హారర్‌ థ్రిల్లర్‌తో వస్తోన్న ఆదాశర్మ.. చాలా ఏళ్లకు తెలుగులో! | Adah Sharma Latest Tollywood Movie CD Sensor Completed | Sakshi
Sakshi News home page

Adah Sharma: హారర్‌ థ్రిల్లర్‌తో వస్తోన్న ఆదాశర్మ.. రిలీజ్‌ ఎప్పుడంటే?

Published Wed, May 22 2024 7:01 PM | Last Updated on Wed, May 22 2024 7:07 PM

Adah Sharma Latest Tollywood Movie CD Sensor Completed

అదా శర్మ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం సీడీ(క్రిమినల్ ఆర్ డెవిల్‌). ఈ చిత్రంతో చాలా కాలం తర్వాత అదా శర్మ తెలుగు వారిని పలకరించనున్నారు. కృష్ణ అన్నం దర్శకత్వం వహించిన ఈ మూవీని ఎస్ఎస్‌సీఎం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ మూవీకి గిరిధర్ నిర్మాతగా వ్యవహరించారు.

హారర్‌ థ్రిల్లర్‌గా ఈ మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. పోస్టర్ చూస్తే సినిమా కూడా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతుందని అర్థమవుతోంది. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్‌ను జారీ చేశారు. మే 24న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది.

ఈ మూవీలో విశ్వంత్, జబర్దస్త్ రోహిణి, భరణి శంకర్, రమణ భార్గవ్, మహేష్ విట్టా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఆర్ఆర్ ధృవన్ సంగీతం అందించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement