సెల్వరాజ్‌ దర్శకత్వంలో  ధృవ్‌ విక్రమ్‌ | Dhruv Vikram To Work With Mari Selvaraj Direction | Sakshi
Sakshi News home page

Dhruv Vikram: సెల్వరాజ్‌ దర్శకత్వంలో  ధృవ్‌ విక్రమ్‌

Published Thu, Oct 20 2022 9:29 AM | Last Updated on Thu, Oct 20 2022 9:30 AM

Dhruv Vikram To Work With Mari Selvaraj Direction - Sakshi

తమిళసినిమా: విక్రమ్‌ వారసుడు ధృవ్‌ విక్రమ్‌ కథానాయకుడిగా పరిచయమైన చిత్రం ఆదిత్య వర్మ. ఇది తెలుగులో విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన అర్జున్‌రెడ్డికి రీమేక్‌ అన్న విషయం తెలిసిందే. అయితే తమిళంలో ఈ త్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. అయితే నటుడిగా ధృవ్‌ విక్రమ్‌కు మంచి వర్కులు పడ్డాయి. తన తండ్రి విక్రమ్‌తో కలిసి మహాన్‌ చిత్రంలో నటించారు. ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం మంచి ప్రశంసలను అందుకుంది.

ఆ తరువాత ధృవ్‌ విక్రమ్‌ మంచి కథా చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మారి సెల్వరాజ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. పరియేరుమ్‌ పెరుమాళ్, కర్నన్‌ వంటి విజయవంతమైన చిత్రాల దర్శకుడు మారి సెల్వరాజ కర్నన్‌ చిత్రం తరువాత ధృవ్‌ విక్రమ్‌ హీరోగా కబడ్డీ క్రీడ నేపథ్యంలో చిత్రాన్ని రూపొందించనున్నట్లు ప్రకటించారు. అలాంటిది సడన్‌గా ఉదయనిధి స్టాలిన్‌ హీరోగా వమన్నన్‌ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రవలు జరుపుకుంటోంది. దీంతో ధృవ్‌ విక్రమ్‌ హీరోగా చిత్రాన్ని చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రథమార్థంలో సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement