
‘ఆర్ఆర్ఆర్’ నిర్మాత డివివి దానయ్య తనయుడు కల్యాణ్ హీరోగా తెలుగు వెండితెరకు త్వరలో పరిచయం కాబోతున్నాడు. తనయుడిని లాంచ్ చేసే బాధ్యతను దానయ్య యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు అప్పగించినట్లు టాక్ నడుస్తోంది. అ, కల్కి, వంటి సినిమాలతో యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ తేజ సజ్జను హీరోగా పరిచయం చేశాడు. మరోసారి తేజ హీరోగా హను-మాన్ అనే సూపర్ హీరో చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మను కళ్యాణ్ తొలి చిత్రానికి దర్శకత్వం వహించడానికి ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
కల్యాణ్ కోసం ప్రస్తుతం ప్రశాంత్ వర్మ ఓ విభిన్నమైన కథను సిద్ధం చేసినట్లు సమాచారం. దీనికి అదిరా అనే టైటిల్ పరిశీలిస్తున్నాడట వర్మ. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందని సమాచారం. మరోవైపు కళ్యాణ్ హీరోగా మారేందుకు అన్నివిధాల ట్రైన్ అయ్యాడట. నటన, ఫైట్స్ తదితర అంశాల్లో స్పెషల్‌గా శిక్షణ కూడా తీసుకున్నాడట. మరోవైపు దానయ్య ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ విడుదల కోసం డివివి దానయ్య ఎదురు చూస్తున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ మార్చ్ 25న విడుదలకు సిద్ధంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment