వేశ్య అని తిడుతున్నారు: హీరోయిన్‌ | Adah Sharma Reveals About Trolls Which She Faced After Doing This Controversial Movies, Deets Inside - Sakshi
Sakshi News home page

Adah Sharma: ఆ సినిమాలు చేశానని వేశ్య అని ట్రోల్‌ చేస్తున్నారు

Published Sat, Mar 23 2024 5:27 PM | Last Updated on Sat, Mar 23 2024 7:15 PM

Adah Sharma Reveals About Trolls Which She Faced After Doing This Controversial Movies - Sakshi

ఏది పడితే అది కామెంట్స్‌ చేసే హక్కు మీకు ఉన్నట్లే నచ్చిన సినిమాలు తీసే హక్కు మాకూ ఉంది. కొందరైతే నేను ఏ పోస్ట్‌ పెట్టినా తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. వేశ్య అని కా

హారర్‌ సినిమాతో తన కెరీర్‌ మొదలుపెట్టింది అదా శర్మ. హార్ట్‌ ఎటాక్‌ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. సన్నాఫ్‌ సత్యమూర్తి, సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌, క్షణం, కల్కి సినిమాల్లో తళుక్కుమని మెరిసింది. కానీ ఇక్కడ స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌ అందుకోలేకపోయింది. ప్రస్తుతం హిందీలో వరుస సినిమాలు చేస్తోంది. ద కేరళ స్టోరీ, బస్తర్‌: ద నక్సల్‌ స్టోరీ వంటి వైవిధ్య చిత్రాల్లో నటించి సెన్సేషనల్‌ నటిగా మారింది. వివాదాస్పద సినిమాల్లో నటించిన అదాను చాలామంది తిట్టిపోస్తున్నారు.

అందులో ఏం లేదు
తాజాగా ఆమె ఈ సినిమాల గురించి, ట్రోలింగ్‌ గురించి పెదవి విప్పింది. అదా శర్మ మాట్లాడుతూ.. 'బస్తర్‌ మూవీ డైరెక్టర్‌ నన్నొక సున్నితమైన అమ్మాయిగా భావించొద్దన్నాడు. అడవుల్లో తిరిగే మనిషిగా కనిపించాలన్నాడు. అబ్బాయి ఎలా తుపాకీలు పట్టుకుని తిరుగుతాడో, అతడికి ఎలా కండలుంటాయో అలా కనిపించాలన్నాడు. నిజానికి ఈ సినిమా ఫస్ట్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేసినప్పుడు అందులో నేను లేను. ఆ ఫోటోలో అడవులు.. దానిపై బస్తర్‌ అన్న టైటిల్‌ మాత్రమే ఉంది. అయినా సరే ఓ వర్గాన్ని టార్గెట్‌ చేస్తూ సినిమా తీస్తున్నారంటూ రకరకాలుగా విమర్శించారు.

నోటికొచ్చింది తిడుతున్నారు
సినిమా రిలీజ్‌ కాకముందే ఇంత ట్రోలింగా అనిపించింది. అప్పుడసలు ఎలా రిలాక్ట్‌ అవ్వాలో కూడా అర్థం కాలేదు. సినిమా చూడకముందే విమర్శలు గుప్పించాలనుకుంటే అది మీ ఇష్టం. ఏది పడితే అది కామెంట్స్‌ చేసే హక్కు మీకు ఉన్నట్లే నచ్చిన సినిమాలు తీసే హక్కు మాకూ ఉంది. కొందరైతే నేను ఏ పోస్ట్‌ పెట్టినా తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. వేశ్య అని కామెంట్స్‌ చేస్తున్నారు' అని చెప్పుకొచ్చింది. కాగా అదా శర్మ ప్రధాన పాత్రలో నటించిన బస్తర్‌ మార్చి 15న విడుదలైంది. కానీ పెద్దగా వసూళ్లు రాబట్టలేకపోయింది.

చదవండి: మొన్నే ప్రియుడితో ఎంగేజ్‌మెంట్‌.. కుమారుడితో కలిసి పార్టీ ఇచ్చిన హీరోయిన్‌

కంగనా రనౌత్‌ పుట్టినరోజు.. ఈ బ్యూటీ అమ్మ గురించి తెలుసా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement