తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించిన ఓ హీరోయిన్ ఇప్పుడు రోడ్డు మీద కూరగాయలు అమ్ముతున్నారు. రోడ్డు పక్కన బాగా మాసి, చినిగిన చీరకట్టుకొని నిద్రలేమితో, అలసిపోయినట్టుగా కనిపిస్తూ అభిమానులకు షాక్ ఇచ్చారు. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఈ హీరోయిన్ మరెవరో కాదు.. తెలుగు తెరకు హర్ట్ ఎటాక్ సినిమాతో పరిచయం అయిన అదా శర్మయే ఈ కూరగాయలమ్మే అమ్మాయి.
హర్ట్ ఎటాక్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయిన అందాల భామ అదా శర్మ. తెలుగులో సన్నాఫ్ సత్యమూర్తి, గరమ్ లాంటి సినిమాల్లో కనిపించిన అదా.. హీరోయిన్‌గా స్టార్ ఇమేజ్‌ను మాత్రం అందుకోలేకపోయారు. అడవి శేష్ హీరోగా తెరకెక్కిన క్షణం సినిమా సక్సెస్ తో పాటు అదా శర్మకు నటిగా మంచి గుర్తింపు తీసుకువచ్చింది.
తరువాత టాలీవుడ్‌కు గుడ్ బై చెప్పేసి బాలీవుడ్ బాట పట్టారు. ఇటీవల ఎక్కువగా ఫొటోషూట్స్‌తోనే కాలం గడిపేస్తున్న ఈ బ్యూటీ త‍్వరలో ఓ హాలీవుడ్ సినిమాలో నటించనున్నారు. ఆ సినిమా కోసమే అదా ఈ డీగ్లామర్ లుక్‌లో ఫొటో షూట్ చేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అదా కూరగాయలమ్ముతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment