Criminal or Devil Review: అదా శర్మ హారర్‌ మూవీ ఎలా ఉందంటే.. ? | CD (Criminal or Devil) Movie Review And Rating In Telugu | Sakshi
Sakshi News home page

Criminal or Devil Review: అదా శర్మ హారర్‌ మూవీ ఎలా ఉందంటే.. ?

Published Fri, May 24 2024 5:50 PM | Last Updated on Fri, May 24 2024 5:59 PM

CD (Criminal or Devil) Movie Review And Rating In Telugu

టైటిల్‌:  C.D (క్రిమినల్ ఆర్ డెవిల్) 
నటీనటులు: అదా శర్మ, విశ్వంత్, జబర్దస్త్ రోహిణి, భరణి శంకర్, రమణ భార్గవ్, మహేష్ విట్టా 
నిర్మాణ సంస్థ: SSCM ప్రొడక్షన్స్
దర్శకుడు: కృష్ణ అన్నం
సంగీతం: ఆర్‌ఆర్‌ ధృవన్‌
సినిమాటోగ్రఫీ: సతీష్‌ ముత్యాల
ఎడిటర్‌: సత్య గిడుతూర్‌
విడుదల తేది: మే 24, 2024

ది కేరళ ఫైల్స్, బస్తర్ వంటి సినిమాలతో అదా శర్మ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. టాలీవుడ్‌, బాలీవుడ్‌ అనే తేడా లేకుండా అంతటా ఆమెకు ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పెరిగిపోయింది. ఇక చాలా కాలం తర్వాత మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ బ్యూటీ. ఆమె నటించిన తాజా చిత్రం ‘C.D క్రిమినల్ ఆర్ డెవిల్’ నేడు (మే 24) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.


కథేంటంటే..
సిద్ధు(విశ్వంత్‌)కి దెయ్యాలు అంటే చాలా భయం. ఓ సారి అమ్మానాన్నలు ఊరికి వెళ్లడంతో ఒంటరిగానే ఇంట్లో ఉండాల్సి వస్తుంది. పని మనిషి (జబర్దస్త్ రోహిణి) అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటుంది. ఒంటరిగా డెవిల్ అనే దెయ్యం సినిమా చూసి సిద్ధు మరింత బయపడిపోతాడు. సినిమాలోని దెయ్యం బయటకు వచ్చి తనను చంపేస్తుందని బయపడుతుంటాడు. ఇలా సిద్దు ఇంట్లో ఒంటరిగా ఉంటున్న సమయంలోనే అమ్మాయిలను కిడ్నాప్ చేసే ఓ లేడీ సైకో రక్ష (అదా శర్మ) బయట అందరిలోనూ భయాన్ని పుట్టిస్తుంది. ఐ విల్ కిల్ యూ అని రాస్తూ  కిడ్నాపులు చేస్తుంటుంది. పోలీసులు ఎంత ప్రయత్నించినా..ఆమె దొరకదు. అలా తప్పించుకుంటూ చిరవకు విశ్వంత్ కోసం వచ్చి, అతని ఇంట్లోనే ఉంటుంది. విశ్వంత్‌కి ఉన్న సమస్య ఏంటి? రక్షగా అదా శర్మ ఎందుకు వచ్చింది? అసలు అమ్మాయిల్ని కిడ్నాప్ చేస్తుంది ఎవరు? చివరకు పోలీసులు ఏం చేశారు? అన్నది కథ.

ఎలా ఉందంటే.. 
హారర్, సస్పెన్స్, కామెడీ, థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కిన సినిమానే ఈ C.D. దర్శకుడు రాసుకున్న పాయింట్‌ బాగుంది కానీ దాన్ని తెరపై ఆసక్తికరంగా చూపించడంలో కాస్త తడబడ్డాడు. ఈ కథంతా ఒకే చోట జరుగుతుంది. దీంతో కథనం కాస్త సాగదీతగా అనిపిస్తుంది. అలాగే కొన్ని సీన్లు మరీ సినిమాటిక్‌గా అనిపిస్తాయి కానీ ఆకట్టుకుంటాయి. ప్రేక్షకులను భయపెట్టడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. సినిమా ప్రారంభంలో వచ్చే కొన్ని సన్నివేశాలు  ఇల్లాజికల్‌గా అనిపిస్తాయి కానీ అవి ఎందుకు పెట్టారనేది చివర్లో తెలుస్తుంది. ఇంటర్వెల్  సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచేలా ఉంటుంది. ఇక ద్వితియార్థంలో  హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సన్ని వేశాలు కొన్ని రొమాంటిక్‌గా అనిపిస్తే.. ఇంకొన్ని సార్లు హారర్ ఎలిమెంట్స్‌ని తలపిస్తాయి. ఇక మధ్య మధ్యలో రోహిణి పాత్ర చేసే కామెడీ నవ్విస్తుంది. చివర్లో ఇచ్చిన ట్విస్ట్ బాగుంటుంది. నగరంలో అమ్మాయిల మిస్సింగ్‌ విషయంలో చివరన ఇచ్చిన ట్విస్ట్ అదిరిపోతుంది. క్లైమాక్స్‌లో ఎవరూ ఊహించని ట్విస్ట్‌ ఉంటుంది.

ఎవరెలా చేశారంటే.. 
ఆదా వర్మ మరోసారి తనదైన నటనతో ఆకట్టుకుంది. రక్ష పాత్రలో ఆమె ఒదిగిపోయింది. చూపుల్తోనే  అందరిని భయపెట్టేసింది. యాక్షన్ సీక్వెన్స్‌లో అదరగొట్టేస్తుంది. ఇక విశ్వంత్ అయితే తన వేరియేషన్స్ చూపించాడు. విశ్వంత్ పాత్ర ఈ సినిమాకు హైలెట్ అవుతుంది. రోహిణి  కామెడీ సినిమాకు ప్లస్‌ అయింది. పోలీస్ ఆఫీసర్‌గా భరణి మెప్పిస్తాడు. ఇక మిగిలిన పాత్రలు పర్వాలేదనిపిస్తాయి. సాంకేతిక విషయాలకొస్తే..ఈ సినిమాకు ప్రధాన బలం ఆర్‌ఆర్‌ ధృవన్‌ సంగీతం. తనదైన బీజీఎంతో కొన్ని చోట్ల భయపెట్టాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement