
Hero Vikram Son Dhruv Vikram In Dubai With His Rumoured Girlfriend Banita Sandhu: తమిళ స్టార్ హీరో, విలక్షణ నటుడు విక్రమ్ చియాన్ కుమారుడు ధృవ్ విక్రమ్ ఇప్పటికే సినీ ఇండస్ట్రీకి పరిచమైన సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ బ్లాక్‌బస్టర్ చిత్రం అర్జున్ రెడ్డి రీమేక్ ‘ఆదిత్య వర్మ’తో ధృవ్ తమిళ పరిశ్రమకు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో బ్రిటిష్‌కు(భారత సంతతికి చెందిన బ్రిటిష్ కుటుంబంలో జన్మించింది) చెందిన నటి బనిత సంధు హీరోయిన్‌గా నటించింది. ఇదిలా ఉంటే బనిత, ధృవ్ కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నారంటూ జోరుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అంతేగాక వీరిద్దరూ పీకల్లోతూ ప్రేమలో మునిగి తేలుతున్నారంటూ పలు తమిళ మీడియాల్లో వార్తలు కూడా వచ్చాయి.
ఈ క్రమంలో న్యూ ఇయర్‌కి ధృవ్ షేర్ చేసిన ఫొటోలు, వీడియోలు చూస్తుంటే వీర్దిదరూ నిజంగా ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా ఈ జంట కలిసి దుబాయ్ వెళ్లారు. అక్కడ హోటల్ రూంలో బనితతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ దానికి బ్యాక్‌గ్రౌండ్‌లో ‘డర్కెస్ట్ హోల్డ్ ఆన్ వీ ఆర్ గోయింగ్ హోం’ అనే ఇంగ్లీష్ పాటను జత చేశాడు. అంతేకాదు బనిత తమ హోటల్ రూం బాల్కానిలో నిలబడిన ఫొటోను కూడా షేర్ చేస్తూ హ్యాపీ న్యూ ఇయర్ అంటూ విష్ చేశాడు ధృవ్.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ధృవ్, బనితలను ఇలా చూసి వారి ఫ్యాన్స్ అంతా షాక్ అవుతున్నారు. ఏంటి వీరిద్దరూ నిజంగా డేటింగ్‌లో ఉన్నారా? అంటూ చర్చించుకుంటున్నారు. అంతేకాదు న్యూ ఇయర్ సందర్భంగా వారు రిలేషన్‌లో ఉన్నట్లు చెప్పకనే చెప్పారా?, మీరు ఇద్దరూ ఎంతకాలంగా రిలేషన్‌లో ఉన్నారంటూ నెటిజన్లు, ఫ్యాన్స్ వారి ఫొటోలను రీట్వీట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ధృవ్ నటించిన రెండవ చిత్రం మహాన్ షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. అలాగే అక్టోబర్ హూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్రిటిష్ బ్యూటీ చివరిగా విక్కీ కౌశల్ సర్దార్ ఉదమ్‌లో నటించింది. ప్రస్తుతం ఆమె కవిత అండ్ థెరిసాలో నటిస్తోంది.
Dhruv vikram and banita Sandhu .... Nalla iruntha sari ....
— நான் ஒரு சங்கி (@aruntwitsss) January 1, 2022
the audacity pic.twitter.com/o2ubrtN95E
— wouldpackher (@coolhuncoolhun) January 1, 2022