సాక్షి, ముంబై: బాలీవుడ్ నటి మలైకా అరోరా (47) తన కుమారుడు అర్హాన్ ఖాన్(19)తో క్రికెట్ ఆడుతూ సందడి చేశారు. ఇటీవల ధర్మశాల నుండి ముంబైకి తిరిగి వచ్చిన మలైకా అర్హాన్‌తో కలిసి క్రికెట్ ఆడుతూ ఎంజాయ్ చేశారు. తల్లి కొడుకులిద్దరూ తమ నివాసాన్నే క్రికెట్ పిచ్‌గా మార్చేశారు. అథ్లెటైజర్ ధరించిన మలైకా, అర్హాన్ బౌలింగ్‌లో బిగ్‌షాట్స్ కొడుతున్న ఫోటోలు ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తున్నాయి. ఫిట్‌నెస్‌తో వాహ్వా అనిపించే మలైకా, బ్యాటింగ్, బౌలింగ్ స్టిల్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
మరో ఫోటోలో బాడ్మింటన్ ఆడుతూ కనిపించడంతో సూపర్ కూల్ మమ్మీ అంటూ కమెంట్ చేస్తున్నారు. ఈ ఫోటోలలో ఆమె పెంపుడు కుక్క కాస్పర్ కూడా ఉండటం విశేషం. కాగా మొదటి భర్త ఆర్భాజ్ ఖాన్‌తో విడాకులు తీసుకున్న అనంతరం అర్జున్‌కపూర్‌తో డేటింగ్ చేస్తున్న మలైకా ఇటీవల ధర్మశాల వెళ్లింది. త్వరలో ఈ జంట పెళ్లి కూడా చేసుకోబోతోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment