క్షణంలో మారిపోతాయ్! | Ravikanth Perepu nwe movie Kshanam | Sakshi
Sakshi News home page

క్షణంలో మారిపోతాయ్!

Feb 20 2016 10:37 PM | Updated on Sep 3 2017 6:03 PM

క్షణంలో మారిపోతాయ్!

క్షణంలో మారిపోతాయ్!

దర్శకుడవ్వాలనేది నా కల. మణిరత్నంగారి ‘సఖి’ చిత్రం చూసి, నేను కూడా సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాను’’

 ‘‘దర్శకుడవ్వాలనేది నా కల. మణిరత్నంగారి ‘సఖి’ చిత్రం చూసి, నేను కూడా సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాను’’ అని దర్శకుడు రవికాంత్ పేరెపు తెలిపారు. అడివి శేష్, అదాశర్మ, అనసూయా భరద్వాజ ప్రధాన పాత్రల్లో పరమ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె నిర్మించిన ‘క్షణం’ చిత్రం ద్వారా రవికాంత్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
 
 ఈ నెల 26న చిత్రం విడుదలవుతోంది. ఈ సందర్భంగా రవికాంత్ మాట్లాడుతూ - ‘‘నటుడు అడివి శేష్, దర్శకుడు సాయికిరణ్ అడివి నాకు ఫేస్‌బుక్ ఫ్రెండ్స్. అడివి శేష్‌కు జరిగిన ఓ ఇన్సిడెంట్ ఆధారంగా ‘క్షణం’ కథ డెవలప్ చేశాం. కిడ్నాప్ చుట్టూ తిరిగే ఓ సస్పెన్స్ డ్రామా ఇది. మంచి సస్పెన్స్ థ్రిల్లర్. ఒక్క క్షణంలో జీవితాలు మారిపోతుంటాయ్. నెక్ట్స్ సెకండ్‌లో ఏం జరుగుతుందో చెప్ప లేం. అదే కాన్సెప్ట్ తీసుకుని ‘క్షణం’ టైటిల్ పెట్టాం’’ అన్నారు.
 
 సెట్ అవుతానా అనిపించింది!
 అనసూయ మాట్లాడుతూ- ‘‘ ‘సోగ్గాడే చిన్ని నాయనా’లో నాది చిన్న పాత్ర. ‘క్షణం’లో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్. అడివి శేష్ ఈ కథ చెప్పినప్పుడు శ్వేత క్యారెక్టర్ కోసం అనుకున్నా కానీ, జయా భరద్వాజ్ అనే పోలీస్ క్యారెక్టర్ కోసం అడిగారు. ఈ పాత్రకి సెట్ట వుతానా? అనిపించింది. షూట్ టైమ్‌కి నమ్మకమొచ్చిం’’దన్నారు. ‘క్షణం’ తనకు పేరు తెస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement