తంగలాన్‌ తర్వాత 'వీర ధీర సూరన్‌'గా విక్రమ్‌ | Veera Dheera Sooran Release On 2025 Sankranti | Sakshi
Sakshi News home page

తంగలాన్‌ తర్వాత 'వీర ధీర సూరన్‌'గా విక్రమ్‌

Oct 29 2024 6:52 AM | Updated on Oct 29 2024 6:55 AM

Veera Dheera Sooran Release On 2025 Sankranti

నటుడు చియాన్‌ విక్రమ్‌ ఇటీవల నటించిన తంగలాన్‌ చిత్రం మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. దాని తరువాత విక్రమ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం వీర ధీర సూరన్‌. తంగలాన్‌ చిత్రానికి పూర్తి భిన్నమైన కథ, కథనాలతో రూపొందుతున్న చిత్రం ఇది. హెచ్‌ఆర్‌. పిక్చర్స్‌ పతాకంపై రియాశిబు నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్‌ ఎంటర్‌టెయినర్‌ కథా చిత్రానికి ఎస్‌యూ. అరుణ్‌కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. 

కోలీవుడ్‌లో పన్నైయారుమ్‌ పద్మినియుమ్‌ , సేతుపతి, చిత్తా (చిన్నా) వంటి విజయవంతమైన చిత్రాలను అరుణ్‌కుమార్‌ తెరకెక్కించారు. నటి దుషారా విజయన్‌ నాయకిగా నటిస్తున్న ఇందులో నటుడు ఎస్‌జే.సూర్య, సురాజ్‌ వెంజరమూడు, సిద్ధిక్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. జీవీ.ప్రకాశ్‌కుమార్‌ సంగీతాన్ని, తేనీ ఈశ్వర్‌ ఛాయాగ్రహణాన్ని అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటూ చివరి దశకు చేరింది. ఇందులో విక్రమ్‌ కాళీ అనే మాస్‌ పాత్రలో నటిస్తున్నారు. చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్లర్‌ను విడుదల చేయగా చాలా మంచి రెస్పాన్స్‌ను తెచ్చుకుంది. 

ఇది రెండు భాగాలుగా తెరకెక్కనున్నట్లు సమాచారం. విశేషం ఏమిటంటే రెండో భాగాన్ని ముందు విడుదల చేయనున్నారని తెలిసింది. కాగా ఈ చిత్ర తమిళనాడు విడుదల హక్కులను ఫైవ్‌స్టార్‌ కే. సెంథిల్‌ పొందారని యూనిట్‌ వర్గాలు అధికారికంగా ప్రకటించారు. కాగా వీర ధీర సూరన్‌ చిత్రాన్ని వచ్చే ఏడాది పొంగల్‌కు రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్టు తాజా సమాచారం. దీంతో ఇక నుంచి చియాన్‌ విక్రమ్‌ హవా కొనసాగుతుందని ఆయన అభిమానులు సంబరపడుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement