నా నవ్వు వంకరగా ఉందా? నాకు పక్షవాతమా?: ఆలియా ఫైర్‌ | Alia Bhatt Slams Trolls Over Surgery Gone Wrong Comment | Sakshi
Sakshi News home page

Alia Bhatt: నాకు సర్జరీ వికటించిందా? పక్షవాతం వచ్చిందా? మీ పిచ్చివాగుడు..

Published Fri, Oct 25 2024 7:47 PM | Last Updated on Fri, Oct 25 2024 8:22 PM

Alia Bhatt Slams Trolls Over Surgery Gone Wrong Comment

హీరోయిన్ల ముఖంలో, శరీరంలో ఏమాత్రం తేడా వచ్చినా సర్జరీ చేయించుకుంది కాబోలు అని ప్రచారం చేస్తుంటారు. అంతకుముందే బాగుండేది, ఈ శస్త్ర చికిత్స తర్వాత మరింత అధ్వాన్నంగా తయారైందని తిడుతుంటారు కొందరు. ఇప్పుడు ఇంకా అందంగా మారిందని మెచ్చుకునేవాళ్లు మరికొందరు. కానీ సర్జరీ అని నింద వేసేస్తుంటారు.

డాక్టర్‌పై ఆలియా ఫైర్‌
బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ఆలియా భట్‌ కూడా సర్జరీ చేయించుకుందని అంటున్నాడో కాస్మొటాలజిస్ట్‌. సర్జరీ వికటించిందని, దానివల్ల ఆమె నవ్వు కూడా వంకరగా ఉంటోందని నానా మాటలన్నాడు. దీనిపై ఆలియా స్పందించింది. సోషల్‌ మీడియాలో షేర్‌ అవుతున్న వీడియో చూస్తే హాస్యాస్పదంగా ఉంది. నా గురించేమన్నారు.. నా నవ్వు వంకరగా, మాట్లాడే విధానం భిన్నంగా ఉంటుందా! అక్కడితోనే ఆగిపోలేదు.. ఒకవైపు పక్షవాతం వచ్చిందన్నారు. 

తమాషాగా ఉందా?
ఏంటి? తమాషా చేస్తున్నారా? సాక్ష్యం లేకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం నేరమని తెలియదా? మీ అసత్యాలతో ఎంతోమంది యువత మెదడును కలుషితం చేస్తున్నారు. వ్యూస్‌ కోసం, అటెన్షన్‌ కోసం ఇదంతా చేస్తున్నారా? ఇలాంటి పిచ్చి వాగుడు వాగేవాళ్లలో ఆడవాళ్లు కూడా ఉండటం సిగ్గుచేటు. ఇలాంటి ధోరణి ఎప్పటికైనా ప్రమాదకరమే.. అని ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో రాసుకొచ్చింది. కాగా ఆలియా ఇటీవలే.. జిగ్రా సినిమాతో ప్రేక్షకులను పలకరించింది.

చదవండి:  బాలీవుడ్‌ వ్యక్తి నుంచి సలహా.. నా నామస్మరణ అక్కర్లేదు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement