సాక్షి, హైదరాబాద్: నెట్‌ఫ్లీక్స్ బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రం ‘కృష్ణ అండ్ హీజ్ లీలా’ ‘రన్ రాజా రన్’ భామ సీరత్ కపూర్(రుక్సర్) పాత్రలో కనిపించారు. మొదట ఈ పాత్రపై విమర్శలు ఎదుర్కొన్న సీరత్ సినిమా విడుదల అనతంతరం విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. అయితే రుక్సర్ పాత్రకు సీరత్ సరైనదని మొదటగా నమ్మిన వ్యక్తి హీరో రానా దగ్గుబాటి అంటూ దర్శకుడు రవీకాంత్ పేరేపు వెల్లడించాడు. రుక్సర్‌గా పాత్రకు ఆమె బాగా సరిపోతుందని రానా సినిమా ప్రారంభంలోనిఏ తన అభిప్రాయం వ్యక్తం చేసినట్లు దర్శకుడు సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. (చదవండి: ఫస్ట్ లవ్ సత్య.. క్రిష్ణలో సగభాగం రాధ)
ఈసందర్భంగా ఆడిషన్స్ టైం సీరత్‌ను గుర్తు చేసుకున్నాడు. ‘సీరత్ కపూర్ రుక్సర్ కోసం బాగా సరిపోతుందని నమ్మే వ్యక్తి రానా దగ్గుబాటి. సీరత్ ఆడిషన్స్ అప్పుడు నాకు బాగా గుర్తుంది. తనని తాను స్టైలీష్‌గా మార్చుకున్నారు. ఆడిషన్ ఇచ్చేటప్పుడు పూర్తిగా తన బాడీ లాంగ్వేజ్‌ను మార్చేసి అచ్చంగా రుక్సర్ పాత్రలో ఒదిగిపోయారు. ఇక ఆడిషన్స్‌లో తను కాళీ వేల్లపై నడవడం చూసి మేమంతా ఆశ్చర్యపోయాం. తెరపై నటిస్తుందా అన్నంతగా సీరత్ ఆడిషన్స్ ఇచ్చారు. దీంతో రుక్సర్ పాత్రకు సీరత్ తప్పా మరెవరూ న్యాయం చేయలేరని భావించి తననే ఖారారు చేశాను అంటూ దర్శకుడు రవీకాంత్ చెప్పుకొచ్చాడు. ఇటీవల సీరత్ నటించిన మరో చిత్రం ‘మా వింతా గాధ వినుమా’ కూడా త్వరలో విడుదల కానుంది. ‘కృష్ణ అండ్ హీజ్ లీలా’ చిత్రాన్ని సురేష్ ప్రోడక‌్షన్, వయాకామ్ 18 మోషన్ ప్రోడక్షన్‌లో రానా దగ్గుబాటి, సంజయ్ రెడ్డిలు నిర్మించారు. (చదవండి: రానా-మిహికా ప్రీ వెడ్డింగ్ సందడి షురూ!)
Comments
Please login to add a commentAdd a comment