Chiyaan Vikram Had 23 Surgerys at Age of 12 - Sakshi
Sakshi News home page

Chiyaan Vikram: 23 సర్జరీలు.. కుడి కాలు తీసేయాలన్న డాక్టర్స్‌.. మూడేళ్లు వీల్‌చైర్‌లో..

Published Sun, Apr 23 2023 10:16 AM | Last Updated on Sun, Apr 23 2023 11:24 AM

Chiyaan Vikram Had 23 Surgerys at Age of 12 - Sakshi

చియాన్‌ విక్రమ్‌.. కథ, కాన్సెప్టే కాదు అందుకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు తన లుక్‌ కూడా వైవిధ్యంగా ఉండేలా జాగ్రత్తపడతాడీ హీరో. అందుకే ఈ స్టార్‌ హీరోకు తమిళంలోనే కాదు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్‌ ఉంది. ప్రస్తుతం అతడు పొన్నియన్‌ సెల్వన్‌ 2 సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో విక్రమ్‌ చిన్నతనంలో ఎదుర్కొన్న కష్టానికి సంబంధించిన వార్త ఒకటి వైరల్‌గా మారింది.

విక్రమ్‌కు చిన్నప్పటినుంచే నటుడవ్వాలని కోరికగా ఉండేది. కాలేజీలో నాటకాలు వేయగా అతడికి ఉత్తమ నటుడు అవార్డు కూడా వచ్చింది. ఆ తర్వాత సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి తన సత్తా నిరూపించుకున్న సంగతి తెలిసిందే! అయితే 12 ఏళ్ల వయసులో విక్రమ్‌ తన స్నేహితుడితో కలిసి సరదాగా బైక్‌పై వెళుతుండగా ప్రమాదానికి గురయ్యాడు. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరిన విక్రమ్‌ కొంతకాలం పాటు బెడ్‌కే పరిమితమయ్యాడు. రోజులు గడుస్తున్నా గాయం నుంచి కోలుకోకపోవడంతో వైద్యులు అతడి కుడి కాలును తీసేయాలని హీరో తల్లికి సూచించారు.

కానీ విక్రమ్‌ అందుకు ఒప్పుకోలేదు. ఒక్క కుడికాలికే కాదు, అతడి శరీరంపై ఎన్నో చోట్ల గాయాలయ్యాయి. పలుచోట్ల ఎముకలు విరిగాయి. డాక్టర్లు అతడికి 23 సర్జరీలు చేశారు. అయినా విక్రమ్‌ తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. మూడేళ్లపాటు వీల్‌చైర్‌కే పరిమితమైన అతడు నెమ్మదిగా గాయం నుంచి కోలుకుని బయటపడ్డాడు. నటుడిని కావాలనుకున్న బలమైన కోరికే తనను ముందుకు నడిపించిందని ఓ సందర్భంలో గుర్తు చేసుకున్నాడు విక్రమ్‌. ఇప్పుడు సక్సెస్‌ఫుల్‌ హీరోగా ముందుకు సాగుతున్నాడు.

చదవండి: ఇండస్ట్రీకి రాకముందు సిరి ఏం చేసేదో తెలుసా?
విజయ్‌ సినిమాలో ఐటం సాంగ్‌.. స్పందించిన సిమ్రాన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement