ఇటీవలి కాలంలో పలువురు బాలీవుడ్ హీరోహీరోయిన్లు ట్రోలింగ్ బారిన పడ్డారు. పాన్ మసాలా యాడ్‌లో నటించినందుకు అక్షయ్‌పై, మేకప్ ఎక్కువైందని అంకిత లోఖండేపై సల్మాన్‌కు ముద్దులు పెట్టిందని షెహనాజ్ గిల్‌పై విమర్శలు గుప్పించారు నెటిజన్లు. తాజాగా కొత్త పెళ్లికూతురు ఆలియాభట్‌పై మండిపడుతున్నారు. కారణం ఆలియా ఓ కూల్‌డ్రింక్‌ను ప్రమోట్ చేయడమే!
గతంలో కపిల్ శర్మ షోలో హాజరైన ఆలియా తానసలు చక్కెర ఉండే టీని కూడా తాగనని చెప్పుకొచ్చింది. ఎందుకంటే అది ఆరోగ్యానికి హానికరమని పేర్కొంది. కేవలం పండ్ల ద్వారానే చక్కెరను తీసుకుంటానని తెలిపింది. మరి జీవితంలో తానసలు చక్కెరనే తీసుకోనన్న ఆలియా షుగర్ డ్రింక్‌ను మాత్రం ఎలా ప్రమోట్ చేస్తుందని ఫైర్ అవుతున్నారు నెటిజన్లు. డబ్బు కోసం ఏమైనా చేస్తుందా? అని ప్రశ్నిస్తున్నారు. 'రియల్ లైఫ్‌లో చక్కెరను విషమంటోంది, కానీ వేరేవాళ్లకు మాత్రం ఆ విషాన్నే తాగమని చెప్తోంది, ఇదెక్కడి న్యాయం?, 'తన ఆరోగ్యం గురించి అంత జాగ్రత్త తీసుకున్న ఆలియా పక్కవాళ్లను మాత్రం హెల్త్ నాశనం చేసుకోమని చెబుతోంది, ఇదేమైనా బాగుందా?' అని కామెంట్లు చేస్తున్నారు.
— Filmy Pulao (@FilmyPulao) May 8, 2022
So didi herself don't consume sugar, but for money she is doing ads and promoting sugary products and her poor followers gonna get in that trap. waah didi matlab hypocrisy ki bhi
— Shubham(शुभम) 🇮🇳 (@shubhamdaler) May 8, 2022
seema hoti hai!!!
This is bollywood in nutshell!
చదవండి: థ్రిల్లింగ్‌గా 'అమెజాన్ ఒరిజినల్స్' వెబ్ సిరీస్‌లు..
Comments
Please login to add a commentAdd a comment