
‘పరిచయం’ సినిమా యూనిట్ సభ్యులతో నాని....
విరాట్ కొండూరి, సిమ్రత్ కౌర్ జంటగా అసిన్ మూవీ క్రియేషన్స్‌పై ‘హైద్రాబాద్ నవాబ్స్’ ఫేమ్ లక్ష్మీకాంత్ చెన్నా దర్శకత్వంలో రియాజ్ నిర్మించిన చిత్రం ‘పరిచయం’. ఈ సినిమా ఫస్ట్‌లుక్ అండ్ టీజర్‌ను హీరో నాని రిలీజ్ చేశారు. నాని మాట్లాడుతూ–‘‘ టీజర్ చూస్తుంటే మణిరత్నంగారి ‘గీతాంజలి’ మూవీ గుర్తొస్తుంది. మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా ఉంది. కథకు హీరోహీరోయిన్లు బాగా సూట్ అయ్యారు. ఈ చిత్రం ద్వారా నా మిత్రుడు లక్ష్మీకాంత్ చెన్నకి, చిత్ర నిర్మాత రియాజ్ గారికి మంచి సక్సెస్ రావాలి.’’ అన్నారు.
‘‘నానీగారు మా టీజర్‌ను ‘గీతాంజలి’ లాంటి మంచి మూవీతో పోల్చడం ఆనందంగా ఉంది. మా చిత్రాన్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన నానీకి థ్యాంక్స్. లవ్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటుగా స్ట్రాంగ్ ఎమోషనల్‌గా ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు లక్ష్మీకాంత్. ‘‘షూటింగ్ కంప్లీటైంది. ఏప్రిల్ మొదటి వారంలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు రియాజ్. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు: శేఖర్ చంద్ర, కెమెరా:నరేష్ రానా.
Comments
Please login to add a commentAdd a comment