cd
-
బ్యాంకులకు డిపాజిట్ల కష్టాలు
న్యూఢిల్లీ: గడిచిన రెండు సంవత్సరాల్లో పెరిగిన రుణ డిమాండ్ స్థాయిలో డిపాజిట్ల సమీకరణకు బ్యాంక్‌లు సమస్యలు ఎదుర్కొన్నట్టు ఇన్ఫోమెరిక్స్ రేటింగ్స్ తెలిపింది. షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంక్‌లు 2023–24లో జారీ చేసిన రుణాలు రూ.1,64,98,006కోట్లుగా ఉన్నాయి. క్రెడిట్ టు డిపాజిట్ రేషియో (సీడీ రేషియో) ఈ కాలంలో 75.8 శాతం నుంచి 80.3 శాతానికి పెరిగింది. త్రైమాసికం వారీగా చూసిన కానీ షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల డిపాజిట్ల కంటే రుణాల వృద్ధి ఎక్కువగా ఉన్నట్టు ఇన్ఫోమెరిక్స్ నివేదిక తెలిపింది.2018–19 నుంచి 2023–24 మధ్య కాలంలోనూ డిపాజిట్ల కంటే రుణాల వృద్ధి ఎక్కువగా ఉన్నట్టు వెల్లడించింది. ప్రత్యామ్నాయ పెట్టుబడుల సాధనాలు, అసంఘటిత రంగంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నగదు ఎక్కువగా ఉండడం డిపాజిట్ల సమీకరణపై ప్రభావం చూపించినట్టు ఈ నివేదిక తెలిపింది. 30 ఏళ్లలోపు ఇన్వెస్టర్ల సంఖ్య 2018–19 నాటికి 22.6 శాతంగా ఉంటే, 2025 జూలై నాటికి 39.9 శాతానికి పెరగడాన్ని ప్రస్తావించింది. యువ ఇన్వెస్టర్లలో ఈక్విటీ మార్కెట్ల పట్ల పెరిగిన ఆసక్తిని ఈ ధోరణి తెలియజేస్తున్నట్టు పేర్కొంది. ఇదే కాలంలో 30–39 వయసులోని ఇన్వెస్టర్ల బేస్ (సంఖ్య) స్థిరంగానే ఉన్నట్టు తెలిపింది. సంయుక్త కృషి అవసరం: డిపాజిట్ల నిష్పత్తి పెరగాలంటే బ్యాంక్‌లు, ప్రభుత్వం ఉమ్మడిగా చర్యలు చేపట్టాల్సి ఉంటుందని ట్రూనార్త్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈవో రోచక్ బక్షి అభిప్రాయపడ్డారు. సాధారణ ప్రజల నుంచి చిన్న మొత్తాల్లో డిపాజిట్లు సమీకరించే వెనుకటి ధోరణి నుంచి బయటకు రావాలని.. పెద్ద మొత్తంలో కార్పొరేట్ డిపాజిట్లను ఆకర్షించడంపై దృష్టి సారించాలని సూచించారు.బ్యాంక్ టర్మ్ డిపాజిట్లలో 47 శాతం 60 ఏళ్లు నిండిన వృద్ధులవే ఉన్నట్టు, యువతరం బ్యాంక్ డిపాజిట్ల వట్ల ఆసక్తి చూపించడం లేదన్న దానికి నిదర్శనమని చెప్పారు. కనీసం ఆదాయపన్ను అధిక శ్లాబులోని వారికి అయినా బ్యాంక్ డిపాజిట్ల వడ్డీపై పన్ను భారాన్ని తగ్గించాలని భక్షి సూచించారు. ఏటా వడ్డీపై టీడీఎస్ మినహాయించడం కాకుండా, డిపాజిట్ కాల వ్యవధి ముగిసిన సమయంలోనే పన్నును పరిగణనలోకి తీసుకోవాలన్నారు. -
Criminal or Devil Review: అదా శర్మ హారర్ మూవీ ఎలా ఉందంటే.. ?
టైటిల్: C.D (క్రిమినల్ ఆర్ డెవిల్) నటీనటులు: అదా శర్మ, విశ్వంత్, జబర్దస్త్ రోహిణి, భరణి శంకర్, రమణ భార్గవ్, మహేష్ విట్టా నిర్మాణ సంస్థ: SSCM ప్రొడక్షన్స్దర్శకుడు: కృష్ణ అన్నంసంగీతం: ఆర్ఆర్ ధృవన్సినిమాటోగ్రఫీ: సతీష్ ముత్యాలఎడిటర్: సత్య గిడుతూర్విడుదల తేది: మే 24, 2024ది కేరళ ఫైల్స్, బస్తర్ వంటి సినిమాలతో అదా శర్మ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా అంతటా ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇక చాలా కాలం తర్వాత మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ బ్యూటీ. ఆమె నటించిన తాజా చిత్రం ‘C.D క్రిమినల్ ఆర్ డెవిల్’ నేడు (మే 24) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..సిద్ధు(విశ్వంత్)కి దెయ్యాలు అంటే చాలా భయం. ఓ సారి అమ్మానాన్నలు ఊరికి వెళ్లడంతో ఒంటరిగానే ఇంట్లో ఉండాల్సి వస్తుంది. పని మనిషి (జబర్దస్త్ రోహిణి) అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటుంది. ఒంటరిగా డెవిల్ అనే దెయ్యం సినిమా చూసి సిద్ధు మరింత బయపడిపోతాడు. సినిమాలోని దెయ్యం బయటకు వచ్చి తనను చంపేస్తుందని బయపడుతుంటాడు. ఇలా సిద్దు ఇంట్లో ఒంటరిగా ఉంటున్న సమయంలోనే అమ్మాయిలను కిడ్నాప్ చేసే ఓ లేడీ సైకో రక్ష (అదా శర్మ) బయట అందరిలోనూ భయాన్ని పుట్టిస్తుంది. ఐ విల్ కిల్ యూ అని రాస్తూ కిడ్నాపులు చేస్తుంటుంది. పోలీసులు ఎంత ప్రయత్నించినా..ఆమె దొరకదు. అలా తప్పించుకుంటూ చిరవకు విశ్వంత్ కోసం వచ్చి, అతని ఇంట్లోనే ఉంటుంది. విశ్వంత్‌కి ఉన్న సమస్య ఏంటి? రక్షగా అదా శర్మ ఎందుకు వచ్చింది? అసలు అమ్మాయిల్ని కిడ్నాప్ చేస్తుంది ఎవరు? చివరకు పోలీసులు ఏం చేశారు? అన్నది కథ.ఎలా ఉందంటే.. హారర్, సస్పెన్స్, కామెడీ, థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కిన సినిమానే ఈ C.D. దర్శకుడు రాసుకున్న పాయింట్ బాగుంది కానీ దాన్ని తెరపై ఆసక్తికరంగా చూపించడంలో కాస్త తడబడ్డాడు. ఈ కథంతా ఒకే చోట జరుగుతుంది. దీంతో కథనం కాస్త సాగదీతగా అనిపిస్తుంది. అలాగే కొన్ని సీన్లు మరీ సినిమాటిక్‌గా అనిపిస్తాయి కానీ ఆకట్టుకుంటాయి. ప్రేక్షకులను భయపెట్టడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. సినిమా ప్రారంభంలో వచ్చే కొన్ని సన్నివేశాలు ఇల్లాజికల్‌గా అనిపిస్తాయి కానీ అవి ఎందుకు పెట్టారనేది చివర్లో తెలుస్తుంది. ఇంటర్వెల్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచేలా ఉంటుంది. ఇక ద్వితియార్థంలో హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సన్ని వేశాలు కొన్ని రొమాంటిక్‌గా అనిపిస్తే.. ఇంకొన్ని సార్లు హారర్ ఎలిమెంట్స్‌ని తలపిస్తాయి. ఇక మధ్య మధ్యలో రోహిణి పాత్ర చేసే కామెడీ నవ్విస్తుంది. చివర్లో ఇచ్చిన ట్విస్ట్ బాగుంటుంది. నగరంలో అమ్మాయిల మిస్సింగ్ విషయంలో చివరన ఇచ్చిన ట్విస్ట్ అదిరిపోతుంది. క్లైమాక్స్‌లో ఎవరూ ఊహించని ట్విస్ట్ ఉంటుంది.ఎవరెలా చేశారంటే.. ఆదా వర్మ మరోసారి తనదైన నటనతో ఆకట్టుకుంది. రక్ష పాత్రలో ఆమె ఒదిగిపోయింది. చూపుల్తోనే అందరిని భయపెట్టేసింది. యాక్షన్ సీక్వెన్స్‌లో అదరగొట్టేస్తుంది. ఇక విశ్వంత్ అయితే తన వేరియేషన్స్ చూపించాడు. విశ్వంత్ పాత్ర ఈ సినిమాకు హైలెట్ అవుతుంది. రోహిణి కామెడీ సినిమాకు ప్లస్ అయింది. పోలీస్ ఆఫీసర్‌గా భరణి మెప్పిస్తాడు. ఇక మిగిలిన పాత్రలు పర్వాలేదనిపిస్తాయి. సాంకేతిక విషయాలకొస్తే..ఈ సినిమాకు ప్రధాన బలం ఆర్ఆర్ ధృవన్ సంగీతం. తనదైన బీజీఎంతో కొన్ని చోట్ల భయపెట్టాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
హారర్ థ్రిల్లర్‌తో వస్తోన్న ఆదాశర్మ.. చాలా ఏళ్లకు తెలుగులో!
అదా శర్మ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం సీడీ(క్రిమినల్ ఆర్ డెవిల్). ఈ చిత్రంతో చాలా కాలం తర్వాత అదా శర్మ తెలుగు వారిని పలకరించనున్నారు. కృష్ణ అన్నం దర్శకత్వం వహించిన ఈ మూవీని ఎస్ఎస్సీఎం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ మూవీకి గిరిధర్ నిర్మాతగా వ్యవహరించారు.హారర్ థ్రిల్లర్‌గా ఈ మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. పోస్టర్ చూస్తే సినిమా కూడా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతుందని అర్థమవుతోంది. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్‌ను జారీ చేశారు. మే 24న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది.ఈ మూవీలో విశ్వంత్, జబర్దస్త్ రోహిణి, భరణి శంకర్, రమణ భార్గవ్, మహేష్ విట్టా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఆర్ఆర్ ధృవన్ సంగీతం అందించారు. -
హారర్ సీడీ
‘ది కేరళ స్టోరీ’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత అదా శర్మ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సీడీ’. ‘క్రిమినల్ ఆర్ డెవిల్’ అనేది ఉపశీర్షిక. కృష్ణ అన్నం దర్శకత్వంలో ఎస్ఎస్సీఎమ్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సైకలాజికల్ అండ్ హారర్ థ్రిల్లర్ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ‘‘ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇచ్చే చిత్రం ఇది. త్వరలోనే రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. విశ్వంత్, ‘జబర్దస్త్’ రోహిణి, భరణి శంకర్, రమణ భార్గవ్, మహేష్ విట్టా కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఆర్ఆర్ ధృవన్, కెమెరా: సతీష్ ముత్యాల. -
మరో హిట్‌కు సిద్ధమైన ఆదాశర్మ.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్!
ది కేరళ స్టోరీ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన హీరోయిన్ ఆదాశర్మ. ప్రస్తుతం మరో ఇంట్రెస్టింగ్ కథలో ప్రేక్షకుల ముందుకు రానుంది. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరించే హారర్ జానర్‌తో అలరించేందు సిద్ధమైంది. సరికొత్త సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ సీడీతో ఆదాశర్మ మన ముందుకు రాబోతోంది. డిఫరెంట్ ఫీలింగ్ కలిగింగ్ సరికొత్త స్టోరీతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న అదా శర్మ మరో లీడ్ రోల్ సినిమాలో ఆసక్తి పెంచుతోంది. (ఇది చదవండి: ‘స్టార్ మా’లో సరికొత్త సీరియల్) సీడీ (క్రిమినల్ ఆర్ డెవిల్) చిత్రాన్ని కృష్ణ అన్నం దర్శకత్వంలో తెరకెక్కిస్కున్నారు. ఎస్ఎస్సీఎమ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై.. గిరిధర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఆర్ఆర్ ధృవన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. దెయ్యాల చేతుల మధ్యన ఆదాశర్మ లుక్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. పోస్టర్ చూస్తే అదా శర్మ సీరియస్ లుక్, ఆ చుట్టూ డెవిల్స్ హ్యాండ్స్ కనిపిస్తుండటం చిత్రంలోని వైవిధ్యాన్ని తెలుపుతున్నాయి. ఫస్ట్ లుక్ పోస్టర్ చూడగానే ఆడియన్స్‌లో మరింత ఆసక్తిని పెంచేశారు. ఈ చిత్రంలో విశ్వంత్, జబర్దస్త్ రోహిణి, భరణి శంకర్, రమణ భార్గవ్, మహేష్ విట్టా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. అతి త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తామని మేకర్స్ ప్రకటించారు. (ఇది చదవండి: ఆ హీరోతో నటించాలని కోరిక.. కానీ ఆ పాత్ర చేయను: రాశి) -
ఇళ్ల పట్టాలపై ప్రశంసలు.. సీడీ ఆవిష్కరణ
సాక్షి, అమరావతి : రేపు (శుక్రవారం) జరగబోయే ఇళ్ల పట్టాల పంపణీ యావత్ ఆంధ్రప్రదేశ్ ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. ఇళ్ల పట్టాల పంపిణీ మహిళా సాధికారతకు పెద్దపీట అంటూ ప్రముఖులు కొనియాడుతున్నారు. ఇళ్ల పట్టాల పంపిణీపై పలురంగాలకు చెందిన మహిళా ప్రముఖులు వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ సీడీని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి తయారు చేయగా.. దీనిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతులు మీదగా గురువారం సాయంత్రం ఆవిష్కరించారు. ఇళ్ల పట్టాల పంపిణీపై పీవీ సింధు, కరణం మల్లేశ్వరి, పీటీ ఉష, సుధామూర్తి, అపోలో సంగీతరెడ్డి పద్మావతి వర్సిటీ వైస్‌చాన్స్‌లర్ జమున, ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ ఫ్రీడ్ హాగ్ యూనిసెఫ్ యస్మిన్ ఆలీ, కర్ణాటక ఉమెన్స్ కమిషనర్ చైర్పర్సన్ ఒడిశా చైర్పర్సన్, మణిపూర్ చైర్పర్సన్, ఎంపీ నవనీత్ కౌర్ హోంమంత్రి సుచరిత, ఎమ్మెల్యే రోజా సంతోషం వ్యక్తం చేస్తూ సీడీలో వారి అభిప్రాయాలను చెప్పారు. (పులివెందుల రుణం ఎప్పటికీ తీరనిది) నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’లో భాగంగా డిసెంబర్ 25న రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల స్థలాల పంపిణీ కోసం 30,68,281 మంది అర్హులను అత్యంత పారదర్శకంగా ఎంపిక చేసి సచివాలయాల నోటీసు బోర్డుల్లో జాబితాను పొందుపరిచారు. అర్హుల్లో ఏ ఒక్కరికీ ఇంటి స్థలం రాలేదనే మాట వినిపించరాదని సీఎం వైఎస్ జగన్ పలుమార్లు స్పష్టం చేశారు. ఏవైనా కారణాలతో ఎక్కడైనా అర్హుల పేర్లు లబ్ధిదారుల జాబితాలో లేకపోతే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఇలా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి.. 90 రోజుల్లోగా ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి స్థలాలు కేటాయిస్తామని ప్రకటించింది. ఇళ్ల పట్టాల పంపిణీ కోసం రాష్ట్రవ్యాప్తంగా 66,518 ఎకరాల భూమిని సేకరించి లేఔట్లు వేసి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. చివరిలో దరఖాస్తు చేసుకుని అర్హులుగా ఎంపికైన 80 వేల మంది కోసం వచ్చే నెల 10లోగా స్థల సేకరణతోపాటు ప్లాట్ల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. స్థలాల పంపిణీతోపాటు 15 లక్షల ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ కోసం ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి కావచ్చాయి. ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు : బొత్స ఇళ్ల పట్టాల పంపిణీపై రాష్ట్రమంత్రి బొత్స సత్యనారాయణ విశాఖపట్నంలో మాట్లాడారు. రేపు పేదల సొంతింటి కల నెరవేర్చే రోజుఅని అన్నారు. తొలుత 30 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తామన్నారు. తొలివిడతలో 15 లక్షల ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేపడతామని తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం తూర్పు గోదావరి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని సీఎం చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు. ‘ఇంత పెద్దఎత్తున పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం చరిత్రలో ఇదే తొలిసారి. 300 ఎస్ఎఫ్టి ఇళ్లను ఒక్క రూపాయికే అందిస్తున్నాం. స్థలం ఉండి పాకలో ఉండే పేదలకు ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు అందిస్తాం. 15.60 లక్షల ఇళ్లకు రూ.1.80 లక్షల చొప్పున లబ్ధిదారులకు ఇస్తాం. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 17 వేల కొత్త టౌన్‌షిప్‌లు వస్తాయి. రూ.23,538 కోట్ల విలువైన భూమిని పేదలకు అందిస్తున్నాం. రాజకీయాలకు తావులేకుండా లబ్ధిదారుల ఎంపిక జరిగింది. చంద్రబాబు కోర్టులకు వెళ్లి అడ్డుకోవాలని చూశారు’ అని అన్నారు. (పట్టాల పండుగకు చురుగ్గా ఏర్పాట్లు) -
విజయమ్మ చేతుల మీదుగా ఏసు ప్రేమ సీడీ ఆవిష్కరణ
-
కర్నూలులో హీరో ధనుష్ సందడి
- ఆడపిల్ల పాట సీడీ ఆవిష్కరణ పాణ్యం: జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ రాసిన ఆడపిల్ల పాట సీడీని ప్రముఖ తమిళ హీరో ధనుష్ మంగళవారం తమ్మరాజుపల్లె గ్రామ సమీపంలో పవర్ పాండి చిత్ర నిర్మాణ సన్నివేశాల చిత్రకరణ సందర్భంగా ఆవిష్కరించారు. అనంతరం పాటలను విని అర్థాన్ని అక్కడున్న వారితో అడిగి తెలుసుకున్నారు. పాటలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. పోలీసు వృత్తిలో ఎన్నో ఒత్తిళ్లు ఉంటాయని.. అయినప్పటికీ సమాజం కోసం ఇలాంటి పాటలు రాయడం అభినందనీయమన్నారు. పాటలను అన్ని భాషల్లో అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో నంద్యాల డీఎస్పీ హరినాథ్‌రెడ్డి , పాణ్యం సీఐ పార్థసారధిరెడ్డి, పాణ్యం ఎస్ఐ మురళీమోహన్రావు తదితరులు పాల్గొన్నారు. కాగా ధనుష్ పాణ్యం మండలం తమ్మరాజుపల్లె గ్రామ సమీపంలో మంగళవారం ఓ షూటింగ్లో పాల్గొన్నారు. వండర్‌బార్ ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తున్న పవర్ పాండి చిత్ర షూటింగ్ గ్రామ సమీపంలోని రాజస్థాన్ డాబా వద్ద జరిగింది. -
చేనేత కార్మికుల స్థితిగతులపై సీడీ ఆవిష్కరణ
ఆత్మకూర్(నర్వ) : అమరచింతలో గురువారం మార్కండేయ స్వామి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో పద్మశాలి కులస్తులు రాఖీపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. సాయంత్రం ప్రభోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం గ్రామానికి చెందిన మహంకాళి శ్రీనివాసులు కాడ్గిగణేష్ సహకారంతో నిర్మించిన చేనేత బతుకులపై పాటలు పాడిన సీడీని గ్రామపెద్దల సమక్షంలో ఆవిష్కరించారు. పద్మశాలి సంఘ అభివృద్ధికి శ్రీ ఫౌండేషన్ సంస్థ నిర్వాహకుడు రూ.2 లక్షల విరాళం అందజేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సుధారాణి, ఎంపీటీసీ మహంకాళి విష్ణు, ప్రముఖ గాయకుడు సాయిచంద్, గద్వాల జరీచీరల వ్యాపారి మహంకాళి శ్రీనివాసులు, పద్మశాలి సంఘం అధ్యక్షుడు దేవరకొండ లచ్చన్న, కార్యదర్శి కొంగరి భాస్కర్, చిలువరి రాములు, పారుపల్లి చింతన్న, రంగు మనోహర్ తదితరులు పాల్గొన్నారు. -
అంగన్వాడీల్లో.. భయం భయం
అంగన్వాడీల వేతనాలు పెంచండి పెంచిన జీతాలను అమలు చేయాలంటూ.. విజయవాడలో సీఎం క్యాంప్ ఆఫీస్‌ను ముట్టడించిన అంగన్వాడీలను కర్కశంగా అణదొక్కేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. విజయవాడ ధర్నాకు వెళ్లిన కార్యకర్తలపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు విధులు నుంచి తొలగించాలని కలెక్టర్లకు ఆదేశాలు అందాయి. దీంతో ఇప్పటికే ఉద్యోగ భద్రతపై మీమాంసలో ఉన్న అంగన్వాడీల్లో గుబులు మొదలైంది. తిరుపతి: చాలీచాలని జీతాలతో భారంగా బతుకీడుస్తున్న అంగన్వాడీ కార్యకర్తలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. ప్రభుత్వం అంగన్వాడీలకు జీతాలు పెంచుతామని ప్రకటించినా ఆచరణలో మాత్రం అమలుకు నోచుకోలేదు. దీంతో వేతనాల పెంపు జీవోను వెంటనే విడుదల చేయాలనే డిమాండ్‌తో అంగన్వాడీలు ఈనెల 18వతేదీన ‘ఛలో విజయవాడ కార్యక్రమం’ నిర్వహించారు. ఇందుకోసం 13 జిల్లాల నుంచి వేలాదిమంది కార్యకర్తలు తరలి వెళ్లి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ప్రభుత్వ ఆదేశాలతో రెచ్చిపోయిన పోలీసులు విచక్షణ రహితంగా అంగన్వాడీలపై దాడికి దిగారు. దీంతో శాంతియుత ప్రదర్శన కాస్తా.. ఖాకీల క్రౌర్యంతో రక్తసిక్తమైన సంగతి తెలిసింది. ఆ తర్వాత జీతాలను పెంచుతున్నట్లు సీఎం అసెంబ్లీలో ప్రకటించినా జీవో మాత్రం జారీ చేయలేదు. పైగా అంగన్వాడీలపై కక్షసాధించే విధంగా.. ఛలో విజయవాడ కార్యక్రమానికి హాజరైన అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులను తొలగించాలని ప్రభుత్వం 21 వతేదీన స్పెషల్ ఆఫీసర్ కేఆర్బీహెచ్ఎన్ చక్రవర్తి పేరుతో సర్క్యులర్ జారీ చేసింది. జిల్లాకు చేరిన సీడీలు చలో విజయవాడ కార్యక్రమానికి హాజరైన అంగన్వాడీలను గుర్తించే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది. ఇందులో భాగంగా విజయవాడలో జరిగిన ధర్నా ఫొటోలున్న సీడీలను ప్రాజెక్టు డెరైక్టర్‌కు పంపారు. ప్రాజెక్టు డెరైక్టర్ వాటిని సంబంధిత సీడీపీవోలకు పంపి జిల్లాకు చెందిన అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు ఏవరైనా ఉన్నారా? అని ఆరా తీస్తున్నారు. ఫొటోలో గుర్తించిన వారిని తొలగించాలని సంబంధిత కలెక్టర్‌ను స్పష్టంగా ఆదేశించారు. ఈ మేరకు ఫొటోల్లో ఉన్న జిల్లా కార్యకర్తలను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. గుర్తించే పనిలో ఉన్నాం విజయవాడ ధర్నాలో పాల్గొన్నవారి ఫొటోలు వచ్చాయి. వాటి ఆధారంగా సిబ్బందితో క్షేత్రస్థాయిలో పరిశీలించాం. అయితే ఫొటోల్లో మన జిల్లాకు చెందిన అంగన్వాడీలుగా ఎవరూ కనిపించ లేదు. -లక్ష్మీ, ఐసీడీఎస్ ప్రాజెక్టు డెరైక్టర్, చిత్తూరు. -
ఒక ఇటాలియన్ కథ... ఇండియన్ సినిమాలెన్నో..!
విదేశీ సినిమాల సీడీలను చూసి కథాంశాలను కాపీ కొట్టి రూపొందించిన సినిమాలు అంటే అవేవో అత్యంత వైవిధ్యమైన కథనంతో వచ్చినవో, సిల్వర్ స్క్రీన్‌పై ఆవిష్కృతమైన అద్భుతాలో కానక్కర్లేదు. చాలా సాధారణం అనిపించే కథల మూలం కూడా ఏ హాలీవుడ్‌లోనో ఉండవచ్చు. సెన్సిబుల్‌గా సాగుతూ అచ్చ తెలుగు కథలు అనుకొన్న సినిమాల రూట్స్ కూడా అమెరికాతో ముడిపడి ఉండవచ్చు. ‘బావగారూ బాగున్నారా’ సినిమా కథాంశంలో కూడా విదేశీహస్తం ఉందనే విషయం తెలిసినప్పుడు కలిగే అభిప్రాయాలివి. 1998లో మెగాస్టార్ చిరంజీవి, రంభ హీరో ీహ రోయిన్లుగా జయంత్ దర్శ కత్వంలో వచ్చిన ‘బావగారూ బాగు న్నారా’ మూల కథ మనది కాదు. ‘ఫోర్స్టెప్స్ ఇన్ క్లౌడ్స్’ అనే ఇటాలియన్ సినిమా కథ అది. ఆ కథలో ఉన్న గొప్పదనం అనేక మంది, అనేక సార్లు దాన్ని కాపీ కొట్టేలా చేసింది. 1942 నుంచి ఇప్పటి వరకూ అనేకసార్లు ఈ సినిమా కథను అటు తిప్పి ఇటు తిప్పి ఎవరో ఒకరు రీమేక్ చేస్తూనే ఉండటం ఈ కథాంశంలో ఉన్న నిత్యనవ్యతకు సాక్ష్యం. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత తమ తమ స్వదేశాలకు చేరుకొన్న సైనికుల భావోద్వేగాల ఆవిష్కరణతో సినిమా ఆరంభం అవుతుంది. ప్రాణాలతో తిరిగొచ్చిన సైనికులకు వారి వారి కుటుంబాలు స్వాగతం పలుకుతుంటాయి. తీరంలో నౌకలు దిగిన వారిని రిసీవ్ చేసుకోవడానికి వాళ్ల వాళ్లంతా వచ్చి ఉంటారు. అయితే లెఫ్టినెంట్ హోదాలోని పాల్ సటన్‌ను మాత్రం పట్టించుకొనే వారు ఎవరూ ఉండరు. ఎందుకంటే అతడొక అనాథ. దాంతో అతడు బాధప డతాడు. తనకూ ఒక కుటుంబం ఉంటే బావుంటుందని అనుకుంటాడు. తాను పెళ్లి చేసుకొంటేనే అది సాధ్యమవు తుందన్న ఉద్దేశంతో ఒక సుదూర ప్రాంతానికి ప్రయాణం మొదలు పెడతాడు. మార్గ మధ్యంలో పాల్‌కు విక్టోరియా పరిచయం అవుతుంది. అంతు లేని విషాదంతో కనిపిస్తోన్న ఆమె కథను అడిగి తెలుసుకుంటాడు పాల్. తన బాయ్‌ఫ్రెండ్ తనను గర్భవతిని చేసి మోసగించాడని, ఇంట్లోవాళ్లకు తెలిస్తే చంపేస్తారని ఆమె చెబుతుంది. ఆమె కష్టాన్ని అర్థం చేసుకొన్న పాల్, విక్టోరియాకు బాయ్‌ఫ్రెండ్‌గా వాళ్ల ఇంటికి వెళతాడు. అయితే కూతురు తన సమ్మతం లేకుండానే భర్తను తెచ్చుకొందన్న కోపంతో ఉన్న హీరోయిన్ తండ్రి పాల్‌ను అసహ్యించుకుంటాడు. మిగతా వాళ్లు మాత్రం పాల్‌ను ఆదరిస్తారు. మరి విక్టోరియా తండ్రిని అతడు ఎలా ఆకట్టుకున్నాడు, ఆ ఇంట్లో ఎలా సభ్యుడయ్యాడు అనేదే మిగతా కథ. ఇక ఈ తరహాలో ఎన్ని తెలుగు సినిమాలు వచ్చాయో చూస్తే పెద్ద లిస్టే తయారవుతుంది. ‘ఫోర్ స్టెప్స్ ఇన్ క్లౌడ్స్’ని ‘ఎ వాక్ ఇన్ ద క్లౌడ్స్’ పేరుతో ట్వంటీయత్ సెంచరీ ఫాక్స్ వారు హాలీవుడ్లో తీశారు. ఇది హాలీవుడ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ రొమాంటిక్ ఎంటర్టైనర్. ఆ తర్వాత ఈ కథనాన్ని ఆధారంగా చేసుకొని ఎన్నో భాషల్లో సినిమాలొచ్చాయి. మన ‘బావగారూ బాగున్నారా’ కూడా ఇలా వచ్చిందే. ఆత్మహత్య చేసుకొనే ప్రయత్నంలో ఉన్న రచన కోసం చిరంజీవి పరేష్ రావెల్ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. అయితే రచన హీరోయిన్ కాకపోవడమే మన కథలో మార్పు. రచనకు ప్రేమించినవాడితో పెళ్లి చేసి, తాను ప్రేమించిన రచన చెల్లెలు రంభని చిరంజీవి పెళ్లి చేసుకోవడంతో కథ ముగుస్తుంది. అలాగే జగపతిబాబు నటించిన ‘అల్లుడుగారు వచ్చారు’పై కూడా ‘ఫోర్ స్టెప్స్ ఇన్ క్లౌడ్స్’ ప్రభావం కనిపిస్తుంది. ఎన్టీయార్ నటించిన ‘బృందావనం’లో కూడా పై సినిమా ఛాయలే కనిపిస్తాయి. 2000 సంవత్సరంలో బాలీవుడ్లో ‘థాయి అక్షర్ ప్రేమ్‌కీ’ అనే సినిమా వచ్చింది. అభిషేక్‌బచ్చన్, ఐశ్వర్యారాయ్ తొలిసారి కలసి నటించిన ఈ సినిమా ‘ఏ వాక్ ఇన్ ద క్లౌడ్స్’కు అనధికార రీమేక్ అని చెప్పవచ్చు. ఈ విధంగా ఒక ఇటాలియన్ కథ.. ఇండియాలో అనేక సినిమాలకు మూలంగా నిలిచింది. - బి.జీవన్‌రెడ్డి -
ఇక కేసుల వివరాలన్నీ ఆన్లైన్లో..
గుంటూరు క్రైమ్: కేసుల నమోదు, సీడీ, చార్జిషీట్, అరెస్ట్ వివరాలతో పాటు నిందితుల ఫొటోలు, వేలిముద్రలు తదితరాలను అధికారులు ఇక నుంచి క్షణాల్లో తెలుసుకోవచ్చు. వివరాలన్నీ ఆన్లైన్లో పొందుపరిచేందుకు అవసరమైన చర్యలను ప్రభుత్వం చేపట్టింది. ఇప్పటికే ఈ కాప్స్ పేరుతో ప్రతి ఆన్లైన్లో ఒక్కొక్క కానిస్టేబుల్‌కు శిక్షణ ఇచ్చారు. పోలీస్ శాఖలో ఆధునికమైన క్రైమ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్కింగ్ సిస్టమ్(సీసీటీఎన్ఎస్) విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. రాష్ట్రంలో గుంటూరు జిల్లాను పెలైట్ ప్రాజెక్టుగా తీసుకొని సీసీటీఎన్ఎస్ అమలుకు యంత్రాంగం శ్రీకారం చుట్టింది. టీసీఎస్ కంపెనీ నుంచి ఔట్ సోర్సింగ్ విధానంలో రూరల్ జిల్లాకు 64, అర్బన్ జిల్లాకు 20 మందిని కేటాయించారు. వీరికి మూడు రోజుల శిక్షణ శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని సీసీటీఎన్ఎస్ విభాగంలో ప్రారంభించారు. శిక్షణ అనంతరం జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్లకు ఒక్కొక్కరిని కేటాయిస్తారు. వీరు పోలీస్ స్టేషన్లో ఈకాప్స్‌కు సహకారంగా ఉంటూ పనిచేస్తారు. ఈనెల 26వ తేదీలోగా ఎఫ్ఐఆర్, కేస్‌డైరీ(సీడీ), చార్జిషీట్, అరెస్టులు, రౌడీషీటర్లు, సంఘ విద్రోహశక్తులు, నిందితులు తదితర వివరాలను స్థానిక పోలీస్‌స్టేషన్ అధికారి పర్యవేక్షణలో ఆన్లైన్లో పొందుపరుస్తారు. 26న సీసీటీఎన్ఎస్ సేవలు అధికారికంగా ప్రారంభమౌతాయి. వీటిని పర్యవేక్షించేందుకు ఆరు నెలలపాటు ఆయా సిబ్బంది స్టేషన్లలో విధులు నిర్వహిస్తారు. ఈ విధానం అమల్లోకి వస్తే ఆన్లైన్లో కేసుల వివరాలు, నిందితుల సమాచారం అధికారులు క్షణాల్లో తెలుసుకొని తదుపరి చర్యలు చేపట్టేందుకు సమయం కలసివస్తుంది. ఇదిలా ఉంటే పోలీస్‌శాఖతో సంబంధం లేని వ్యక్తుల తో ఈ వివరాలను నమోదు చేయిస్తే రహస్య సమాచారం బయటకు వెళ్లే ప్రమాదం ఉందని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా తెలుసుకోండి.. అర్బన్, రూరల్ జిల్లాల సిబ్బందికి విడివిడిగా శిక్షణ ఏర్పాటు చేశారు. అర్బన్ సిబ్బంది శిక్షణను అర్బన్ ఎస్పీ రాజేష్ కుమార్ , రూరల్ సిబ్బందికి రూరల్ జిల్లా అదనపు ఎస్పీ డి. కోటేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శిక్షణ సమయంలో అధికారులు తెలియజేసే జాగ్రత్తలు ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. పూర్తిస్థాయిలో అవగాహన పెంపొందించుకోవాలని, సందేహాలు ఉంటే వెంటనే అడిగి తెలుసుకోవాలని ఆదేశించారు. సమాచారం నమోదులో ఎలాంటి సందేహాలు వచ్చినా సంబంధిత అధికారులకు తెలియచేసిన అనంతరమే నిర్ణయం తీసుకోవాలన్నారు. రికార్డుల్లో పొందు పరచిన రహస్య సమాచారం బయటకు వెళ్లితే అందుకు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
కాంగ్రెస్, బీజేపీ సీడీల యుద్ధం
‘హవాలా’ ఫత్తా, మోడీ ఫొటోల సీడీ విడుదల చేసిన కాంగ్రెస్ ఫత్తా, అజహర్‌ల ఫోటోను బయటపెట్టిన బీజేపీ న్యూఢిల్లీ: కాంగ్రెస్, బీజేపీల మధ్య సీడీల యుద్ధం తీవ్రమైంది. సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా అక్రమ భూలావాదేవీలకు పాల్పడ్డారంటూ బీజేపీ వాటిపై ఆదివారం సీడీని విడుదల చే సిన నేపథ్యంలో కాంగ్రెస్ సోమవారం నరేంద్ర మోడీ పై ఓ సీడీని బయటకు తె చ్చింది. రూ.1000 కోట్ల హవాలా రాకెట్ కుంభకోణంలో అరెస్టయిన అఫ్రోజ్ ఫత్తా అనే బీజేపీ మద్దతుదారుతో మోడీ కలిసి దిగినట్లున్న ఫొటోలతో కూడిన సీడీని కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సూర్జీవాలా ఢిల్లీలో విడుదల చేశారు. దీనిపై దమ్ముంటే స్వతంత్ర దర్యాప్తునకు మోడీ సిద్ధం కావాలని సవాల్ విసిరారు. ఇద్దరి మధ్య సంబంధం ఎలాంటిదో బయటపెట్టాలన్నారు. ఈ సీడీ లక్ష్యంగా బీజేపీ నేత, మోడీ సన్నిహితుడు అమిత్ షా మరో సీడీని విడుదల చేశారు. కాంగ్రెస్ ఎంపీ మహమ్మద్ అజహరుద్దీన్.. అఫ్రోజ్ ఫత్తాతో కలిసి దిగినట్లున్న ఫోటోను అమిత్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఫత్తా, అజహర్‌ల సంబంధమేంటో కాంగ్రెస్ చెప్పాలని బీజేపీ నేత హర్ష్ సంఘవీ డిమాండ్ చేశారు. -
నరేంద్ర మోడీపై సీడీ విడుదల చేసిన కాంగ్రెస్
న్యూఢిల్లీ: బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య మాటల యుద్ధం ముదిరి సీడీల రూపంలో విమర్శలకు మరింత పదును పెడుతున్నారు. వెయ్యి కోట్ల రూపాయిల హవాల కుంభకోణంలో అరెస్ట్ అయిన అఫ్రాజ్ ఫట్టా అనే వ్యక్తితో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ కలసి ఉన్న చిత్రాలతో కూడిన సీడీని కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. నరేంద్ర మోడీకి ధైర్యముంటే స్వతంత్ర విచారణకు అంగీకరించాలని సవాల్ విసిరింది. ఫట్టా బీజేపీకి, మోడీకి మద్దతు దారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా చెప్పారు. హవాల కేసులో ఆయన్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసిందని చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాపై బీజేపీ సీడీని విడుదల చేసిన మరుసటి రోజు కాంగ్రెస్ మోడీపై సీడీ విడుదల చేయడం గమనార్హం. భూ కంభకోణాల్లో వాద్రా పాత్ర ఉందని బీజేపీ ఆ సీడీల్లో ఆరోపించింది. -
సీడీల సిత్రాలు...
కంప్యూటర్లు వాడుకలోకి వచ్చాక సీడీల ఉపయోగం లెక్కకు మించి పెరిగింది. పాటలు వినాలన్నా, ఫొటోలు నిక్షిప్తం చేసుకోవాలన్నా, సినిమాలైనా, ప్రాజెక్ట్ వర్క్ అయినా, పరదేశీ విచిత్రాలైనా.. సీడీలలో పొందుపరుచుకోవడం మామూలైపోయింది. ఈ క్రమంలో పాడైపోయాయి అనుకున్న సీడీలను ఏం చేస్తారు? ‘చెత్తబుట్టలోకి చేర్చుతాం’ అనే సమాధానం మీదైతే ఇది మీకోసమే...! పనికి రావనుకున్న సిడీలకు మీదైన కొంత సృజనను జోడిస్తే చాలు ఇంటి అందాన్ని పెంచేవి, ఉపయుక్తమైన ఎన్నో వస్తువులను తయారుచేసుకోవచ్చు. లేసులున్న రెండు వరసల రిబ్బన్‌కు మూడు నాలుగు సీడీలను అతికించి, ఆ సీడీల భాగంలో మీ ఫొటోలను సెట్ చేయండి. అందమైన ఫొటో వాల్ హ్యాంగర్ ఆకట్టుకుంటుంది రంగురంగుల వెల్వెట్ పేపర్‌ను సీడీలపై అతికించి చమ్కీ, అద్దకంతో మెరుపులు తీసుకువస్తే ముచ్చటగొలిపే సీనరీ సిద్ధమవుతుంది సీడీ మధ్యలో వెడల్పాటి రంధ్రం ఉంటుంది. ఐరన్ రాడ్‌కి సీడీలను గుచ్చి, దుస్తులను తగిలించే హ్యాంగర్‌లా ఏర్పాటు చేసుకోవచ్చు సీడీకి ఒకవైపు రంగుల కాగితాన్ని అతికిస్తే గ్లాసులు, కప్పులు ఉంచడానికి కోస్టర్స్ రెడీ సీడీలే కాదు సీడీ కేస్లు కూడా ఖాళీగా పడుంటాయి. వీటి మధ్య భాగంలో నచ్చిన క్యాలెండర్ పేపర్ని సెట్ చేయాలి. టేబుల్ క్యాలెండర్‌గా వాడుకోవచ్చు ఇంటి మధ్యలో పైకప్పుకు వేలాడదీయడానికి మార్కెట్లో రకరకాల హ్యాంగర్స్ కొనుగోలు చేస్తుంటారు. వాటికి బదులుగా రంగుల పేపర్‌తో సిద్ధం చేసుకున్న సీడీకి చివర్ల పూసల దారాలు జత చేస్తే చూడముచ్చటైన షాండ్లియర్ కనువిందుచేస్తుంది భానుడు, గజాననుడు.. దేవుళ్ల రూపాలను సీడీలతో రూపొందించవచ్చు మూడు సీడీలను తీసుకొని త్రికోణాకారంలో చివరలను జత చేయాలి. పైన కొలనులా వచ్చేలా పేపర్‌ను రకరకాలుగా మడిచి అందమైన క్రాఫ్ట్‌ను తయారుచేయవచ్చు. పువ్వులతో షో పీస్ ఆకట్టుకుంటుంది ఒక సీడీని తీసుకొని రంగురంగుల వస్త్రాలు, లేసులు ఉపయోగించి అందమైన సీనరీని రూపొందించవచ్చు పూల కుండీలు ప్లెయిన్‌గా ఉంటే అందంగా లేవా? అయితే విరిగిన సీడీలను మరిన్ని ముక్కలుగా కత్తిరించి కుండీలకు గట్టి గ్లూతో అతికించండి. ఎన్ని రంగులు కుండీ రిఫ్లెక్స్ చేస్తుందో చూడండి సీడీ కేసులను నాలుగు కలిపి ఒక బాక్స్లా రూపొందించవచ్చు. దాన్ని పెన్హోల్డర్గానో, లేదా ఫొటో ఆల్బమ్స్ సెట్ చేసుకునే స్టాండ్గానో వాడుకోవచ్చు. పిల్లల ఫొటోలతో ఉండే సీడీ కేస్ టేబుల్ మీద పెడితే మరింత అందంగా ఉంటుంది సీడీని వాల్ క్లాక్గానూ మార్చేయవచ్చు. పాత సీడీలతో ఇన్ని రకాల వస్తువులను తయారుచేయవచ్చు అని తెలిశాక వాటిని చెత్తబుట్ట పాల్జేయడం ఎందుకు? చక్కని ఇంటి అలంకరణ వస్తువులుగా మార్చడానికి ఇప్పుడే పనిని మొదలుపెట్టండి. సీడీలతో రకరకాల చిత్రాలు రూపొందించి ‘ఏమిటీ వి‘సిత్రం’ అని ముక్కున వేలేసుకునేలా చేయండి. -
సీవీ అంటే బాంబులు!
సాక్షి, హైదరాబాద్: కరిక్యులమ్ విటె (సీవీ) అంటే బయోడేటా అనేది అందరికీ తెలిసిన విషయం. కానీ ఉగ్రవాదుల పరిభాషలో మాత్రం పేలుడు పదార్థాలు! సీడీ అంటే పిస్టల్, డీవీడీ అంటే ఏకే-47. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో పేలుళ్లు సృష్టించేందుకు ఈ మెయిల్ ద్వారా కోడ్ భాషలో పంపుకునే సమాచారాలను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) డీ కోడ్ చేసింది. ఢిల్లీ అధికారులు ఉగ్రవాది యాసిన్ భత్కల్ను విచారించిన సమయంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ మెయిల్ చాటింగ్ ద్వారా పాకిస్థాన్‌లో ఉన్న ఇక్బాల్ భత్కల్, రియాజ్ భత్కల్‌తో సంబంధాలను కొనసాగించినట్లు యాసిన్ చెప్పాడు. ఈ మెయిల్ సందేశాలను పరిశీలించిన అధికారులు అవి కోడ్ భాషలో ఉండటంతో యాసిన్ వెల్లడించిన వివరాల ప్రకారం వాటిని డీ కోడ్ చేశారు. వెలుగుచూసిన వివరాలను నాంపల్లి కోర్టుకు సమర్పించారు. ఆ వివరాలను ‘సాక్షి’ సంపాదించింది. పాక్ నుంచి రియాజ్ ‘పటారాసింగ్ యట్ యాహూ డాట్‌కామ్’ మెయిల్ ఐడీతో యాసిన్‌తో నిరంతరం సంబంధాలు కొనసాగించాడు. యాసిన్ ‘బహద్దూర్ యట్ యాహూ డాట్‌కామ్’ ఐడీతో సంప్రదింపులు జరిపాడు. కరాచీ ఆపరేషన్ పేరుతో భారత్‌లో వంద పేలుళ్లకు జరిగిన కుట్రకు సంబంధించి కూడా ఉగ్ర నేతలతో యాసిన్ ఈ విధానంలోనే సంప్రదింపులు జరిపినట్లు ఎన్ఐఏ విచారణలో తేలింది. దిల్సుఖ్నగర్ పేలుళ్లకు ముందుకూడా మొత్తం ప్రణాళిక పూర్తయిందని, త్వరలో సంతోషకరమైన వార్త వింటారని రియాజ్‌కు యాసిన్ తెలిపాడు. ఫిబ్రవరి 21న పేలుళ్లకు సరిగ్గా ఒకరోజు ముందు కూడా చాటింగ్ జరిగింది. పేలుళ్ల తరువాత తిరిగి ఫిబ్రవరి 28న వీరు సందేశాలు పంపుకున్నారు. పేలుళ్ల ద్వారా ప్రజలను బాగా భయబ్రాంతులకు గురిచేశారంటూ యాసిన్‌కు పాకిస్థాన్ నుంచి అభినందన సందేశాలందాయి. తదుపరి పేలుళ్ల కుట్రలకు సంబంధించి కూడా యాసిన్ పాక్ ఉగ్రనేతలకు చాటింగ్ ద్వారా వివరించాడు. వంద పేలుళ్లకు సీవీ (పేలుడు పదార్ధాలు) ఇప్పటికే సిద్ధం చేసుకున్నానని చెప్పాడు. ప్రధానంగా పుణే, ముంబయి. గుజరాత్, హైదరాబాద్‌కు సంబంధించిన ప్రస్తావనలే వారి మెసేజ్‌లలో ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఎక్కడెక్కడ పేలుళ్లకు కుట్రలు చేశారు? పేలుడు పదార్థాలు నిల్వ ఉంచిన రహస్య డెన్లు ఎక్కడున్నాయి? అనే సమాచారం యాసిన్ నుంచి రాబట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్‌లో ఉగ్రవాదులు ఆశ్రయం పొందిన ప్రాంతాలకు యాసిన్, తబ్రేజ్‌లను తీసుకెళ్లి తనిఖీలు నిర్వహించే ప్రక్రియ కొనసాగుతోంది. కాగా, చాటింగ్ మెసేజ్‌లలో ‘సబ్ మెరైన్’ పేరిట కొంత సమాచారం ఉండటంతో ఎన్ఐఏ దీనిపై ఆరా తీస్తోంది. ఉగ్రవాదుల కోడ్ భాషలో కొన్ని... సీవీ పేలుడు పదార్థాలు సీడీ పిస్టల్ డీవీడీ ఏకే 47 ఖల్దీ పాస్‌పోర్టు ఏజెన్సీ ఐఎస్ఐ నెవె ఎన్ఐఏ మెట్రో పుణే జి/జెజూ గుజరాత్ గావ్ ముంబై దబ్ దుబాయ్ వాగు అల్‌కాయిదా ప్రిన్స్ యాసిన్ భత్కల్ బెబొ ఇక్బాల్ భత్కల్ బీబీ ఇక్బాల్ స్నేహితురాలు సమీర్ అసదుల్లా అక్తర్ అలియాస్ తబ్రేజ్ అఫ్తాబ్ మోహిసిన్ చౌదరి -
బతుకమ్మ సిడిని విడుదల చేసిన కెసిఆర్