Chiyaan Vikram Starrer Cobra Movie Trailer Released - Sakshi
Sakshi News home page

Cobra Movie Trailer: విక్రమ్‌ కోబ్రా ట్రైలర్‌ వచ్చేసింది.. అదిరిపోయిందంతే!

Published Fri, Aug 26 2022 8:49 AM | Last Updated on Fri, Aug 26 2022 9:44 AM

Chiyaan Vikram Starrer Cobra Movie Trailer Released - Sakshi

చియాన్‌ విక్రమ్‌ హీరోగా అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కోబ్రా. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాను సెవెన్ స్టూడియోస్ - రెడ్ జెయింట్ వారు భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ‘కేజీఎఫ్‌’ భామ శ్రీనిధి శెట్టి ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే అనేకసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్ట​కేలకు ఈనెల 31న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

ఈ సందర్భంగా మేకర్స్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు. గణిత శాస్త్రవేత్తగా విక్రమ్‌ కనిపించనున్నారు. ట్రైలర్‌ను బట్టి మొత్తం ఐదు ఢిపరెంట్‌ క్యారెక్టర్స్‌లో విక్రమ్‌ కనిపించనున్నాడని తెలుస్తుంది. ఇర్ఫాన్ పఠాన్, మియా జార్జ్ ,మృణాలిని రవి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఏఆర్ రెమమాన్‌ ఈ సినిమాను సంగీతం అందించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement