PR
-
బాలీవుడ్ వ్యక్తి నుంచి సలహా.. నా నామస్మరణ అక్కర్లేదని చెప్పా!
సినిమాలతో సంబంధం లేకుండా ఎప్పుడూ తన పేరు మార్మోగడానికి, జనాల నోట్లో నానడం కోసం పలువురు సెలబ్రిటీలు పీఆర్ ఏజెన్సీలను పెట్టుకుంటారు. అయితే అవన్నీ తనకు నచ్చవంటోంది హీరోయిన్ సాయిపల్లవి. ప్రేమమ్ సినిమాతో సెన్సేషన్ అయిన ఈ బ్యూటీ అమరన్ మూవీతో అక్టోబర్ 31న ప్రేక్షకులను పలకరించనుంది.ఇమేజ్పెంచేందుకు PR?ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయిపల్లవి మాట్లాడుతూ.. బాలీవుడ్ నుంచి ఓ వ్యక్తి వచ్చి నా ఇమేజ్ను మరింత పెంచుకునేందుకు పీఆర్ ఏజెన్సీ ఉపయోగపడుతుందన్నాడు. దీనిపై ఏమైనా ఆసక్తి ఉందా? అని అడిగాడు. నాకసలు పీఆర్ అనే కాన్సెప్టే అర్థం కాలేదు. దీనివల్ల ఉపయోగమేంటని ప్రశ్నించాను.వద్దని చెప్పాపీఆర్ ఏజెన్సీ వల్ల నేను ఎప్పుడూ లైమ్‌లైట్‌లో ఉంటాను. అందరూ నా గురించి మాట్లాడుకుంటారని చెప్పాడు. నేను వద్దని చెప్పేశాను. ఎందుకంటే నా సినిమాలు రిలీజైనప్పుడు నేనెలాగో ఇంటర్వ్యూలు ఇస్తున్నాను. తర్వాత కూడా నా పేరు వినిపిస్తూనే ఉండాల్సిన అవసరం ఏముంది? పైగా నా గురించి తరచూ మాట్లాడితే జనాలకు విసుగొస్తుంది అని చెప్పుకొచ్చింది.సినిమా..కాగా సాయిపల్లవి అమరన్ సినిమా విషయానికి వస్తే.. అమరవీరుడు మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కింది. రాజ్‌కుమార్ పెరియస్వామి దర్శకత్వం వహించగా శివకార్తికేయన్ హీరోగా నటించాడు. ఇదిలా ఉంటే సాయిపల్లవి చేతిలో తండేల్, రామాయణ్ సినిమాలున్నాయి. -
అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు శుభవార్త!
అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు జో బైడెన్ సర్కారు శుభవార్త చెప్పింది. హెచ్1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు అక్కడ చట్టబద్ధంగా ఎలాంటి ఉద్యోగాలైనా చేసేందుకు అనుమతించే ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్–ఈఏడీ (అంటే వర్క్ పర్మిట్ అన్నమాట) గడువు కాలాన్ని ఐదేళ్లు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త నిబంధనలు ఈఏడీల కోసం అప్లయ్ చేసుకునే వారికి లేదంటే రెన్యూవల్ కోసం ప్రయత్నిస్తున్న వారికి సైతం వర్తిస్తుంది. అమెరికాలో హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు, 21 ఏళ్లలోపు వయసున్న వారి పిల్లలు ఉద్యోగం చేసుకోవడానికి వీలుగా హెచ్-4 వీసాలు జారీ చేస్తుంటారు. అయితే హెచ్-4 వీసాదారులు అమెరికాలో ఉద్యోగం చేయాలంటే వారు తప్పనిసరిగా ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్(ఈఏడీ), ఐ-765 కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తు ప్రక్రియ పూర్తయి ఆథరైజేషన్ వస్తేనే వారు ఉద్యోగం చేసేందుకు అవకాశం లభిస్తుంది. అయితే ఈ ప్రక్రియ పూర్తవడానికి 6 నుంచి 8 నెలల సమయం పడుతుంది. కొన్ని సార్లయితే ఏడాదిపైనే పట్టొచ్చు. దీనివల్ల హెచ్-4 వీసాదారులు మంచి ఉద్యోగ అవకాశాలు కోల్పోవాల్సి వస్తోంది. వారి తల్లిదండ్రులకు గ్రీన్ కార్డ్ లేదంటే వారిని విడిచి పెట్టాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతమున్న ఈఏడీ నిబంధనలు మార్చడంతో హెచ్-1 బీ వీసా దారులకు, వారి ఇతర కుటుంబ సభ్యులకు భారీ ఊరట కలిగినట్లైంది ఇటీవల ఓ నివేదిక ప్రకారం.. ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డ్ కోసం 1.05 మిలియన్లకు పైగా భారతీయులు క్యూలో ఉన్నారని నివేదిక హైలైట్ చేసింది. వారిలో 4 లక్షల మందికి పైగా భారతీయులు తమ జీవిత కాలంలో గ్రీన్ కార్డ్ కళ్లజూడలేరని తాజా అధ్యయనం ఒకటి పేర్కొంది! ఆ లోపే వారు కన్ను మూస్తారని అభిప్రాయపడింది. అమెరికాలో ఈ ఏడాది ఉద్యోగాధారిత గ్రీన్ కార్డ్ పెండింగు దరఖాస్తులు ఏకంగా 18 లక్షలు దాటాయి. వీటిలో ఏకంగా 63 శాతం, అంటే 11 లక్షలకు పైగా భారతీయులవే! దాదాపు 2.5 లక్షలు, అంటే 14 శాతంతో చైనా రెండో స్థానంలో ఉంది. -
గూడూరు జెడ్పీటీసీని సస్పెండ్ చేస్తూ జీవో జారీ
హన్మకొండ : జిల్లాలోని గూడూరు మండలం జెడ్పీటీసీ సభ్యుడు ఖాసింను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ గురువారం ప్రభుత్వం జీఓ జారీ చేసింది. జిల్లాలో అటవీ భూముల ఆక్రమణ విషయంలో ఆరోపణలు రావడంతో జిల్లా కలెక్టర్ వాకాటి కరుణకు పంపిన నివేదిక ఆధారంగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు జూలై 27వ తేదీన జెడ్పీటీసీ సభ్యుడిని సస్పెండ్ చేస్తూ ఫైల్‌పై సంతకం చేశారు. ఈ జీఓ జారీ కావడంతో జెడ్పీ టీసీ సభ్యుడిగా ఖాసింను పదవీ నుంచి సస్పెండ్ అయినట్లు సమాచారం. -
పర్మనెంట్ వీసా తిరస్కరించారని..
మెల్ బోర్న్: ఆస్ట్రేలియా మెల్బోర్న్ ప్రాంతంలో ఓ భారతీయ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆస్ట్రేలియాలో శాశ్వత నివాసం కోసం చేసిన తన ధరఖాస్తును అధికారులు నిరాకరించడంతో అతడు ప్రాణాలు తీసుకున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. 36 ఏళ్ళ దీపక్ సింగ్ 2008 లో స్టూడెంట్ వీసాతో ఆస్ట్రేలియాలో కమ్యూనిటీ వెల్ఫేర్ కోర్సు చదివేందుకు వెళ్ళాడు. చదువుకునే సమయంలోఅతడు అక్కడ ఉద్యోగం చేసినట్లుగా రుజువులు దొరకండం అతడ్ని శాస్వత నివాసానికి అర్హత లేకుండా చేసింది. అనంతరం అక్కడే ఓ ఆస్ట్రేలియన్ మహిళను సింగ్ వివాహమాడాడు. టెంపరరీ వీసాతో కొనసాగుతూ... అక్కడి పౌరురాలిని వివాహమాడిన ఆధారంతో పర్మనెంట్ రెసిడెన్సీ (పీఆర్) వీసాకోసం ధరఖాస్తు చేసుకున్నాడు. పని హక్కులను తొలగించడంతోపాటు.. భారత్ కు తిరిగి వెళ్ళాల్సిందిగా సింగ్ ను ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆదేశించడంతో అతడు తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడని, అతడి స్నేహితుడు, సంఘం సభ్యుడైన జస్వీందర్ సిద్ధు తెలిపినట్లు ఓ వెబ్ సైట్ వివరాల్లో వెల్లడించింది. ఆస్ట్రేలియా పౌరురాలిని పెళ్ళాడిన సింగ్.. స్పౌస్ వీసా ఆధారంగా పర్మనెంట్ రెసిడెన్సీ వీసాకు ధరఖాస్తు చేసుకున్నాడని, అయితే అది రావడం ఎంతో కష్టం అని తేలడంతో సింగ్ తీవ్ర నిరాశకు, ఒత్తిడికి లోనయ్యాడని సిద్ధు తెలిపాడు. 2012 లోనే ఓసారి అతని ధరఖాస్తును తిరస్కరించడంతో అప్పట్నుంచీ అతడు పీఆర్ వీసాకోసం తీవ్రంగా పోరాడుతున్నాడని, ఇమ్మిగ్రేషన్ నిరాకరణపై కోర్టును ఆశ్రయించిన సింగ్.... పోరాటం చివరిస్థాయిలో ఉండగా.. కోర్టుకు హాజరు కావాల్సిన అతడు.. ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిపాడు. ప్రతిరోజులాగే ఆదివారం కూడా అతడు నిద్రలేచి కనీసం ఏమీ తినకుండా ఆఫీసుకు బయల్దేరాడని, ఇంటినుంచీ వెళ్ళిన కేవలం అరగంట లోపే పోలీసులు అతడు కారులో చనిపోయినట్లుగా సమాచారం అదించినట్లు సిద్ధూ తెలిపాడు.