
హీరో చియాన్ విక్రమ్.. పాత్రల్లో వైవిద్యం కోసం ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారు. ఆయన ఎంచుకునే సినిమాలే కాదు, దానికి తగ్గ లుక్స్ కోసం ప్రత్యక శ్రద్ద పెడుతుంటారు. సినిమా ఫ్లాప్ అయినా, హిట్ అయినా విక్రమ్ ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. పాత్రలకు జీవం పోయడానికి ఎంతటి రిస్క్ అయినా చేస్తాడు. సినిమాలో గెటప్ కోసమే ఎంతో సమయాన్ని కేటాయిస్తాడు.
ప్రస్తుతం ఆయన పా. రంజిత్ దర్శకత్వంలో తంగలాన్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పీరియాడికల్ ఫిల్మ్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో విక్రమ్ ఓ గిరిజన తెగ నాయకుడి పాత్రలో నటిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ పాత్ర కోసం ఆయన ప్రోస్థటిక్ మేకప్ వేసుకుంటున్నారట. దీనికి సుమారు 4గంటల సమయం కేటాయిస్తున్నారట.
ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా విక్రమ్ తన లేటేస్ట్ లుక్స్ ఫోటోలని షేర్ చేశాడు. ఇందులో విక్రమ్ రగ్గుడ్ లుక్‌లో కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఆయన షేర్ చేసిన ఈ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
Back to the future. #Thangalaan pic.twitter.com/wKUBlWZd0c
— Vikram (@chiyaan) February 17, 2023