ఫస్ట్‌ లవ్‌ సత్య.. క్రిష్ణలో సగభాగం రాధ | Rana Daggubati Krishna And His Leela in First Look Teaser | Sakshi
Sakshi News home page

‘క్రిష్ణ అండ్‌ హీస్‌ లీల’ ఫస్ట్‌లుక్‌ టీజర్

Published Wed, Jun 24 2020 8:22 AM | Last Updated on Wed, Jun 24 2020 9:28 AM

Rana Daggubati Krishna And His Leela in First Look Teaser - Sakshi

‘క్షణం’ సినిమాతో టాలీవుడ్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన దర్శకుడు రవికాంత్‌ పేరపు  ప్రస్తుతం ‘క్రిష్ణ అండ్‌ హీస్‌ లీల’ అనే ఓ యూత్‌ఫుల్‌ సబ్జెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌, వయకామ్‌ 18, సంజయ్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ‘గుంటూరు టాకీస్’‌ ఫేం సిద్దూ జొన్నలగడ్డ హీరోగా నటిస్తుండగా.. శ్రద్ధా శ్రీనాథ్‌, సీరత్‌ కపూర్‌, షాలినీ వందికట్టి హీరోయిన్లు. ఈ క్రమంలో హీరో రానా దగ్గుబాటి తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా చిత్రం ఫస్ట్‌ లుక్‌ టీజర్‌ను విడుదల చేశారు.
 

చిత్రంలో ప‍్రధాన పాత్రలైన రాధ, సత్యలను పరిచయం చేశారు. ‘క్రిష్ణ ఫస్ట్‌ లవ్‌ సత్య’.. ‘రాధ ది అదర్‌ హఫ్‌ ఆఫ్‌ ద క్రిష్ణ’ క్యాప్షన్‌తో షేర్‌ చేసిన ఈ టీజర్‌ చిత్రంపై ఆసక్తిని పెంచుతుంది. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదల చేయనున్నట్లు సమాచారం. ముందుగా ఈ చిత్రాన్ని థియేటర్లలోనే విడుదల చేద్దాం అనుకున్నప్పటికి.. ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాకపోవడంతో ఓటీటీలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించనున్నారు. (‘హిరణ్యకశ్యప’ లేటెస్ట్‌ అప్‌డేట్‌)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement