విక్రమ్ క్రేజీ మూవీ.. డైరెక్టర్‌ లేటేస్ట్ అప్‌డేట్! | Vikram's Thangalaan Movie Crazy Update By Director | Sakshi
Sakshi News home page

Vikram: విక్రమ్ తంగలాన్‌.. రిలీజ్‌పై డైరెక్టర్‌ అప్‌డేట్‌!

Published Wed, Mar 13 2024 9:09 PM | Last Updated on Thu, Mar 14 2024 11:05 AM

VikramThangalaan Movie Crazy Update by director - Sakshi

చియాన్  విక్రమ్‌ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం తంగలాన్. ఈ సినిమాకు  పా. రంజిత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. ఇప్పటికే చాలాసార్లు ఈ సినిమా విడుదల వాయిదా పడుతూనే వస్తోంది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి డైరెక్టర్ క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన పా.రంజిత్ సినిమా విడుదలపై స్పందించారు. 

దర్శకుడు పా. రంజిత్‌ మాట్లాడుతూ.. 'తంగలాన్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. ఇప్పటికే సెన్సార్‌ సర్టిఫికెట్‌కు దరఖాస్తు చేసుకుంటున్నాం. ప్రస్తుతం ఎన్నికల తేదీల ప్రకటన కోసం ఎదురుచూస్తున్నాం. ఎన్నికలు పూర్తయిన తర్వాత సినిమా విడుదల చేస్తాం. ఈ సినిమాను సినీ ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాం' అని తెలిపారు. కాగా.. కర్ణాటకలోని కోలార్ గోల్డ్‌ ఫీల్డ్స్‌ కార్మికుల జీవితాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో చియాన్ విక్రమ్‌ డిఫెరెంట్‌ లుక్‌లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో మాళవిక మోహనన్‌, పార్వతి కీలక పాత్రలు పోషించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement