
'ది కేరళ స్టోరీ' సినిమాతో సంచలన విజయం సొంతం చేసుకుంది హీరోయిన్ ఆదాశర్మ. ఈ సినిమాతో పాన్‌ఇండియా లెవల్‌లో క్రేజ్‌ను సొంతం చేసుకుంది. సినిమా రిలీజ్‌కు ముందు, ఆ తర్వాత ఎన్నో వివాదాలు చుట్టుముట్టినా ఏమాత్రం బెరుకు లేకుండా జాతీయ స్థాయిలో ప్రమోషన్స్‌లో పాల్గొంటూ అందరి దృష్టిని ఆకర్షించింది ఈ బ్యూటీ. హార్ట్‌ఎటాక్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఆదాశర్మ తెలుగులో కొన్ని సినిమాల్లో నటించి గుర్తింపు సంపాదించుకుంది.
అయితే ది కేరళ స్టోరీ విజయంతో ఊహించని స్థాయిలో స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న ఆమె ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఇన్నేళ్ల ప్రయాణంలో హీరోయిన్‌గా తనకు ఎదురైన సవాళ్లను సైతం వివరించింది. ముఖ్యంగా బాలీవుడ్‌లో చాలాసార్లు హీరోలు సెట్స్‌కి లేటుగా వస్తారు.
వాళ్లు వచ్చేవరకు షూటింగ్ మొదలు అవ్వదు. కానీ హీరోయిన్లను మాత్రం ముందుగా రమ్మనేవారు. హీరోలు వచ్చేవరకు వెయిట్ చేయించేవారు. షూటింగ్ ప్రశాంతంగా సాగాలంటే అది డైరెక్టర్ యాటిట్యూడ్ మీద ఆధారపడి ఉంటుంది. ఇకపై నేను ఎంచుకునే స్ట్రిప్ట్‌లు చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటాను అంటూ చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment