
టీజర్ కోసం మహేష్, మురుగ ప్లాన్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్వకత్వంలో నటిస్తున్నాడు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా యూనిట్ ప్రస్తుతం బ్రేక్ తీసుకుంది. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన బాలీవుడ్ మూవీ అకీరా రిలీజ్ సందర్భంగా దర్శకుడు ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీ కావటంలో మహేష్ మూవీకి బ్రేక్ వచ్చింది.
అయితే త్వరలో షూటింగ్ను తిరిగి ప్రారంభించనున్న దర్శకుడు టీజర్ కోసం ప్రత్యేకంగా ఒక రోజు షూటింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. తన సినిమాలకు ఫస్ట్ లుక్ టీజర్తోనే భారీ హైప్ క్రియేట్ చేసే మురుగదాస్ మహేష్ సినిమా విషయంలో కూడా అదే ఫార్ములాను ఫాలో అవుతున్నాడు. 50 సెకండ్ల టీజర్తో మహేష్ అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు.