Ravikant perepu
-
సినిమా చూసి నాన్న ఎమోషన్ అయ్యారు
‘‘నటన పరంగా అమ్మానాన్న (సుమ, రాజీవ్ కనకాల) సలహాలు తీసుకుంటాను. ‘బబుల్గమ్’ మూవీని వారు చూశారు.. బాగా నచ్చింది. ఆ టైమ్‌లో నేను అక్కడ లేను. కొన్ని సన్నివేశాలు చూస్తున్నప్పుడు నాన్న ఎమోషన్ అయి, ఏడ్చారని అమ్మ చెప్పింది. నాన్నని అడిగితే ‘బాగా చేశావ్’ అన్నారు. ఆయన్నుంచి ప్రశంస రావడం ఆనందంగా అనిపించింది’’ అని రోషన్ కనకాల అన్నారు. రవికాంత్ పేరేపు దర్శకత్వంలో రోషన్ కనకాల, మానసా చౌదరి జంటగా నటించిన చిత్రం ‘బబుల్గమ్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది.ఈ సందర్భంగా రోషన్ కనకాల మాట్లాడుతూ– ‘‘నా బాల్యం అంతా దాదాపుగా తాతగారి (దేవదాస్ కనకాల) నటనా శిక్షణ కేంద్రంలో గడిచింది. నాకు చిన్నప్పటి నుంచి నటనంటే ఇష్టం. అది తెలియని ఒక థ్రిల్ ఇస్తుంది. నటుడు కావాలనే నా కల ‘బబుల్గమ్’తో నెరవేరడం ఆనందంగా ఉంది. న్యూ ఏజ్ కంటెంట్‌తో వస్తున్న ఈ సినిమా అలరిస్తుందనే నమ్మకం ఉంది. సినిమా షూటింగ్‌కి వెళ్లే నెల రోజుల ముందే వర్క్ షాప్ నిర్వహించడం మాకు ప్లస్ అయింది. ఈ మూవీలో ఓ సీన్ కోసం దాదాపు మూడు గంటలు పాటు షర్టు లేకుండా తిరిగాను. మొదట్లో సిగ్గుపడ్డా... ఆ తర్వాత పోయింది (నవ్వుతూ). మా అమ్మానాన్నలకు పరిశ్రమలో చాలా మంచి పేరుంది. నేను హీరోగా వస్తుండటం బాధ్యతగా అనిపిస్తోంది. ఫలానా జోనర్ మూవీ చేయాలనే ఆలోచన నాకు లేదు. ప్రేక్షకులను అలరించే మంచి సినిమాలు చేయడం ఇష్టం’’ అన్నారు. -
ఇక స్పీడ్‌గా సినిమాలు చేస్తాను
రోషన్ కనకాల, మానసా చౌదరి జంటగా రవికాంత్ పేరేపు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బబుల్గమ్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శనివారం విలేకర్ల సమావేశంలో రవికాంత్ పేరేపు చెప్పిన విశేషాలు. ∙ప్రేమకథ ప్రధానంగా సాగే రిలేషన్షిప్ డ్రామా ‘బబుల్గమ్’. ఈ చిత్రంలో ఆది పాత్రలో రోషన్, జాన్వీ పాత్రలో తెలుగు అమ్మాయి మానస నటించారు. కొత్తవారితో చేయాల్సిన సినిమా ఇది. రోషన్ హీరోగా పరిచయమవుతున్నాడని తెలిసి, ఈ కథ చె΄్పాను. కాలేజీ చదువు పూర్తి చేసుకున్న తర్వాత యువకుల కెరీర్లో కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. మనకు ఇష్టమైనది చేయాలా? సంపాదన కోసం ఏ ఉద్యోగమైనా చేయాలా? అనే అయోమయంలో ఉంటారు. అలాంటి ఓ కన్ఫ్యూజన్లో ఉన్న ఓ కుర్రాడు ప్రేమలో పడితే ఏం జరుగుతుంది? అన్నదే ఈ సినిమా కథాంశం. రోషన్‌కు ఇది తొలి సినిమా అయినా అతని తల్లిదండ్రులు సుమ, రాజీవ్ కనకాల ఈ సినిమాలో జోక్యం చేసుకోలేదు. ‘ప్రేమ బబుల్గమ్ లాంటిది. మొదట్లో తీయగా ఉంటుంది. ఆ తర్వాత చప్పగా ఉంటుంది. ఆ నెక్ట్స్ అతుక్కుంటే వదలదు’ అనే డైలాగ్ ఉంటుంది. కథానుసారం ఈ సినిమాకు ‘బబుల్గమ్’ టైటిల్ పెట్టాం. ఇక నా ‘క్షణం’, ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ ఇప్పుడు ‘బబుల్గమ్’ సినిమాలకు శ్రీ చరణ్ సంగీతం ఇచ్చాడు. మేమిద్దరం ఒకే ఊరివాళ్లం కాబట్టి కంఫర్ట్ కుదిరింది. ‘బబుల్గమ్’ ట్రైలర్‌ను చిరంజీవిగారికి చూపించాం. ఈ సినిమాలోని ‘ఇజ్జత్..’ సాంగ్ ఆయనకు బాగా నచ్చింది. ‘క్షణం’ మంచి విజయం సాధించింది. ఎందుకో కానీ ఆ సినిమా సక్సెస్ క్రెడిట్ నాకు అంతగా రాలేదు. దర్శకత్వంలో అడివి శేష్ ఇన్వాల్వ్మెంట్ ఉందనే ప్రచారం జరిగింది. నిజానికి ‘అడివి’ శేష్, శ్రీచరణ్ పాకాల ‘క్షణం’ క్రెడిట్ నాకే ఇస్తారు. ఓ అవుట్‌సైడర్‌గా ఇండస్ట్రీ పరిస్థితులను పూర్తిగా అర్థం చేసుకోవడానికి నాకు కొంత టైమ్ పట్టింది. ఇకపై దర్శకుడిగా స్పీడ్‌గా సినిమాలు చేస్తాను. -
సీరత్‌ను మొదట నమ్మిన వ్యక్తి రానా : దర్శకుడు
సాక్షి, హైదరాబాద్: నెట్ఫ్లీక్స్ బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రం ‘కృష్ణ అండ్ హీజ్ లీలా’ ‘రన్ రాజా రన్’ భామ సీరత్ కపూర్(రుక్సర్) పాత్రలో కనిపించారు. మొదట ఈ పాత్రపై విమర్శలు ఎదుర్కొన్న సీరత్ సినిమా విడుదల అనతంతరం విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. అయితే రుక్సర్ పాత్రకు సీరత్ సరైనదని మొదటగా నమ్మిన వ్యక్తి హీరో రానా దగ్గుబాటి అంటూ దర్శకుడు రవీకాంత్ పేరేపు వెల్లడించాడు. రుక్సర్గా పాత్రకు ఆమె బాగా సరిపోతుందని రానా సినిమా ప్రారంభంలోనిఏ తన అభిప్రాయం వ్యక్తం చేసినట్లు దర్శకుడు సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. (చదవండి: ఫస్ట్ లవ్ సత్య.. క్రిష్ణలో సగభాగం రాధ) ఈసందర్భంగా ఆడిషన్స్ టైం సీరత్‌ను గుర్తు చేసుకున్నాడు. ‘సీరత్ కపూర్ రుక్సర్ కోసం బాగా సరిపోతుందని నమ్మే వ్యక్తి రానా దగ్గుబాటి. సీరత్ ఆడిషన్స్ అప్పుడు నాకు బాగా గుర్తుంది. తనని తాను స్టైలీష్‌గా మార్చుకున్నారు. ఆడిషన్ ఇచ్చేటప్పుడు పూర్తిగా తన బాడీ లాంగ్వేజ్‌ను మార్చేసి అచ్చంగా రుక్సర్ పాత్రలో ఒదిగిపోయారు. ఇక ఆడిషన్స్‌లో తను కాళీ వేల్లపై నడవడం చూసి మేమంతా ఆశ్చర్యపోయాం. తెరపై నటిస్తుందా అన్నంతగా సీరత్ ఆడిషన్స్ ఇచ్చారు. దీంతో రుక్సర్ పాత్రకు సీరత్ తప్పా మరెవరూ న్యాయం చేయలేరని భావించి తననే ఖారారు చేశాను అంటూ దర్శకుడు రవీకాంత్ చెప్పుకొచ్చాడు. ఇటీవల సీరత్ నటించిన మరో చిత్రం ‘మా వింతా గాధ వినుమా’ కూడా త్వరలో విడుదల కానుంది. ‘కృష్ణ అండ్ హీజ్ లీలా’ చిత్రాన్ని సురేష్ ప్రోడక్షన్, వయాకామ్ 18 మోషన్ ప్రోడక్షన్లో రానా దగ్గుబాటి, సంజయ్ రెడ్డిలు నిర్మించారు. (చదవండి: రానా-మిహికా ప్రీ వెడ్డింగ్ సందడి షురూ!) -
క్షణంలో మారిపోతాయ్!
‘‘దర్శకుడవ్వాలనేది నా కల. మణిరత్నంగారి ‘సఖి’ చిత్రం చూసి, నేను కూడా సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాను’’ అని దర్శకుడు రవికాంత్ పేరెపు తెలిపారు. అడివి శేష్, అదాశర్మ, అనసూయా భరద్వాజ ప్రధాన పాత్రల్లో పరమ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె నిర్మించిన ‘క్షణం’ చిత్రం ద్వారా రవికాంత్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ నెల 26న చిత్రం విడుదలవుతోంది. ఈ సందర్భంగా రవికాంత్ మాట్లాడుతూ - ‘‘నటుడు అడివి శేష్, దర్శకుడు సాయికిరణ్ అడివి నాకు ఫేస్బుక్ ఫ్రెండ్స్. అడివి శేష్‌కు జరిగిన ఓ ఇన్సిడెంట్ ఆధారంగా ‘క్షణం’ కథ డెవలప్ చేశాం. కిడ్నాప్ చుట్టూ తిరిగే ఓ సస్పెన్స్ డ్రామా ఇది. మంచి సస్పెన్స్ థ్రిల్లర్. ఒక్క క్షణంలో జీవితాలు మారిపోతుంటాయ్. నెక్ట్స్ సెకండ్లో ఏం జరుగుతుందో చెప్ప లేం. అదే కాన్సెప్ట్ తీసుకుని ‘క్షణం’ టైటిల్ పెట్టాం’’ అన్నారు. సెట్ అవుతానా అనిపించింది! అనసూయ మాట్లాడుతూ- ‘‘ ‘సోగ్గాడే చిన్ని నాయనా’లో నాది చిన్న పాత్ర. ‘క్షణం’లో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్. అడివి శేష్ ఈ కథ చెప్పినప్పుడు శ్వేత క్యారెక్టర్ కోసం అనుకున్నా కానీ, జయా భరద్వాజ్ అనే పోలీస్ క్యారెక్టర్ కోసం అడిగారు. ఈ పాత్రకి సెట్ట వుతానా? అనిపించింది. షూట్ టైమ్‌కి నమ్మకమొచ్చిం’’దన్నారు. ‘క్షణం’ తనకు పేరు తెస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.