కర్నూలులో హీరో ధనుష్ సందడి
- ఆడపిల్ల పాట సీడీ ఆవిష్కరణ
పాణ్యం: జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ రాసిన ఆడపిల్ల పాట సీడీని ప్రముఖ తమిళ హీరో ధనుష్ మంగళవారం తమ్మరాజుపల్లె గ్రామ సమీపంలో పవర్ పాండి చిత్ర నిర్మాణ సన్నివేశాల చిత్రకరణ సందర్భంగా ఆవిష్కరించారు. అనంతరం పాటలను విని అర్థాన్ని అక్కడున్న వారితో అడిగి తెలుసుకున్నారు. పాటలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. పోలీసు వృత్తిలో ఎన్నో ఒత్తిళ్లు ఉంటాయని.. అయినప్పటికీ సమాజం కోసం ఇలాంటి పాటలు రాయడం అభినందనీయమన్నారు. పాటలను అన్ని భాషల్లో అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో నంద్యాల డీఎస్పీ హరినాథ్‌రెడ్డి , పాణ్యం సీఐ పార్థసారధిరెడ్డి, పాణ్యం ఎస్‌ఐ మురళీమోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
కాగా ధనుష్ పాణ్యం మండలం తమ్మరాజుపల్లె గ్రామ సమీపంలో మంగళవారం ఓ షూటింగ్‌లో పాల్గొన్నారు. వండర్‌బార్ ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తున్న పవర్ పాండి చిత్ర షూటింగ్ గ్రామ సమీపంలోని రాజస్థాన్ డాబా వద్ద జరిగింది.