
‘ది కేరళ స్టోరీ’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత అదా శర్మ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సీడీ’. ‘క్రిమినల్ ఆర్ డెవిల్’ అనేది ఉపశీర్షిక. కృష్ణ అన్నం దర్శకత్వంలో ఎస్‌ఎస్‌సీఎమ్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సైకలాజికల్ అండ్ హారర్ థ్రిల్లర్ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ‘‘ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇచ్చే చిత్రం ఇది. త్వరలోనే రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. విశ్వంత్, ‘జబర్దస్త్’ రోహిణి, భరణి శంకర్, రమణ భార్గవ్, మహేష్ విట్టా కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఆర్‌ఆర్ ధృవన్, కెమెరా: సతీష్ ముత్యాల.