అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు జో బైడెన్ సర్కారు శుభవార్త చెప్పింది. హెచ్1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు అక్కడ చట్టబద్ధంగా ఎలాంటి ఉద్యోగాలైనా చేసేందుకు అనుమతించే ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్–ఈఏడీ (అంటే వర్క్ పర్మిట్ అన్నమాట) గడువు కాలాన్ని ఐదేళ్లు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త నిబంధనలు ఈఏడీల కోసం అప్లయ్ చేసుకునే వారికి లేదంటే రెన్యూవల్ కోసం ప్రయత్నిస్తున్న వారికి సైతం వర్తిస్తుంది.
అమెరికాలో హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు, 21 ఏళ్లలోపు వయసున్న వారి పిల్లలు ఉద్యోగం చేసుకోవడానికి వీలుగా హెచ్-4 వీసాలు జారీ చేస్తుంటారు. అయితే హెచ్-4 వీసాదారులు అమెరికాలో ఉద్యోగం చేయాలంటే వారు తప్పనిసరిగా ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్(ఈఏడీ), ఐ-765 కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తు ప్రక్రియ పూర్తయి ఆథరైజేషన్ వస్తేనే వారు ఉద్యోగం చేసేందుకు అవకాశం లభిస్తుంది. అయితే ఈ ప్రక్రియ పూర్తవడానికి 6 నుంచి 8 నెలల సమయం పడుతుంది. కొన్ని సార్లయితే ఏడాదిపైనే పట్టొచ్చు.
దీనివల్ల హెచ్-4 వీసాదారులు మంచి ఉద్యోగ అవకాశాలు కోల్పోవాల్సి వస్తోంది. వారి తల్లిదండ్రులకు గ్రీన్ కార్డ్ లేదంటే వారిని విడిచి పెట్టాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతమున్న ఈఏడీ నిబంధనలు మార్చడంతో హెచ్-1 బీ వీసా దారులకు, వారి ఇతర కుటుంబ సభ్యులకు భారీ ఊరట కలిగినట్లైంది
ఇటీవల ఓ నివేదిక ప్రకారం.. ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డ్ కోసం 1.05 మిలియన్లకు పైగా భారతీయులు క్యూలో ఉన్నారని నివేదిక హైలైట్ చేసింది. వారిలో 4 లక్షల మందికి పైగా భారతీయులు తమ జీవిత కాలంలో గ్రీన్ కార్డ్ కళ్లజూడలేరని తాజా అధ్యయనం ఒకటి పేర్కొంది! ఆ లోపే వారు కన్ను మూస్తారని అభిప్రాయపడింది. అమెరికాలో ఈ ఏడాది ఉద్యోగాధారిత గ్రీన్ కార్డ్ పెండింగు దరఖాస్తులు ఏకంగా 18 లక్షలు దాటాయి. వీటిలో ఏకంగా 63 శాతం, అంటే 11 లక్షలకు పైగా భారతీయులవే! దాదాపు 2.5 లక్షలు, అంటే 14 శాతంతో చైనా రెండో స్థానంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment