బాలీవుడ్‌ వ్యక్తి నుంచి సలహా.. నా నామస్మరణ అక్కర్లేదని చెప్పా! | Sai Pallavi Interesting Comments on Bollywood PR ecosystem | Sakshi
Sakshi News home page

Sai Pallavi: నాకు పీఆర్‌ అక్కర్లేదు.. అలా చేస్తే జనాలకు బోర్‌ కొడుతుంది!

Published Fri, Oct 25 2024 5:31 PM | Last Updated on Fri, Oct 25 2024 6:00 PM

Sai Pallavi Interesting Comments on Bollywood PR ecosystem

సినిమాలతో సంబంధం లేకుండా ఎప్పుడూ తన పేరు మార్మోగడానికి, జనాల నోట్లో నానడం కోసం పలువురు సెలబ్రిటీలు పీఆర్‌ ఏజెన్సీలను పెట్టుకుంటారు. అయితే అవన్నీ తనకు నచ్చవంటోంది హీరోయిన్‌ సాయిపల్లవి. ప్రేమమ్‌ సినిమాతో సెన్సేషన్‌ అయిన ఈ బ్యూటీ అమరన్‌ మూవీతో అక్టోబర్‌ 31న ప్రేక్షకులను పలకరించనుంది.

ఇమేజ్‌పెంచేందుకు PR?
ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయిపల్లవి మాట్లాడుతూ.. బాలీవుడ్‌ నుంచి ఓ వ్యక్తి వచ్చి నా ఇమేజ్‌ను మరింత పెంచుకునేందుకు పీఆర్‌ ఏజెన్సీ ఉపయోగపడుతుందన్నాడు. దీనిపై ఏమైనా ఆసక్తి ఉందా? అని అడిగాడు. నాకసలు పీఆర్‌ అనే కాన్సెప్టే అర్థం కాలేదు. దీనివల్ల ఉపయోగమేంటని ప్రశ్నించాను.

వద్దని చెప్పా
పీఆర్‌ ఏజెన్సీ వల్ల నేను ఎప్పుడూ లైమ్‌లైట్‌లో ఉంటాను. అందరూ నా గురించి మాట్లాడుకుంటారని చెప్పాడు. నేను వద్దని చెప్పేశాను. ఎందుకంటే నా సినిమాలు రిలీజైనప్పుడు నేనెలాగో ఇంటర్వ్యూలు ఇస్తున్నాను. తర్వాత కూడా నా పేరు వినిపిస్తూనే ఉండాల్సిన అవసరం ఏముంది? పైగా నా గురించి తరచూ మాట్లాడితే జనాలకు విసుగొస్తుంది అని చెప్పుకొచ్చింది.

సినిమా..
కాగా సాయిపల్లవి అమరన్‌ సినిమా విషయానికి వస్తే.. అమరవీరుడు మేజర్‌ ముకుంద్‌ వరదరాజన్‌ జీవితకథ ఆధారంగా తెరకెక్కింది. రాజ్‌కుమార్‌ పెరియస్వామి దర్శకత్వం వహించగా శివకార్తికేయన్‌ హీరోగా నటించాడు. ఇదిలా ఉంటే సాయిపల్లవి చేతిలో తండేల్‌, రామాయణ్‌ సినిమాలున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement