చేనేత కార్మికుల స్థితిగతులపై సీడీ ఆవిష్కరణ | cd released on jowli workers | Sakshi
Sakshi News home page

చేనేత కార్మికుల స్థితిగతులపై సీడీ ఆవిష్కరణ

Published Fri, Aug 19 2016 12:25 AM | Last Updated on Mon, Sep 4 2017 9:50 AM

cd released on jowli workers

ఆత్మకూర్‌(నర్వ) : అమరచింతలో గురువారం మార్కండేయ స్వామి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో పద్మశాలి కులస్తులు రాఖీపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. సాయంత్రం ప్రభోత్సవాన్ని నిర్వహించారు.  అనంతరం గ్రామానికి చెందిన మహంకాళి శ్రీనివాసులు కాడ్గిగణేష్‌ సహకారంతో నిర్మించిన చేనేత బతుకులపై పాటలు పాడిన సీడీని గ్రామపెద్దల సమక్షంలో ఆవిష్కరించారు. పద్మశాలి సంఘ అభివృద్ధికి శ్రీ ఫౌండేషన్‌ సంస్థ నిర్వాహకుడు రూ.2 లక్షల విరాళం అందజేశారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ సుధారాణి, ఎంపీటీసీ మహంకాళి విష్ణు, ప్రముఖ గాయకుడు సాయిచంద్, గద్వాల జరీచీరల వ్యాపారి మహంకాళి శ్రీనివాసులు, పద్మశాలి సంఘం అధ్యక్షుడు దేవరకొండ లచ్చన్న, కార్యదర్శి కొంగరి భాస్కర్, చిలువరి రాములు, పారుపల్లి చింతన్న, రంగు మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement