First Look Teaser
-
విజయ్ 69 మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మేకర్స్
-
ఖురేషిగా ఎందుకు మారాడు?
ఖురేషి అబ్రమ్‌గా స్టీఫెన్ నెడుంపల్లి ఎందుకు మారాడు? ‘లూసిఫర్’ సినిమా చూసిన ప్రేక్షకులకు ఈ సందేహం కలగడం సహజం. ఈ సందేహానికి ‘లూసిఫర్ 2’లో సమాధానం దొరకనుంది. స్టీఫెన్ నెడుంపల్లి అలియాస్ ఖురేషి అబ్రమ్‌గా మోహన్‌లాల్ హీరోగా రూపొందిన బ్లాక్ బస్టర్ మూవీ ‘లూసిఫర్’ (2019). హీరో, డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఈ కాంబినేషన్లోనే ‘లూసిఫర్’కి సీక్వెల్‌గా ‘ఎల్2 ఎంపురాన్’ రూపొందుతోంది.ఈ చిత్రాన్ని లైకా ప్రోడక్షన్స్ సుభాస్కరన్, ఆశీర్వాద్ సినిమాస్ ఆంటోని పెరుంబవూర్ నిర్మిస్తున్నారు. మంగళవారం (మే 21) మోహన్‌లాల్ బర్త్ డే సందర్భంగా ‘ఎల్ 2 ఎంపురాన్’లో ఖురేషి అబ్రమ్‌గా మోహన్‌లాల్ లుక్‌ను విడుదల చేశారు. స్టీఫెన్ నెడుంపల్లి అసలు ఖురేషి అబ్రమ్‌గా ఎలా మారాడు? అనే విషయాన్ని ఈ సినిమాలో చూపించనున్నారు. 2025లో మలయాళం, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. -
ఫస్ట్ లవ్ సత్య.. క్రిష్ణలో సగభాగం రాధ
‘క్షణం’ సినిమాతో టాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు రవికాంత్ పేరపు ప్రస్తుతం ‘క్రిష్ణ అండ్ హీస్ లీల’ అనే ఓ యూత్‌ఫుల్ సబ్జెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, వయకామ్ 18, సంజయ్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ‘గుంటూరు టాకీస్’ ఫేం సిద్దూ జొన్నలగడ్డ హీరోగా నటిస్తుండగా.. శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్, షాలినీ వందికట్టి హీరోయిన్లు. ఈ క్రమంలో హీరో రానా దగ్గుబాటి తన ఇన్స్టాగ్రామ్ వేదికగా చిత్రం ఫస్ట్ లుక్ టీజర్‌ను విడుదల చేశారు. View this post on Instagram Krishna’s #FirstLove, Satya!! #KrishnaAndHisLeela @ranadaggubati |@siddu_boy | @raviperepu | @shraddhasrinath | @shalinivadnikatti | @iamseeratkapoor| @sureshproductions| @viacom18 |#KrishnaAndHisLeela | #basedontruerumours A post shared by Rana Daggubati (@ranadaggubati) on Jun 22, 2020 at 4:33am PDT చిత్రంలో ప్రధాన పాత్రలైన రాధ, సత్యలను పరిచయం చేశారు. ‘క్రిష్ణ ఫస్ట్ లవ్ సత్య’.. ‘రాధ ది అదర్ హఫ్ ఆఫ్ ద క్రిష్ణ’ క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ టీజర్ చిత్రంపై ఆసక్తిని పెంచుతుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదల చేయనున్నట్లు సమాచారం. ముందుగా ఈ చిత్రాన్ని థియేటర్లలోనే విడుదల చేద్దాం అనుకున్నప్పటికి.. ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాకపోవడంతో ఓటీటీలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించనున్నారు. (‘హిరణ్యకశ్యప’ లేటెస్ట్ అప్డేట్) View this post on Instagram Radha the other half of Krishna! #HalfOfKrishna #KrishnaAndHisLeela @ranadaggubati |@siddu_boy | @raviperepu | @shraddhasrinath | @shalinivadnikatti | @iamseeratkapoor| @sureshproductions| @viacom18 |#KrishnaAndHisLeela | #basedontruerumours A post shared by Rana Daggubati (@ranadaggubati) on Jun 23, 2020 at 3:52am PDT -
పరిచయం మంచి విజయం సాధించాలి: నాని
విరాట్ కొండూరి, సిమ్రత్ కౌర్ జంటగా అసిన్ మూవీ క్రియేషన్స్‌పై ‘హైద్రాబాద్ నవాబ్స్’ ఫేమ్ లక్ష్మీకాంత్ చెన్నా దర్శకత్వంలో రియాజ్ నిర్మించిన చిత్రం ‘పరిచయం’. ఈ సినిమా ఫస్ట్‌లుక్ అండ్ టీజర్‌ను హీరో నాని రిలీజ్ చేశారు. నాని మాట్లాడుతూ–‘‘ టీజర్ చూస్తుంటే మణిరత్నంగారి ‘గీతాంజలి’ మూవీ గుర్తొస్తుంది. మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా ఉంది. కథకు హీరోహీరోయిన్లు బాగా సూట్ అయ్యారు. ఈ చిత్రం ద్వారా నా మిత్రుడు లక్ష్మీకాంత్ చెన్నకి, చిత్ర నిర్మాత రియాజ్ గారికి మంచి సక్సెస్ రావాలి.’’ అన్నారు. ‘‘నానీగారు మా టీజర్‌ను ‘గీతాంజలి’ లాంటి మంచి మూవీతో పోల్చడం ఆనందంగా ఉంది. మా చిత్రాన్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన నానీకి థ్యాంక్స్. లవ్ అండ్ ఎంటర్టైన్మెంట్తో పాటుగా స్ట్రాంగ్ ఎమోషనల్‌గా ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు లక్ష్మీకాంత్. ‘‘షూటింగ్ కంప్లీటైంది. ఏప్రిల్ మొదటి వారంలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు రియాజ్. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు: శేఖర్ చంద్ర, కెమెరా:నరేష్ రానా. -
‘పూరి కెరీర్లోనే ఉత్తమ చిత్రంలా ఉంది’
సాక్షి, హైదరాబాద్: తన కుమారుడు ఆకాశ్‌ను హీరోగా పెట్టి ప్రముఖ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ‘మెహబూబా’ సినిమా ఫస్ట్‌లుక్ టీజర్ శుక్రవారం విడుదలైంది. దీనిపై విలక్షణ దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. ‘వావ్.. మెహబూబా మూవీ పూరి జగన్నాథ్ కెరీర్లోనే ఉత్తమ చిత్రంలా ఉంది. ఈ సినిమా తీసిన విధానం చూస్తుంటే మహాకావ్యం (ఎపిక్ లవ్‌స్టోరీ)లా నిలిచే అవకాశముంద’ని వర్మ ట్వీట్ చేశారు. 1971 నాటి భారత్-పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో ‘మెహబూబా’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆకాశ్ సరసన నేహాశెట్టి హీరోయిన్గా నటిస్తోంది. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమాకు సందీప్ చౌతా సంగీతం అందిస్తున్నాడు. వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. -
‘మెహబూబా’ ఫస్ట్ లుక్ టీజర్ విడుదల
-
పూరీ ‘మెహబూబా’ ఫస్ట్ లుక్ టీజర్ విడుదల
స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరెకెక్కిస్తున్న ‘మెహబూబా’ సినిమా ఫస్ట్ లుక్ టీజర్‌ను శుక్రవారం విడుదలచేశారు. పాక్-భారత్ సరిహద్దులో ఆకాశ్ సైనికాధికారిగా నేహాశెట్టి చేయి పట్టుకుని యుద్ధం చేసుకుంటూ పరిగెత్తడం అందరిని ఆకట్టుకుంటోంది. టీజర్ ‘మెహబూబా..’ అంటూ బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌తో సాగుతుంది. 1971 నాటి భారత్, పాకిస్థాన్ ల యుద్ధ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పీరియాడిక్ లవ్ స్టోరిలో పూరీ తనయుడు ఆకాష్ హీరోగా, నేహా శెట్టి హీరోయిన్గా నటిస్తున్నారు. సందీప్ చౌతా సంగీతం అందించారు. తమిళ సూపర్ హిట్ తుపాకీ సినిమాలో కీలక పాత్రలో నటించిన గౌతమ్ కురుప్ విలన్ గా నటించారు. సమ్మర్లో ఈ సినిమా విడుదల కానుంది. పూరి జగన్నాథ్ కొంత కాలంగా వరుస ఫెయిల్యూర్స్‌తో కష్టాల్లో ఉన్న సంగతి తెలిసిందే. -
రిచ్ & రొమాంటిక్ 'మిస్టర్'
-
రిచ్ & రొమాంటిక్ 'మిస్టర్'
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ మిస్టర్. స్టార్ డైరెక్టర్ శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్‌ను న్యూ ఇయర్ కానుకగా రిలీజ్ చేశారు. వరుణ్ సరసన లావణ్య త్రిపాఠి, హేబా పటేల్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను లక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నల్లమలుపు శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. చాలా కాలం క్రితమే ఈ సినిమా ప్రారంభమైనా.. షూటింగ్ సమయంలో వరుణ్ తేజ్ గాయపడటంతో ఆలస్యమైంది. త్వరలోనే ఆడియో మూవీ రిలీజ్ డేట్స్‌ను ఎనౌన్స్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. Here it is #MisterTeaser https://t.co/liskboBMz7#HappyNewYear guys -
టీజర్ కోసం మహేష్, మురుగ ప్లాన్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్వకత్వంలో నటిస్తున్నాడు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా యూనిట్ ప్రస్తుతం బ్రేక్ తీసుకుంది. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన బాలీవుడ్ మూవీ అకీరా రిలీజ్ సందర్భంగా దర్శకుడు ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీ కావటంలో మహేష్ మూవీకి బ్రేక్ వచ్చింది. అయితే త్వరలో షూటింగ్‌ను తిరిగి ప్రారంభించనున్న దర్శకుడు టీజర్ కోసం ప్రత్యేకంగా ఒక రోజు షూటింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. తన సినిమాలకు ఫస్ట్ లుక్ టీజర్‌తోనే భారీ హైప్ క్రియేట్ చేసే మురుగదాస్ మహేష్ సినిమా విషయంలో కూడా అదే ఫార్ములాను ఫాలో అవుతున్నాడు. 50 సెకండ్ల టీజర్‌తో మహేష్ అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. -
నారా రోహిత్ 'తుంటరి' ఫస్ట్‌లుక్ టీజర్