
స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరెకెక్కిస్తున్న ‘మెహబూబా’ సినిమా ఫస్ట్ లుక్ టీజర్‌ను శుక్రవారం విడుదలచేశారు. పాక్-భారత్ సరిహద్దులో ఆకాశ్ సైనికాధికారిగా నేహాశెట్టి చేయి పట్టుకుని యుద్ధం చేసుకుంటూ పరిగెత్తడం అందరిని ఆకట్టుకుంటోంది. టీజర్ ‘మెహబూబా..’ అంటూ బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌తో సాగుతుంది.
1971 నాటి భారత్, పాకిస్థాన్ ల యుద్ధ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పీరియాడిక్ లవ్ స్టోరిలో పూరీ తనయుడు ఆకాష్ హీరోగా, నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నారు. సందీప్ చౌతా సంగీతం అందించారు. తమిళ సూపర్ హిట్ తుపాకీ సినిమాలో కీలక పాత్రలో నటించిన గౌతమ్ కురుప్ విలన్ గా నటించారు. సమ్మర్‌లో ఈ సినిమా విడుదల కానుంది. పూరి జగన్నాథ్ కొంత కాలంగా వరుస ఫెయిల్యూర్స్‌తో కష్టాల్లో ఉన్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment