సల్మాన్ ఖాన్ సోదరుడితో విడాకులు.. ఇప్పుడేమో మాజీ భాయ్‌ఫ్రెండ్‌తో! | Sohail Khan Ex Wife Seema Sajdeh Confirms Dating Ex Fiance Vikram Ahuja After Divorce, Deets Inside | Sakshi
Sakshi News home page

Seema Sajdeh: సల్మాన్ ఖాన్ సోదరుడికి విడాకులు.. ఇప్పుడేమో మాజీ భాయ్‌ఫ్రెండ్‌తో డేటింగ్‌!

Published Sun, Oct 20 2024 3:48 PM | Last Updated on Sun, Oct 20 2024 5:06 PM

Sohail Khan Ex Wife Seema Sajdeh confirms dating Vikram Ahuja

ప్రముఖ బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్, సల్మాన్ ఖాన్ తమ్ముడి భార్య సీమా సజ్దేహ్‌ ఓ షోలో మెరిసింది. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతున్న ఫ్యాబులస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్  సీజన్-3లో కనిపించింది. ఈ షోలో పాల్గొన్న సీమా సజ్దేహ్ తన వివాహా జీవితం గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. సోహైల్ ఖాన్‌తో పెళ్లికి ముందే ప్రముఖ రచయిత విక్రమ్ ‍అహుజాతో ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. అయితే 1998లో సల్మాన్ ఖాన్ సోదరుడు సోహైల్‌ను పెళ్లాడింది. వీరిద్దరు 2022లో విడాకులు తీసుకున్నారు.

తాజాహా నెట్‌ఫ్లిక్స్‌ షోలో కనిపించిన సీమా.. తన డేటింగ్ గురించి నోరు విప్పింది. సోహైల్‌తో డివోర్స్ తర్వాత విక్రమ్ ‍అహుజాతో డేటింగ్‌లో ఉన్నట్లు సీమా వెల్లడించింది. ప్రస్తుతం అతనితో డేటింగ్‌లో ఉన్నానని షాకింగ్ కామెంట్స్ చేసింది. తాను ముంబయిలోని వర్లీ నుంచి బాంద్రాకు మారినప్పుడు తన ఇంటికోసం సాయం చేశాడని సీమా తెలిపింది. తన గురించి  నాకంటే అతనికే ఎక్కువగా తెలుసని చెప్పింది. అతనితో మళ్లీ ప్రేమలో పడినందుకు సంతోషంగా ఉందని తెలిపింది.

కాగా.. విక్రమ్ అహుజా ఒక వ్యాపారవేత్త. మల్టీ మిలియనీర్ దేవేంద్ర అహుజా కుమారుడు. అతను సెంచూరియన్ బ్యాంక్ ప్రమోటర్‌గా పనిచేశాడు. గతంలో సీమా, విక్రమ్ 1990 నిశ్చితార్థం కూడా  చేసుకున్నారు. అయితే ఊహించని కారణాలతో వాళ్లిద్దరు విడిపోయారు. ఆ తర్వాత సీమా.. సల్మాన్ ఖాన్ సోదరుడు సోహైల్ ఖాన్‌ను వివాహం చేసుకుంది. ఈ జంటకు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. కానీ వీరిద్దరు రెండేళ్ల క్రితమే విడాకులు తీసుకున్నారు. దీంతో తాజాగా సీమా తన మాజీ బాయ్‌ఫ్రెండ్‌ విక్రమ్ అహుజాతో డేటింగ్‌ చేస్తున్నట్లు తెలిపింది. నెట్‌ఫ్లిక్స్‌ షో ఫ్యాబులస్ లైవ్స్‌ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్ షోలో ఈ విషయాన్ని వెల్లడించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement