
బాలీవుడ్ బ్యూటీ అదా శర్మ తొలిసారి కెమెరా ముందు నటించిన చిత్రం 1920. ఈ హారర్ చిత్రంతోనే ఆమె హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ మూవీ చిత్రీకరణ సమయంలో చాలామంది తనను చూసి విదేశీ నటి అనుకున్నారట! తాజాగా ఈ విషయాన్ని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. '1920 సినిమా షూటింగ్ ఎక్కువ భాగం లండన్‌లోనే జరిగింది.
విదేశీ అమ్మాయి అనుకున్నారు
అక్కడ ఎండ అనేదే లేదు. దానికి తోడు విపరీతమైన చలి. అప్పుడు నేను బ్లూ లెన్స్ పెట్టుకున్నాను. నన్నలా చూసి చాలామంది నేను విదేశీ అమ్మాయి అనుకున్నారు. నాకసలు హిందీయే రాదని అభిప్రాయపడ్డారు. చాలాకాలం అదే భ్రమలో ఉండిపోయారు. కానీ నేను భారతీయురాలినే, నాకు హిందీ వచ్చు అని ఏనాడూ క్లారిటీ ఇవ్వాలనిపించలేదు.
సోషల్ మీడియాా తెలీదు
పైగా అప్పట్లో సోషల్ మీడియా అంటేనే అంతగా తెలియదు. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా లేను' అని చెప్పుకొచ్చింది. ఇకపోతే అదా నటించిన రీటా సాన్యల్ వెబ్ సిరీస్ హాట్‌స్టార్‌లో అక్టోబర్ 14 నుంచి ప్రసారం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment