Is Huma Qureshi Is The Reason Behind Sohail Khan And Seema Khan Divorce, Details Inside - Sakshi
Sakshi News home page

Sohail Khan Divorce News: సల్మాన్‌ తమ్ముడి కాపురంలో ఆ హీరోయిన్‌ చిచ్చు?

Published Mon, May 16 2022 1:31 PM | Last Updated on Mon, May 16 2022 2:05 PM

Is Huma Qureshi Is The Reason Behind Sohail Khan And Seema Khan Divorce - Sakshi

సినీ ఇండస్ట్రీలో ప్రేమ- విడాకులు చాలా కామన్‌ అయిపోయింది. ఎంత త్వరగా ప్రేమలో పడతారో అంతే త్వరగా విడిపోతున్నారు. తాజాగా సల్మాన్‌ ఖాన్‌ తమ్ముడు సోహైల్‌ ఖాన్‌ విడాకుల విషయం ఇప్పుడు బీటౌన్‌లో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది.  ఎంతో అన్యోన్యంగా కలిసున్న సోహైల్‌- సీమా ఖాన్‌లు 24ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలుకుతూ కోర్టు మెట్లు ఎక్కారు.

ప్రేమించి, పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్న సోహైల్‌-సీమా ఖాన్‌లు ఇప్పుడు తమ బంధానికి ముగింపు పలకడం ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.దీని వెనుక కారణం ఏంటన్నదానిపై ఇప్పుడు జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే వీరి విడాకుల వెనుక ఓ హీరోయిన్‌ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. బాలీవుడ్‌ బ్యూటీ హ్యూమా ఖురేషీతో సొహైల్ ఖాన్ కొంతకాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నాడంటూ మరోసారి వార్తలు గుప్పుమంటున్నాయి.

గతంలోనూ ఇలాంటి వార్తలు రాగా, సోహైల్‌ తనకు అన్నలాంటి వాడని చెప్పి హ్యూమా ఖురేషీ అందరి నోరూ మూయించింది. మరి ఇప్పుడు ఏకంగా ఆ జంట విడాకులు తీసుకోవడంతో మరోసారి ఈ బ్యూటీ పేరు జోరుగా వినిపిస్తుంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement