Adah Sharma Shares Wounded Photos From The Kerala Story's Shoot - Sakshi
Sakshi News home page

Adah Sharma: -16 డిగ్రీల చలిలో కేరళ స్టోరీ బ్యూటీ, రాళ్లపై పడటంతో గాయాలు

Published Thu, Jun 1 2023 6:51 PM | Last Updated on Thu, Jun 1 2023 7:34 PM

Adah Sharma Shares Wounded Photos From The Kerala Story - Sakshi

ది కేరళ స్టోరీ.. కల్పితం అంటారు కొందరు.. యదార్థ కథను కళ్లకు కట్టినట్లు చూపించారంటారు మరికొందరు. ఏదైతేనేం.. విమర్శల నడుమ మంచి వసూళ్లు రాబట్టింది. మే 5న విడుదలైన ఈ సినిమా రూ.230 కోట్లమేర వసూలు చేసింది. చూస్తుంటే మరికొద్ది రోజుల్లో రూ.250 కోట్ల మైలురాయిని చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఊహించని సక్సెస్‌తో ఉబ్బితబ్బిబవుతున్న అదాశర్మ ఈ సినిమా కోసం ఎంతలా కష్టపడిందో తెలియజేస్తూ ఆసక్తికర ఫోటోలు షేర్‌ చేసింది.

కేరళ స్టోరీ సినిమా షూటింగ్‌లో భాగంగా అఫ్ఘనిస్తాన్‌లో దిగిన ఫోటోలను వదిలింది. ఇందులో అదా ముఖానికి గాయాలయ్యాయి. 'మైనస్‌ 16 డిగ్రీల వాతావరణంలో 40 గంటలు ఉన్నాం. డీహైడ్రేషన్‌ కారణంగా నా పెదాలు పగిలిపోయాయి. ఫోటోలో కనిపిస్తున్న పరుపు నేను కింద పడే సమయానికి వేద్దామనుకున్నారు. కానీ అది జరగలేదు. దీంతో నా ముఖానికి దెబ్బలు తగిలాయి. ఏదైతేనేం.. కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించింది, అందుకు ఆనందంగా ఉంది' అని రాసుకొచ్చింది.

మరో వీడియోలో కుక్కపిల్లతో కాలక్షేపం చేసింది అదా శర్మ. 'ఇషాన్‌ నన్ను కొట్టడానికి వచ్చే సీన్‌ అది.. ఆ సన్నివేశాన్నంతా దగ్గరుండి చూసిన ఈ శునకం తర్వాత నేనెలా ఉన్నానో చూడటానికి నా దగ్గరకు వచ్చింది. అప్పటికే ఏడ్చి ఏడ్చి కళ్లు నొప్పిపెడుతున్నాయి. మరోపక్క తలనొప్పి.. ఇంకోపక్క గర్భిణిలా కనిపించేందుకు ప్రోస్థటిక్‌ మేకప్‌.. అది చాలా బరువుగా ఉంది. నడిచి నడిచి అలిసిపోయాను. ఆ సమయంలో నాకు ఈ శునకం నుంచి హగ్‌ దొరికింది' అని రాసుకొచ్చింది.

చదవండి: డబ్బు కోసమే సల్మాన్‌ చెల్లితో పెళ్లి?
నా వల్ల పైకి వచ్చినవారే గీత దాటారు: అల్లు అరవింద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement