‘పూరి కెరీర్‌లోనే ఉత్తమ చిత్రంలా ఉంది’ | ram gopal varma tweet on mehbooba movie teaser | Sakshi
Sakshi News home page

Feb 9 2018 4:59 PM | Updated on Feb 9 2018 5:41 PM

ram gopal varma tweet on mehbooba movie teaser - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తన కుమారుడు ఆకాశ్‌ను హీరోగా పెట్టి ప్రముఖ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ తెరకెక్కిస్తున్న ‘మెహబూబా’  సినిమా ఫస్ట్‌లుక్‌ టీజర్‌ శుక్రవారం విడుదలైంది. దీనిపై విలక్షణ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ తనదైన శైలిలో స్పందించారు. ‘వావ్‌.. మెహబూబా మూవీ పూరి జగన్నాథ్‌ కెరీర్‌లోనే ఉత్తమ చిత్రంలా ఉంది. ఈ సినిమా తీసిన విధానం చూస్తుంటే మహాకావ్యం (ఎపిక్‌ లవ్‌స్టోరీ)లా నిలిచే అవకాశముంద’ని వర్మ ట్వీట్‌ చేశారు.

1971 నాటి భారత్‌-పాకిస్తాన్‌ యుద్ధం నేపథ్యంలో ‘మెహబూబా’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆకాశ్‌ సరసన నేహాశెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమాకు సందీప్‌ చౌతా సంగీతం అందిస్తున్నాడు. వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement